News


వాల్యూంలు లేని షేర్ల నుంచి బయటపడండి!

Tuesday 18th February 2020
Markets_main1582022192.png-31903

టెక్నికల్‌ అనలిస్టుల సూచన
ఒక షేరు కొత్త గరిష్ఠాలను తాకుతున్నా వాల్యూంలు మాత్రం పెద్దగా లేకుంటే అలాంటి షేర్లలో ప్రాఫిట్‌ బుక్‌ చేసి బయటపడాలని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైన షేర్లు మంచి స్పీడున్న కార్లలాంటివని, వాటి కౌంటర్లలో వాల్యూంలు కారును నడిపే ఇంధనం లాంటివని వివరించారు. ఎంతప్పటికీ కారులో ఫీచర్లు, డిజైన్‌ తదితరాలు చూసి మురిసిపోతే కారు నడవదని, ట్యాంకు నిండా ఇంధనం ఉంటేనే స్పీడందుకుంటుందని చెప్పారు. అలాగే షేర్లు సైతం నాణ్యమైన కంపెనీ, లాభార్జన తదితరాలు చూసి మురిసిపోతే పెరగవని, కౌంటర్లో భారీ వాల్యూంలు ఉంటేనే అప్‌మూవ్‌ కొనసాగుతుందని వివరించారు. ఒకపక్క షేరు కొత్త గరిష్ఠాలకు పోతున్నా, వాల్యూంలు అంతకంతకూ తగ్గుతుంటే షేరులో జోరుకు బ్రేకులు పడబోతున్నట్లు గ్రహించాలన్నారు. ఈ సమయంలో సదరు కౌంటర్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసి బయటకురావాలన్నారు. లేదంటే కొన్ని షేర్లనైనా అమ్ముకోవాలన్నారు. 50రోజుల డీఎంఏను భారీ వాల్యూంలతో కోల్పోతే మరికొంత అమ్ముకోవాలన్నారు. సాధారణంగా 50 రోజుల డీఎంఏ పైన షేరుకు కొత్త నిరోధాలుండవని, బయ్యర్ల ఆసక్తి ఉన్నంత వరకు కొనుగోళ్లు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ఇలా అప్‌మూవ్‌ కొనసాగుతున్నా కొనేవాళ్ల సంఖ్య పెరగకపోతే అది కేవలం ట్రాప్‌గా భావించవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అప్‌ట్రెండ్‌లో ఉన్న స్టాకులకు సంస్థాగత కొనుగోలుదారుల మద్దతుంటుందని, వాల్యూంలు పెరగడం లేదంటే ఈ కొనుగోలుదారులు కొనడం తగ్గించారని అర్ధమని చెప్పారు. అలాంటప్పుడు షేరు తన బరువు తానే మోయలేక పతనమవుతుందన్నారు. 
టైటాన్‌ ఉదాహరణ...

టైటాన్‌ షేరు గత మేలో నూతన గరిష్ఠాలను తాకింది. ఆ సమయంలో షేరు 50 రోజుల డీఎంఏ వద్ద రీబౌండ్‌ చెంది మంచి వాల్యూంలతో పైకి ఎగిసింది. ఇది జూన్‌, జూలై వరకు కొనసాగింది. కానీ జూలైలో ఏర్పడ్డ అప్‌మూవ్‌కు వాల్యూంల మద్దతు లేదని పైన చిత్రంలో గమనించవచ్చు. దీంతో జూలై హై అనంతరం షేరు దాదాపు 20 శాతం పతనమైంది. ఇదే ధోరణి అక్టోబర్‌లో కూడా చూడొచ్చు. అప్పుడు కూడా అల్పవాల్యూంలతో నూతన గరిష్ఠం చేరి మరో 20 శాతం పతనమైంది. 



You may be interested

ఈ స్టాక్స్‌పై దేశ, విదేశీ ఇనిస్టిట్యూషన్ల ఆసక్తి..

Wednesday 19th February 2020

దేశీయ ఇనిస్టిట్యూషన్లు (మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా సంస్థలు), విదేశీ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోళ్లను పరిశీలిస్తే.. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్లు ఐసీఐసీఐ బ్యాంకు, ఆర్‌బీఎల్‌ బ్యాంకు పట్ల ఎంతో ఆసక్తి ప్రదర్శించినట్టు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. డిసెంబర్‌ త్రైమాసికంలో విదేశీ ఇన్వెస్టర్లు 4.88 బిలియన్‌ డాలర్ల మేర మన ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టగా, మన డీఐఐలు 793 మిలియన్‌ డాలర్ల మేర విక్రయాలు జరిపినట్టు ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌

యాపిల్‌ దెబ్బ- 12,000 దిగువకు నిఫ్టీ

Tuesday 18th February 2020

41,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్‌ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.5 శాతం డౌన్‌ మీడియా, ఐటీ రంగాలు ఎదురీత పలు ప్రతికూల అంశాల నడుమ వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలా పడ్డాయి. సెన్సెక్స్‌ 161 పాయింట్లు క్షీణిం‍చి 40,894 వద్ద నిలవగా.. నిఫ్టీ 53 పాయింట్లు తక్కువగా 11,993 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్‌ 41,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరగా.. నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 12,000 పాయింట్ల దిగువన

Most from this category