News


మార్కెట్‌ ఎటు?

Wednesday 5th December 2018
Markets_main1543981422.png-22629

బుధవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..


♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.  సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 64 పాయింట్ల నష్టంతో 10,848 పాయింట్ల వద్ద ఉంది. 

♦ రిజర్వు బ్యాంక్‌ బుధవారం (నేడు) జరగనున్న పాలసీ సమావేశంలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం, వృద్ధి నెమ్మదించడం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. 

♦ క్రూడ్‌ ధరలు బుధవారం ఒక శాతం మేర తగ్గాయి. అమెరికా ఇన్వెంటరీలు పెరగడం సహా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన ఆందోళనల వల్ల గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్లు పడిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. అమెరికా డబ్ల్యూటీఐ క్రూడ్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 52.61 డాలర్ల వద్ద, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ఫ్యూచర్స్‌ ధర బ్యారెల్‌కు 61.52 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి.

♦ లిక్విడిటీని పెంచేందుకు రిజర్వు బ్యాంక్‌ డిసెంబర్‌ 6న ఓపెన్‌ మార్కెట్‌లో ప్రభుత్వ బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి రూ.10,000 కోట్లను తీసుకురానుంది. 

♦ క్రూడ్‌ ధరల పెరుగుదల సహా దిగుమతిదారుల నుంచి అమెరికా కరెన్సీకి డిమాండ్‌ పెరడగం కారణంగా ఇండియన్‌ రూపాయి డిసెంబర్‌ 4న 3 పైసలు క్షీణంచి 70.49కు తగ్గింది. 

♦ దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) వేగంగా పుంజుకుంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో నమోదైన 8.2 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. గత త్రైమాసికంలో నమోదైన స్థాయిలోనే జీడీపీ వృద్ధి మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌)లోనూ ఉండొచ్చని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ అంచనా వేశారు. 

♦ ఉక్కు, అల్యూమినియం దిగుమతి సుంకాల విషయంలో అమెరికాతో తలెత్తే వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న భారత్ అభ్యర్థనపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సానుకూలంగా స్పందించింది. కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.

♦ అమెరికా మార్కెట్ల పతనం నేపథ్యంలో ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ బుధవారం నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 30 పాయింట్ల నష్టంతో 3,138 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 151 పాయింట్ల నష్టంతో 9,932 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 15 పాయింట్ల నష్టంతో 2,651 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 8 పాయింట్ల నష్టంతో 2,105 పాయింట్ల వద్ద, హాంగ్‌కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ ఏకంగా 396 పాయింట్ల నష్టంతో 26,864 పాయింట్ల వద్ద, జపాన్‌ నికాయ్‌ 225.. 89 పాయింట్ల నష్టంతో 21,946 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. తైవాన్‌, హాంగ్‌ సెంగ్‌ ఇండెక్స్‌లు ఒక శాతానికి పైగానే పడిపోయాయి. 

♦ అమెరికా మార్కెట్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 3.1 శాతం లేదా 799 పాయిం‍ట్ల నష్టంతో 25,027 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 3.24 శాతం లేదా 90 పాయింట్ల నష్టంతో 2,700 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 3.8 శాతం లేదా 283 పాయింట్ల నష్టంతో 7,158 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంక్‌, ఇండస్ట్రీయల్‌ షేర్లు పడిపోవడంతో ఇండెక్స్‌లు నష్టపోయాయి. దీర్ఘకాల అమెరికా ట్రెజరీ ఈల్డ్స్‌ క్షీణించడం, ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళనలు చెలరేగడం వల్ల ఇండెక్స్‌లు పడిపోయాయి. You may be interested

నష్టాల ఆరంభం

Wednesday 5th December 2018

నిఫ్టీ 60 పాయింట్లు డౌన్‌ 36,000 దిగువున సెన్సెక్స్‌ ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,869 పాయింట్లతో పోలిస్తే 49 పాయింట్ల నష్టంతో 10,820 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 36,134 పాయింట్లతో పోలిస్తే 99 పాయింట్ల నష్టంతో 36,035 పాయింట్ల వద్ద గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైంది. సమయం గడిచే కొద్ది ఇండెక్స్‌ నష్టాలు కూడా పెరిగాయి. ఉదయం 9:24

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Wednesday 5th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో బుధవారం నష్టాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:42 సమయంలో 64 పాయింట్ల నష్టంతో 10,848 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ మంగళవారం ముగింపు స్థాయి 10,907 పాయింట్లతో పోలిస్తే 59 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ బుధవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక

Most from this category