News


నష్టాల్లోంచి లాభాల్లోకి...

Wednesday 26th June 2019
Markets_main1561526559.png-26576

అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో నేడు మార్కెట్‌ నష్టాలతో మొదలైనప్పటికీ.., తిరిగి లాభాల్లో మళ్లింది. నైరుతి రుతుపవనాలు శరవేగంగా ఉత్తర, మధ్య భారతదేశమంతటా విస్తరించాయనే ఐఎండీ ప్రకటన, దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుండటం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫార్మా, అటో, ఆర్థిక, బ్యాంకింగ్‌, మీడియా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి బలహీనత కారణంగా ఐటీ షేర్లు నష్టపోయాయి. అలాగే మెటల్‌ షేర్లు సైతం స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా మార్కెట్‌ ప్రారంభమైన అరగంటకే తిరిగి లాభాల బాట పట్టింది. ఓ దశలో నిఫ్టీ ఇండెక్స్‌ 43 పాయింట్లు లాభపడి 11,839.10 వద్ద, సెన్సెక్స్‌ 165 పాయింట్లు పెరిగి  39,599.40 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేసింది. ఉదయం గం. 10:30ని.లకు సెన్సెక్స్‌ 80.08పాయింట్ల లాభంతో 39,515.02 వద్ద, నిఫ్టీ 24 పాయింట్లు పెరిగి 11,820.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

ఇదే సమయానికి, అదానీపోర్ట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం నుంచి 3.50శాతం లాభపడగా, వేదాంత, టాటాస్టీల్‌, బ్రిటానియా, బీపీసీఎల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి. 



You may be interested

12,000 డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌

Wednesday 26th June 2019

తాజాగా ఫేస్‌బుక్‌ తన డిజిటల్‌ కరెన్సీ లిబ్రాను ఆవిష్కరించడంతో బిట్‌కాయిన్‌ ఈ ఏడాది గరిష్ఠాన్ని తాకింది. 2018 జనవరి తర్వాత మొదటిసారి బిట్‌కాయిన్‌ ధర 12,000 డాలర్లను దాటింది. ఈ ఏడాది ప్రారంభం​నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే బిట్‌కాయిన్‌ ధర 216 శాతం పెరిగింది. జనవరి 1న 3,843.52 డాలర్లుగా దీని ధర ఉండేది. కానీ 2017లో రికార్డు ధర 20,000 డాలర్లకు దిగువనే ఉండడం గమనార్హం.  ఇంకోవైపు ఇదే సమయంలో

సీపీలను చెల్లించలేక నష్టపోయిన డీహెచ్‌ఎఫ్‌ఎల్‌

Wednesday 26th June 2019

కమర్షియల్‌ పేపర్స్‌(సీపీ) తిరిగి చెల్లింపులో జాప్యం చేయడంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌) బుధవారం(జూన్‌26) ట్రేడింగ్‌ ప్రారంభంలో 9 శాతం నష్టపోయింది. రూ.375 కోట్ల సీపీ చెల్లింపులను చేస్తానని మాటయిచ్చి మంగళవారం 40 శాతం మాత్రమే తిరిగి చెల్లించింది. మిగిలిన నగదును రెండు రోజుల్లో తీరుస్తామని కంపెనీ తెలిపింది.  అమ్మిన ఆస్తికి సంబంధించిన నగదు సమయానికి చేతికందలేదని కంపెనీ వివరించింది. ‘ మేం చెల్లించవలసిన రూ.375 కోట్లలో 40 శాతం చెల్లించాం. మిగిలిన

Most from this category