News


నేడు మార్కెట్‌కు సెలవు

Friday 21st February 2020
Markets_main1582257322.png-31975

మహాశివరాత్రి సందర్భంగా నేడు (శుక్రవారం) స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల్లో ట్రేడింగ్‌ జరగదు. అయితే కమోడిటీ, ఫారెక్స్‌ మార్కెట్లు మాత్రం సాయంత్రం పనిచేస్తాయి. రేపు, ఎల్లుండి శని, ఆదివారాలు కాబట్టి సాదారణ సెలవులు. మార్కెట్‌ తిరిగి సోమవారం ప్రారంభవుతోంది.  ఇక నిన్న రోజు ఆద్యంతం ఒడిదుడుకులమయంగా సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 153 పాయింట్లు పతనమై 41,170 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్లు నష్టపోయి 12,081 పాయింట్ల వద్ద ముగిశాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ వారం ట్రేడింగ్‌లో మూడు రోజులు సెన్సెక్స్‌, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. ఈ వారంలో సెన్సెక్స్‌ 87 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు పతనమయ్యాయి. 



You may be interested

జనవరిలో తగ్గిన ప్యాసింజర్‌ వాహన విక్రయాలు

Friday 21st February 2020

రిజిస్ట్రేషన్ల ఆధారంగా వెల్లడించిన ఎఫ్‌ఏడీఏ న్యూఢిల్లీ: దేశీ ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు ఈ ఏడాది జనవరిలో తగ్గుదలను నమోదుచేసినట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ సమాఖ్య (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. గతనెల్లో 2,90,879 యూనిట్ల విక్రయాలు నమోదుకాగా, అంతక్రితం ఏడాది ఇదే కాలంలోని 3,04,929 యూనిట్ల అమ్మకాలతో పోల్చితే 4.61 శాతం క్షీణత ఉన్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉ‍న్న 1,432 ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్‌టీఓ) ఉండగా.. 1,223 ఆర్‌టీఓల్లో నమోదైన వాహన రిజిస్ట్రేషన్ల

జీఎంఆర్‌లో ఫ్రాన్స్ సంస్థకు వాటాలు

Friday 21st February 2020

ఎయిర్‌పోర్ట్ వ్యాపారంలో 49% కొనుగోలు చేయనున్న గ్రూప్ ఏడీపీ డీల్ విలువ రూ. 10,780 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ ఏడీపీ తమ ఎయిర్‌పోర్ట్ వ్యాపార విభాగంలో 49 శాతం వాటాలు కొనుగోలు చేయనున్నట్లు జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వెల్లడించింది. ఈ డీల్ విలువ రూ. 10,780 కోట్లు ఉంటుందని పేర్కొంది. దీని ప్రకారం జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ (జీఏఎల్‌) విలువ సుమారు రూ. 22,000 కోట్లుగా ఉండనుంది. నిర్దిష్ట మైలురాళ్లను

Most from this category