News


ప్రపంచ మార్కెట్లలో కరోనా కల్లోలం

Monday 24th February 2020
Markets_main1582516994.png-32031

పలు దేశాలకు విస్తరిస్తున్న కరోనా వైరస్‌
దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీలో వణుకు
యూరోపియన్‌, అమెరికన్‌ ఫ్యూచర్స్‌ డీలా
ముడిచమురు ధరలు పతనం- పసిడి అప్‌

చైనాలో పుట్టిన కోవిడ్‌-19 ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. ఇప్పటికే చైనాలో మృతుల సంఖ్య 2,400ను అధిగమించగా.. తాజాగా దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీ దేశాలలోనూ వైరస్‌ బాధితుల సంఖ్య నమోదవుతోంది. దీంతో కొరియాలో హై అలర్ట్‌ ప్రకటించగా.. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో మళ్లీ ఆందోళనలు తలెత్తాయి. వెరసి ఇటు యూరోపియన్‌, అటు అమెరికన్‌ స్టాక్‌ ఫ్యూచర్స్‌ పతనమయ్యాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా కనిపిస్తోంది. జపాన్‌ మార్కెట్లకు నేడు సెలవుకాగా.. ఆస్ల్రేలియా, న్యూజీలాండ్‌ మార్కెట్లు సైతం డీలా పడ్డాయి. 

చమురు వీక్‌
కరోనా ప్రభావంతో ఆర్థిక వ్యవస్థలు మందగించి డిమాండ్‌ తగ్గవచ్చన్న అంచనాలతో ముడిచమురు ధరలు దాదాపు 3 శాతం పతనమయ్యాయి. మరోపక్క బంగారానికి డిమాండ్‌ పెరిగింది. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔస్స్‌(31.1 గ్రాములు) బంగారం ధర 1.2 శాతం పుంజుకుని 1669 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లో 1678 డాలర్లను తాకింది. సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక పెట్టుబడిగా బంగారాన్ని భావించే సంగతి తెలిసిందే. కేంద్ర బ్యాంకులు, సావరిన్‌ ఫండ్స్‌, ఈటీఎఫ్‌ తదితర సంస్థలు బం‍గారం కొనుగోలుకి ఆసక్తి చూపడంతో పసిడి ధరలు మెరుస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 2.5 శాతం పతనమై 57 డాలర్లను తాకగా.. న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం​2.4 శాతం క్షీణించి 52 డాలర్ల స్థాయికి చేరింది.

ఇటలీలోనూ
దక్షిణ కొరియాలో కరోనా ప్రభావితుల సంఖ్య 600ను మించగా.. ఆరుగురు మృతి చెందినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దీంతో దేశశ్యాప్తంగా హై అలర్ట్‌ను ప్రకటించింది. ఇక ఇటలీలోనూ వైరస్‌ ప్రభావంతో ముగ్గురు మృతి చెందగా.. వ్యాధి సోకినవారి సంఖ్య 150ను తాకినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇదే విధంగా కరోనా కేసులు 43 నమోదుకాగా.. 8 మంది చనిపోయినట్లు ఇరాన్‌ పేర్కొంది. దీంతో సౌదీ అరేబియా, కువైట్‌, ఇరాక్‌, టర్కీ తదితర దేశాలు ఇరాన్‌ నుంచి వచ్చే టూరిస్టులపై ఆంక్షలు విధించాయి.



You may be interested

రూ.44,000పైకి పుత్తడి

Monday 24th February 2020

సాక్షి, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా రాకెట్‌లా దూసుకెళ్తున్న పుత్తడి ధర ఆదివారం సరికొత్త రికార్డు సృష్టించింది. మేలిమి బంగారం (24 క్యారట్లు) ధర హైదరాబాద్‌ మార్కెట్‌లో రూ. 44 వేలు దాటింది. ఆదివారం జరిపిన విక్రయాల్లో 24 క్యారట్ల బంగారం ధర గ్రాముకు రూ. 4,443 చొప్పున ధర పలికింది. అంటే 10 గ్రాములకు రూ. 44,430 ధర పలికిందన్నమాట. అదే ఆభరణాలకు ఉపయోగించే 22 క్యారట్ల బంగారం గ్రాముకు

కరోనా ఎఫెక్ట్‌: సెన్సెక్స్‌ 400 పాయింట్ల క్రాష్‌..!

Monday 24th February 2020

11950 దిగువును ప్రారంభమైన నిఫ్టీ వృద్ధి భయాలతో మెటల్‌ షేర్లలో మంటలు  24 పైసలు కరిగిపోయిన రూపాయి ప్రపంచ ఈక్విటీ మార్కెట్లల్లో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలు మరోసారి తెరపైకి సోమవారం సెన్సెక్స్‌ 400 పాయింట్లు నష్టంతో 40770 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మరో ప్రధాన ఇం‍డెక్స్‌ నిఫ్టీ సైతం 131 పాయింట్లను కోల్పోయి 11950 దిగువను 11,949 వద్ద మొదలైంది. వరుసగా మూడు సెలవురోజుల అనంతరం ప్రారంభమైన దేశీయ మార్కెట్‌కు అంతర్జాతీయ

Most from this category