News


నష్టాల ప్రారంభం

Monday 23rd December 2019
Markets_main1577072228.png-30372

హెవీవెయిట్‌ షేరు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భారీ నష్టంతో ప్రారంభంకావడంతో దేశీయ స్టాక్‌ సూచీలు గ్యాప్‌డౌన్‌తో మొదలయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 133 పాయింట్లు క్షీణించి 41,548 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 12,235 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. పన్నా, ముక్తా చమురు క్షేత్రానికి సంబంధించి 4.5 బిలియన్‌ డాలర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చెల్లించాల్సివుందని, ఈ నేపథ్యంలో సౌదీ ఆరామ్‌కోతో రిలయన్స్‌ డీల్‌ రద్దును కేంద్ర ప్రభుత్వం కోరడంతో ఆ షేరు సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 2.5 శాతం తగ్గింది. 



You may be interested

సోమవారం వార్తల్లో షేర్లు

Monday 23rd December 2019

వివిధ వార్తలకు అనుగుణంగా సోమవారం ట్రేడింగ్‌లో ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు టాటా ‍గ్లోబల్‌ బెవరేజెస్‌:- కంపెనీ ఎండీ, సీఈవోగా సునీల్‌ డిసౌజాను ఎంపిక చేసుకున్నట్లు టాటా గ్రూప్‌ పానీయాల దిగ్గజం టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ తాజాగా పేర్కొంది. కేఈసీ ఇంటర్నేషనల్‌:- మొత్తం రూ. 1520 కోట్ల విలువైన ఆర్డర్లను తాజాగా సాధించినట్లు విద్యుత్‌ ప్రసారం, పంపిణీ తదితర మౌలిక సదుపాయాల రంగ కంపెనీ కేఈసీ ఇంటర్నేషనల్‌ బీఎస్‌ఈకి వెల్లడించింది.  బజాజ్‌ కన్జూమర్‌:- కంపెనీ సీఈవోగా

కన్సార్షియం రుణాల పంపిణీపై కార్యాచరణ

Monday 23rd December 2019

ఏప్రిల్‌ నాటికి సిద్ధం చేయనున్న ఐబీఏ న్యూఢిల్లీ: బ్యాంకులు ఒక కూటమిగా ఏర్పడి మంజూరు చేసే రుణాల విషయంలో (కన్సార్షియం లెండింగ్‌) ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి కార్యాచరణను ఇండియన్‌ బ్యాం‍క్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) వచ్చే ఏప్రిల్‌ నాటికి తయారు చేయనుంది. అలాగే, బ్యాంకులకు ప్రత్యామ్నాయ నిధుల మార్గాలపైనా దృష్టి సారించనుంది. ‘‘ప్రస్తుతం కన్సార్షియంగా ఇచ్చే రుణాల విషయంలో నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) కోసం అన్ని బ్యాంకుల చుట్టూ రుణగ్రహీత తిరగాల్సి వస్తోంది.

Most from this category