News


విస్తృత ర్యాలీ కొనసాగుతుంది!

Tuesday 24th December 2019
Markets_main1577172569.png-30408

ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ సచిన్‌ షా
ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలు దేశీయ వినిమయ రంగంలో వృద్దిని ఊపందుకునేలా చేస్తాయని, దీంతో అన్ని రంగాల్లో పునరుజ్జీవం కనిపిస్తుందని ఎమ్‌కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్‌ సచిన్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వచ్చే ఏడాది మార్కెట్‌ ర్యాలీ విస్తృతమవుతుందని అంచనా వేశారు. చిన్న, మధ్యతరహా స్టాకుల్లో అప్‌ట్రెండ్‌ ఆరంభమవుతుందన్నారు. వీటిలో మంచి మేనేజ్‌మెంట్‌ ఉన్న నాణ్యమైన కంపెనీల షేర్లు ఇతరాల కన్నా ముందంజలో ఉంటాయని, ఇలాంటి వాటిని గుర్తించేందుకు తాము ఈక్వల్‌ అని ఒక విధానం కనిపెట్టామని చెప్పారు. కొత్త ఏడాదిలో కూడా బ్యాంకింగ్‌ స్టాకుల హవా, ముఖ్యంగా ప్రైవేట్‌ బ్యాంకుల హవా కొనసాగుతుందని ఆయన చెప్పారు. పీఎస్‌బీలకు కూడా మూలధన కష్టాలు తీరతాయన్నారు. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో అన్ని బ్యాంకులు మంచి ఫలితాలు చూపవచ్చని అంచనా వేశారు. గత రెండేళ్లుగా జరుగుతున్న ర్యాలీ చాలా సంకుచితమైనదని, కేవలం కొన్ని స్టాకులకే పరిమితమైందని తెలిపారు. కానీ ఇకపై పరిస్థితి మారుతుందని, ర్యాలీ విస్తృత స్థాయిలో ఉండొచ్చని తెలిపారు. ప్రస్తుతం పలు స్టాకుల వాల్యూషన్లు కనిష్ఠాలకు చేరి, అవన్నీ ఆకర్షణీయంగా మారాయన్నారు. 
వీటిపై బుల్లిష్‌
ఆస్తుల నాణ్యత, దిగివచ్చిన వడ్డీరేట్లు వంటివి ప్రైవేట్‌ బ్యాంకులను ఆకర్షణీయంగా మారుస్తాయని సచిన్‌ చెప్పారు. వీటిలో బడా బ్యాంకులు మంచి వృద్ధి సాధించగలవన్నారు. వీటితో పాటు యూఎస్‌ వ్యాపారంలో మెరుగుదల ఫార్మా కంపెనీలను బుల్లిష్‌గా మార్చవచ్చన్నారు. హెల్త్‌కేర్‌ రంగంలో మూలధన పెట్టుబడులు సత్ఫలితాలు ఇచ్చే సమయం ఆరంభమైనందున, ఈ రంగంపై కూడా బుల్లిష్‌గా ఉన్నామన్నారు. కొత్త ఏడాదిలో సంస్కరణల జోరు కొనసాగుతుందని సచిన్‌ చెప్పారు. పెద్ద పీఎస్‌యూల్లో వాటాల ఉపసంహరణ, వైయుక్తిక ఆదాయపన్ను తగ్గింపు.. లాంటి ఎకానమీలో జోరును, వినియమంలో వృద్ధిని పెంచుతాయన్నారు. లిక్విడిటీలో కొరత, ఎఫ్‌ఐఐల ప్రవాహం సన్నగిల్లడం, సిప్‌ పథకాల్లోకి నిధుల రాక తగ్గడం, ట్రేడ్‌వార్‌ తిరిగి కొనసాగడం వంటివి పైన చెప్పిన పాజిటివ్‌ వాతావరణాన్ని మాయం చేయగలవని, ఇవన్నీ మార్కెట్‌కు ఎదురయ్యే రిస్కులని ఆయన వివరించారు. You may be interested

త్వరలో పెట్రో, డీజిల్‌ బాదుడు..!?

Tuesday 24th December 2019

వాహన వినియోగదారులపై త్వరలో పెట్రో, డీజిల్‌ ధరల భారం పిడుగుపడుతుందా.!? అవుననే అంటున్నాను వార్తాసంస్థల కథనాలు. బీఎస్‌-VI నిబంధనలకు అనుగుణమైన ఇంధనం ఉత్పత్తికి అయ్యే వ్యయాలను భరించేందుకు ఆయిల్‌ కంపెనీలకు ఐదేళ్ల కాలానికి పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచుకునే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నది.  ఒ‍కవేళ ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపితే.., లీటరు పెట్రోల్‌ ధర రూ.0.80పైసలు, లీటరు డీజిల్‌పై రూ.1.50పైసల భారాన్ని వినియోగదారులు భరించాల్సి ఉంటుందని ఏఎన్‌ఐ వార్తా సంస్థ

7వారాల గరిష్టానికి పసిడి

Tuesday 24th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర మంగళవారం 7వారాల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా ఆర్థిక గణాంకాలు నిరుత్సాహరచడం, వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్యంతరం ఒప్పందంపై ఆందోళనలు పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ను పెంచాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర కిత్రం ముగింపు(1,488.70 డాలర్లు)తో పోలిస్తే 6డాలర్ల పెరిగి 1,495 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నవంబర్‌ 07 తరువాత పసిడి ఈ స్థాయిని అందుకోవడం ఇదే

Most from this category