స్టాక్ మార్కెట్ అంటే.....కరీనాకు ఝుంఝున్వాలా టిప్స్
By Sakshi

ప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ ఝుంఝున్వాలా, బాలివుడ్ సినీనటి కరీనా కపూర్ మధ్య దీపావళి సందర్భంగా ఓ ఆంగ్ల చానెల్లో చిట్ చాట్ జరిగింది. రాకేష్ ఝుంఝున్వాలా, కరీనా కపూర్‌కు కొన్ని స్టాక్ మార్కెట్ టిప్స్ ఇచ్చారు. అందులో కొన్ని..
రాకేష్ ఝుంఝున్వాలా : స్టాక్ మార్కెట్ దేశానికి అవసరం. ఇతర రంగాలలో ఉన్నట్టుగానే మంచివాళ్లు, మోసగాళ్లు ఈ రంగంలో కూడా ఉన్నారు. ఇక్కడ ప్రజలు తాము దాచుకున్న నగదును పెట్టవలసి వస్తుంది. దాచుకునే వారి నుంచి ఖర్చు పెట్టే వారి మధ్య నగదును బదిలీ చేసే మాధ్యమం వంటిదీ స్టాక్‌మార్కెట్. స్టాక్‌మార్కెట్ అమ్మాయి లాంటిది. కొన్నిసార్లు కమాండింగ్‌గా ఉంటుంది. కొన్ని సార్లు తుంటరిగా, మరికొన్ని సార్లు అనిశ్చితిలో, ఇంకొన్ని సార్లు ఉత్తేజభరితంగా ఉంటుంది. నేను వ్యక్తిగతంగా నీకు సలహాయిస్తున్నా. మంచి మొత్తంలో నగదును స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చెయ్యు.
కరీనా కపూర్: అయితే కొన్ని మంచి కంపెనీలు, షేర్లను గురించి చెప్పండి.
రాకేష్ ఝుంఝున్వాలా: దానికోసం నిపుణుల సలహాను తీసుకోవడం మంచిది. పన్నుల పరంగా స్టాక్ మార్కెట్లో చాలా అడ్వంటేజ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ ఆదాయంపై పన్ను చాలా తక్కువగా ఉంటుంది.
కరీనా కపూర్: నేను మంచి సిటిజన్‌ను. నేను ఓటు వేస్తున్నా. పన్నులను చెల్లిస్తున్నా. నేను చాలా చాలా క్లీన్‌గా ఉంటున్నా.
రాకేష్ ఝుంఝున్వాలా: కానీ నీకు, స్టాక్‌మార్కెట్‌కు ఎటువంటి సంబంధం లేదుగా?
కరీనా కపూర్: నాకు వాటి గురించి అంతగా తెలియదు. అమ్మకు వాటిపై అవగాహన లేదు. మీరు చెప్పినట్టు మాకు మంచి ఆర్థిక సలహా అవసరం.
రాకేష్ ఝుంఝున్వాలా: ఒకసారి ఆవిడను కలిసి నాకు తెలిసిందంతా చెప్పాలేమో!
కరీనా కపూర్: మీరు ఇంతలా విజయం సాధించడానికి కారణమేంటో తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది. మీరీ ప్రశ్నను మీ సమాధానం అయ్యాక నన్ను అడగవచ్చు.
ఝుంఝున్వాలా: దేవుడి దయ, పెద్దల ఆశీర్వాదం వలన మనమీ స్థానంలో ఉన్నాం. హార్డ్‌వర్క్, అదృష్ఠం, తెలివితేటలు, రిస్క్ తీసుకోవడం వంటివి కూడా ఖచ్చితంగా అవసరమే.
కరీనా కపూర్: ముఖ్యంగా రిస్క్ తీసుకోవడం చాలా ముఖ్యం.
ఝుంఝున్వాలా వాలా: విజయం వీటన్నిటి కలయికే. కష్టపడి పనిచేయడం ఖచ్చితంగా ముఖ్యమే. దీనితోపాటు అదృష్ఠం, రిస్క్ తీసుకోవడం కూడా. ఓటమిని చిరునవ్వుతో తీసుకునే స్వభావం, తప్పులు చేయడానికి బయపడకపోవడం, ఈ తప్పుల నుంచి నేర్చుకునే స్వభావం చాలా అవసరం. జీవితమంటే పశ్చాతాపపడడం కాదు తప్పుల నుంచి నేర్చుకోవడమనేది నా అభిప్రాయం.
కరీనా కపూర్: ఖచ్చితంగా.
You may be interested
39,440 పైన ముగిస్తే ర్యాలీ
Tuesday 29th October 2019అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌డీల్ కుదిరే అవకాశాలు మెరుగుపడటంతో అంతర్జాతీయ మార్కెట్లు గతవారం స్థిరంగా ట్రేడయినప్పటికీ, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీరాకపోవడంతో దేశీయ స్టాక్ సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. అయితే ఈ వారం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, బ్రెగ్జిట్ సందిగ్దత వంటి అంశాలున్నప్పటికీ, చాలా నెలల తర్వాత అటు విదేశీ ఇన్వెస్టర్లు, ఇటు దేశీయ ఫండ్స్ కలిసి గత కొద్దిరోజులుగా కొనుగోళ్లు జరుపుతున్న కారణంగా
జనవరి 31 వరకూ బ్రెగ్జిట్ గడువు పొడిగింపు
Monday 28th October 2019యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్ గడువును మరోసారి పొడిగించారు. అందుకు ఈయూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఈయూ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ఓ ట్వీట్ చేశారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సస్ అభ్యర్థన మేరకు బ్రెగ్జిట్‌కు గతంలో విధించిన అక్టోబర్ 31 గడువును... 31 జనవరి 2020 వరకు పొడిగించేందుకు 27 ఈయూ సభ్యదేశాలు ఆంగీకారం తెలిపాయి. వ్రాతపూర్వక విధానం ద్వారా నిర్ణయం లాంఛనప్రాయంగా