News


ఫలితాలు, గణాంకాలే నడిపిస్తాయ్‌..!

Monday 4th November 2019
Markets_main1572837179.png-29312

  • హెచ్‌డీఎఫ్‌సి, టైటాన్, పీఎన్‌బీ, డాబర్, టెక్ మహీంద్రా, 
  • టాటా స్టీల్, సన్ ఫార్మా, సిప్లా ఫలితాలు ఈవారంలోనే..
  • స్థూల ఆర్థికాంశాలపై మార్కెట్‌ దృష్టి
  • ఒడిదుడుకులకు ఆస్కారం: సామ్కో సెక్యూరిటీస్‌

ముంబై: కంపెనీల క్యూ2(జూలై–సెప్టెంబర్‌) ఫలితాల వెల్లడి, స్థూల ఆర్థిక గణాంకాలు, అమెరికా–చైనా వాణిజ్య చర్చల వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నందున ఈవారంలో వెల్లడికానున్న పలు కంపెనీల ఫలితాలు సైతం మార్కెట్లో సానుకూలతను నింపేందుకు ఆస్కారం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ బాగా తగ్గి ఉన్న రంగాల షేర్లకు కొనుగోలు మద్దతు లభించవచ్చని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమీత్‌ మోడీ అన్నారు. అయితే, ఫలితాలకు మించి చెప్పుకోదగిన స్థాయిలో కీలక పరిణామాలేవీ ఈ వారంలో లేకపోవడం వల్ల ఫలితాలు ఏ మాత్రం నిరాశపరిచినా ప్రధాన సూచీలకు ఒడిదుడుకులు తప్పవని విశ్లేషించారు. కార్పొరేట్‌ పన్నుల తగ్గింపు, రిజల్స్‌ నేపథ్యంలో భారీ లాభాలను నమోదుచేసిన షేర్లల్లో లాభాల స్వీకరణ అవకాశం ఉందని వివరించారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఈ వారం దేశీ మార్కెట్ల ప్రయాణం ఉండనుందని తాను భావిస్తున్నట్లు ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. 

650 కంపెనీల ఫలితాలు..
ఈవారంలో 650 కంపెనీలు తమ రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనుండగా.. ఈ జాబితాలో ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, సన్ ఫార్మా, పీఎన్‌బీ, డాబర్, టాటా స్టీల్, సిప్లా, కెనరా బ్యాంక్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఎన్‌టీపీసీ ఫలితాలు వెల్లడించనున్నాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, లుపిన్‌, ఇమామీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌, మణప్పురం, వోల్టాస్‌, గోద్రేజ్‌ కన్సూమర్‌, బీఎస్‌ఈ, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌, వీఐపీ ఇండస్ట్రీస్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌, టాటా పవర్‌, టీటీకే ప్రెస్టేజ్‌, మహీంద్ర హాలిడేస్‌ ఫలితాలు ఈ వారంలోనే వెల్లడికానున్నాయి. వీటితో పాటు ఎన్‌టీపీసీ, జేకే సిమెంట్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, అలహాబాద్‌ బ్యాంక్‌, ఆయిల్‌ ఇండియా ఫలితాలను ప్రకటించానున్నాయి.

ఆటో రంగంపై మార్కెట్‌ దృష్టి...
ఎం అండ్‌ ఎం, ఐషర్ మోటార్స్, అశోక్ లేలాండ్, ఎంఆర్‌ఎఫ్‌, అమర రాజా బ్యాటరీస్‌, ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు ఈవారంలో వెల్లడికానున్నాయి. ఫలితాల నేపథ్యంలో ఆటో రంగంపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించాయి. ఎం అండ్‌ ఎం అమ్మకాలు 16.3 శాతం పడిపోయిన కారణంగా ఈ సంస్థ క్యూ2 ఫలితాల్లో రెండంకెల క్షీణత ఉండవచ్చని భావిస్తున్నాయి. ఏడాది ప్రాతిపదికన నిర్వహణ లాభం మార్జిన్లలో 100-200 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గుదల ఉండవచ్చని విశ్లేషిస్తున్నాయి. ఐషర్ మోటార్స్ ఆదాయంలో 10 శాతం తగ్గుదల ఉండవచ్చని, వాణిజ్య వాహనాల దిగ్గజమైన అశోక్ లేలాండ్ ఆదాయంలో 45 శాతం క్షీణత ఉండవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి.

స్థూల ఆర్థికాంశాలు...
అక్టోబర్‌ మార్కిట్ సర్వీసెస్ పీఎంఐ డేటా మంగళవారం విడుదలకానుంది. ఈ అంశానికి తోడు అమెరికా–చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు, బ్రెగ్జిట్‌ అంశాలు కీలకంగా ఉన్నాయి. 

రూ. 16,464 కోట్ల ఎఫ్‌ఐఐ పెట్టుబడి...
అక్టోబర్‌ 1-31 కాలానికి ఎఫ్‌ఐఐలు భారత ఈక్విటీ మార్కెట్లో రూ. 12,475 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఈకాలంలో వీరు డెట్‌ మార్కెట్లో రూ. 3,989 కోట్లు పెట్టుబడి పెట్టడం ద్వారా ఈనెల్లో వీరి నికర పెట్టుబడి రూ. 16,464 కోట్లుగా నిలిచింది



You may be interested

సెన్సెక్స్‌ తక్షణ మద్దతుశ్రేణి 39,920–39,800

Monday 4th November 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ మరోదఫా వడ్డీ రేట్లను తగ్గించడం, అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్‌ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అమెరికా, బ్రెజిల్‌ సూచీలు కొత్త రికార్డుల్ని అందుకోగా, పలు యూరప్, ఆసియా సూచీలు నెలల గరిష్టస్థాయికి పెరిగాయి. ఈ ట్రెండ్‌తో పాటు  అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్‌ కలిసికట్టుగా  కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఇప్పటికే కొత్త రికార్డు స్థాయిని చేరగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ

2019లో తగ్గిన ఎన్‌ఎఫ్‌వోలు

Sunday 3rd November 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి 125 మ్యూచువల్‌ ఫండ్‌ నూతన పథకాల ఆవిష్కరణ కోసం (ఎన్‌ఎఫ్‌వో) సెబీ వద్ద దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో కొన్నింటికి సెబీ అనుమతివ్వడంతో అవి నిధుల సమీకరణ కూడా చేపట్టాయి. కానీ, క్రితం ఏడాది 2018లో 211 నూతన పథకాల కోసం దరఖాస్తులు రాగా, వాటితో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ప్రధానంగా మార్కెట్లో

Most from this category