News


బడా ఇన్వెస్టర్లకూ మార్కెట్ల షాక్‌

Friday 20th March 2020
Markets_main1584695124.png-32597

జాబితాలో రాకేష్‌ జున్‌జున్‌వాలా
ఆశిష్‌ ధావన్‌, డాలీ ఖన్నా..
రూ. 3550 కోట్లను పోగొట్టుకున్న రాకేష్‌
నష్టాల జాబితాలో షుగర్‌ షేర్లు

సరిహద్దులను చెరిపేస్తూ కరోనా వైరస్‌ సృష్టిస్తున్న విలయానికి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. దీంతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు మందగమనం నుంచి మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ(WHO) కోవిడ్‌-19ను  ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సైతం కోవిడ్‌-19 ధాటికి ఆర్థిక వ్యవస్థ మాంద్యాన్ని చవిచూడనుందంటూ బాహాటంగానే అంగీకరించారు. ఫెడరల్‌ రిజర్వ్‌ అయితే ఏకంగా వడ్డీ రేట్లను సున్నా(0-0.25 శాతం) స్థాయికి కోత పెట్టింది. బిలియన్‌ డాలర్లకొద్దీ నిధులను ఫెడ్‌తోపాటు, ఈసీబీ తదితర కేంద్ర బ్యాంకులు వ్యవస్థలోకి పంప్‌చేస్తున్నాయి. అయినప్పటికీ ఇన్వెస్టర్లలో ఆందోళనలు తగ్గకపోగా.. రోజురోజుకీ భయాలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఫలితంగా కోవిడ్‌-19 ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో నష్టాల సునామీకి కారణమవుతున్నట్లు తెలియజేశారు. 

కరుగుతున్నాయ్‌
కుప్పకూలుతున్న మార్కెట్ల కారణంగా రాకేష్‌ జున్‌జున్‌వాలా తదితర పలు సుప్రసిద్ధ ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ సైతం ఆవిరవుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కేలండర్‌ ఏడాది(2020)లో ఇప్పటివరకూ సెన్సెక్స్‌, నిఫ్టీ 32 శాతం చొప్పున పతనమయ్యాయి. దీంతో బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్‌ కేపిటలైజేషన్‌(విలువ)లో రూ. 46 లక్షల కోట్లమేర ఆవిరైంది. ఫలితంగా రాకేష్‌ జున్‌జున్‌వాలా, ఆయన కుటుంబం, ఆశిష్‌ ధావన్‌, అనిల్‌ కుమార్‌ గోయల్‌, ఆశిష్‌ రామచంద్ర కొచాలా, డాలీ ఖన్నా తదితరాల పెట్టుబడుల విలువకు కోత పడుతోంది. 

రూ. 10,000 కోట్ల దిగువకు
రాకేష్‌ కుటుంబ పెట్టుబడుల విలువ గురువారానికల్లా రూ. 10,000 కోట్ల దిగువకు అంటే రూ. 8925 కోట్లకు చేరింది. గత కొద్ది రోజులలో రూ. 3554 కోట్లమేర సంపద కరిగిపోవడం ప్రభావం చూపింది. ఇది 28 శాతం క్షీణతకాగా.. 2019 డిసెంబర్‌కల్లా రాకేష్‌ కుటుంబం పెట్టుబడుల విలువ రూ. 12,480 కోట్లుగా నమోదైంది. రాకేష్‌ పెట్టుబడుల జాబితాలో కొన్ని మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు సైతం ఉన్నాయి. ఈ రెండు ఇండెక్సులూ ఇటీవల 28 శాతం స్థాయిలో పతనమయ్యాయి. రాకేష్‌ ఫేవరెట్‌ టైటన్‌ షేరు 24 శాతం నీరసించి రూ. 900 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. టైటన్‌ కంపెఈలో రాకేష్‌కు 6.69 శాతం వాటా ఉంది. వెరసి ఈ ఏడాది తొలి రెండున్నర నెలల్లో టైటన్‌ పెట్టుబడుల్లో రూ. 1710 కోట్లకు చిల్లుపడింది. రాకేష్‌కు పెట్టుబడులున్న ఇతర కౌంటర్లలో ఎన్‌సీసీ, డెల్టా కార్ప్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, ఆప్టెక్‌, జూబిలెంట్‌ లైఫ్‌ సైన్సెస్‌ సైతం ఇదే కాలంలో సగటున 50 శాతం చొప్పున నష్టపోయాయి. ఇక లుపిన్‌, ఎస్కార్ట్స్‌, ర్యాలీస్‌ తదితర కౌంటర్లు మాత్రం కొంతమేర తక్కువగా అంటే 20 శాతమే వెనకడుగు వేశాయి. 

