News


స్టాక్స్‌ ఇన్‌ న్యూస్‌ 27-12-19

Friday 27th December 2019
Markets_main1577418813.png-30466

దేశీ స్టాక్‌ మార్కెట్లలో వార్తల ఆధారంగా శుక్రవారం(27-12) కొన్ని స్టాక్స్‌ యాక్టివ్‌గా కదిలే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా కంపెనీల వివరాలు చూద్దాం.

హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI) నుంచి హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌(HAM)లో రూ. 522 కోట్ల విలువైన రహదారి కాంట్రాక్టు లభించినట్లు మౌలిక సదుపాయాల సంస్థ హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజినీరింగ్‌ తెలియజేసింది. దీనిలో భాగంగా హార్యానాలోని రేవరీ బైపాస్‌ను నిర్మించవలసి ఉంటుందని తెలియజేసింది.

అలహాబాద్‌ బ్యాంక్‌
కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ. 2153 కోట్ల పెట్టుబడులను విడుదల చేసినట్లు పీఎస్‌యూ రంగ సంస్థ అలహాబాద్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌
ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ పద్ధతిలో బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణమైన టైర్‌-2 కేపిటల్‌ బాండ్లను జారీ చేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) తెలియజేసింది. తద్వారా రూ. 1500 కోట్లను సమకూర్చుకున్నట్లు వెల్లడించింది.

బయోకాన్‌
బయోకాన్‌ బయోస్ఫియర్‌ పేరుతో తాజాగా పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు దేశీ ఫార్మా రంగ దిగ్గజం బయోకాన్‌ తెలియజేసింది.

కేన్‌ ఫిన్‌ హోమ్స్‌
రేటింగ్‌ సంస్థ కేర్‌... కంపెనీకి చెందిన మార్పిడి రహిత డిబెంచర్ల(ఎన్‌సీడీలు) రేటింగ్‌ను సమీక్షించినట్లు కేన్‌ ఫిన్‌ హోమ్స్‌ పేర్కొంది. తద్వారా AAA రేటింగ్‌ను పునరుద్ఘాటించినట్లు తెలియజేసింది.

కావేరీ సీడ్‌ కంపెనీ
సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్‌)కి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతించినట్లు ప్రయివేట్‌ రంగ కంపెనీ కావేరీ సీడ్‌ తెలియజేసింది. ఒక్కో షేరుకీ రూ. 700 ధర మించకుండా 28 లక్షల షేర్లను బైబ్యాక్‌ చేయనున్నట్లు తెలియజేసింది.

ఇక్రా, కేర్‌
ఆర్థికంగా దివాళా తీసిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రుణాల(ఎన్‌సీడీలు) రేటింగ్‌ల అంశంలో వైఫల్యానికి సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రేటింగ్‌ కంపెనీలు ఇక్రా(ICRA), కేర్‌(CARE)లకు రూ. 25 లక్షల చొప్పున పెనాల్టీ విధించింది.You may be interested

భీమ్ యూపీఐతో ఫాస్టాగ్‌ రీచార్జ్

Friday 27th December 2019

న్యూఢిల్లీ: నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఈటీసీ) ఫాస్టాగ్‌లను భీమ్ యూపీఐ ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) వెల్లడించింది. దీనితో ఫాస్టాగ్‌ రీచార్జ్ ప్రక్రియ మరింత సులభతరం కాగలదని సంస్థ సీవోవో ప్రవీణ రాయ్‌ తెలిపారు. టోల్ చెల్లింపునకు సంబంధించి వాహనదారుల సమయం వృధా కాకుండా చూసే దిశగా ఫాస్టాగ్ విధానం ఇటీవలే అమల్లోకి వచ్చిన సంగతి

2019: ఐపీఓ నిధుల సమీకరణ. అంతంతే !

Friday 27th December 2019

మందగమనం ప్రభావం  ఈ ఏడాది 60 శాతం తగ్గిన ఐపీఓ నిధులు  మెరుగుపడ్డ  ఓఎఫ్‌ఎస్‌  అధ్వానంగా డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడి  ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది.

Most from this category