షుగర్‌ షేర్లు
షుగర్‌ రంగంపట్ల ఆసక్తిని చూపే అనిల్‌ కుమార్‌ గోయల్‌, సీమా గోయల్‌ సైతం పెట్టుబడుల విలువ క్షీణించడాన్ని చవిచూస్తున్నారు. వీళ్ల పోర్ట్‌ఫోలియోలో ఉన్న ధంపూర్‌ షుగర్‌, త్రివేణీ ఇంజినీరింగ్‌, ద్వారికేష్‌, ఉత్తమ్‌ షుగర్‌ షేర్లు సగటున 49 శాతం పడిపోయాయి. ఇక మరోపక్క ఆశిష్‌ ధావన్‌, ఆశిష్‌ రామచంద్ర కొచాలియా, డాలీ ఖన్నాల పోర్ట్‌ఫోలియో విలువలు సైతం సగటున 36-44 శాతం మధ్య క్షీణించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వేచిచూడాలి
కోవిడ్‌-19 ప్రళయం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా రెండు త్రైమాసికాలపాటు కంపెనీల ఫలితాలు నీరసించనున్న అంచనాలతో ఇప్పటికే మార్కెట్లు డిస్కౌంట్‌ అయినట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అభిప్రాయపడింది. వినియోగం పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థలు మాంద్య పరిస్థితులను ఎదుర్కొనే వీలున్నట్లు ఇటీవల పలువురు నిపుణులు భావిస్తున్నారు. అయితే కరోనా సమస్యకు పరిష్కారం లభించడం లేదా విపత్కర పరిస్థితులు కొనసాగడం వంటి అంశాలు భవిష్యత్‌లో సెంటిమెంటును ప్రభావితం చేయగలవని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది.You may be interested

భారీ పతనానికి బ్రేక్‌....సెన్సెక్స్‌ 1630 పాయింట్లు జంప్‌

Friday 20th March 2020

482 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ  ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌ దూకుడు ఎట్టకేలకు వరుస నష్టాలకు చెక్‌ పడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెంటిమెంటు మెరుగుపడింది. సెన్సెక్స్‌ 1628 పాయింట్లు దూసుకెళ్లి 29,916 వద్ద నిలవగా.. నిఫ్టీ 482 పాయింట్లు జంప్‌చేసి 8,745 వద్ద ముగిసింది. గురువారం అమెరికా మార్కెట్లు నష్టాల నుంచి బయటపడగా.. ఆసియాలోనూ పలు మార్కెట్లు 1-3 శాతం మధ్య ఎగశాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం

52 వారాల కనిష్టానికి 344 షేర్లు

Friday 20th March 2020

శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో  ఏడాది కనిష్టానికి 344 షేర్లు పతనమయ్యాయి. వీటిలో 21 ఫస్ట్‌ సెంచురీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, 3ఐ ఇన్ఫోటెక్‌, 63 మూన్స్‌ టెక్నాలజీస్‌,అబాన్‌ ఆఫ్‌షోర్‌, ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌, అడోర్‌ వెల్డింగ్స్‌, అడ్రైట్‌ ఇన్ఫోటెక్‌, అగ్రీటెక్‌ ఇండియా, ఆగ్రోఫోస్‌ ఇండియా, అహుల్‌ వాలియా కాంట్రాక్ట్స్ ఇండియా, ఏఐఏ ఇంజనీరింగ్‌, మొన్నెట్‌ ఇస్పాట్‌ అండ్‌ ఎనర్జీ, ఆక్స్‌ ఆఫ్టీఫైబర్‌, అలన్‌కిట్‌, అల్‌సెక్‌ టెక్నాలజీస్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, అన్సల్‌ హౌసింగ్‌, ఆర్కిస్‌, ఆర్కోటెక్‌,

Most from this category