News


నేడు మార్కెట్లకు సెలవు

Monday 21st October 2019
Markets_main1571630239.png-29015

మహారాష్ట్ర ఎన్నికల  సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. నేడు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్చ్సేంజ్‌ మాత్రం మధ్యాహ్నం వరకు పనిచేయదు. సాయంత్రం 5గం.లకు ట్రేడింగ్‌ ప్రారంభవుతోంది. స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా రేపు (మంగళవారం) ప్రారంభమవుతుంది. కావున ఈ వారంలో స్టాక్‌ మార్కెట్ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. ఇక శనివారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 39,298 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 76 పాయింట్లు ఎగసి 11,662 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇప్పటివరకూ వెల్లడైన ప్రధాన కంపెనీల క్యూ2 ఆర్థిక ఫలితాలు బాగానే ఉండటం,  దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటం,  పండుగ సీజన్‌, ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు, అంతర్జాతీయ సానుకూల సంకేతాలకు తోడు కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన  ఉద్దీపన చర్యలతో ఆర్థిక వ్యవస్థ రికవరిపై ఆశావహనం తదితర అంశాలతో గతవారంలో సెన్సెక్స్‌ 1171 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ ఇండెక్స్‌ 356 పాయింట్లు పెరిగింది. 
నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు:-
ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌, భారతీ ఇన్ఫ్రాటెక్‌, 5పైసా క్యాపిటల్‌, జెన్సాన్‌ టెక్‌, మహీంద్రా లైఫ్‌, హిందూస్థాన్‌ జింక్, జస్ట్‌ డయల్‌, మన్నెట్‌ ఇస్పాట్‌, టాటా ఎలాక్సీ, ఉజ్జీవన్‌ ఫైనాన్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సాగర్‌ సిమెంట్స్‌, పిరమిల్‌ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. 

 



You may be interested

క్యూ2 ఫలితాలే దిక్సూచీ..!

Monday 21st October 2019

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ,  మారుతీ సుజుకీ, బజాజ్‌ ఆటో, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌,   ఇండిగో, టాటా మోటార్స్‌ ఫలితాలు ఈవారంలోనే..  బ్రెగ్జిట్‌ పరిణామాలపై మార్కెట్‌ దృష్టి- మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా సోమవారం సెలవు న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటనలు, బ్రెగ్జిట్‌ పరిణామాలు, స్థూల ఆర్థిక అంశాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ

ఐఆర్‌సీటీసీ స్టాక్‌.. బఫెట్‌ మెచ్చే క్వాలిటీలు

Monday 21st October 2019

ఐఆర్‌సీటీసీ తాజాగా మార్కెట్లో లిస్ట్‌ అవగా, ఇష్యూ ధరతో పోలిస్తే ఇప్పటికే 130 శాతం రాబడులను ఇచ్చింది. కంపెనీ మార్కెట్‌ విలువ రూ.12,448 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్‌కు వారెన్‌ బఫెట్‌ మెచ్చే బలాలు ఉన్నాయని, ఏ ధరలో అయినా (కరెక్షన్‌లో) కొనుగోలు చేసుకోవచ్చని క్యాపిటల్‌వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ పేర్కొన్నారు. ఆయన విశ్లేషణ ఇలా ఉంది..   ‘‘ఐఆర్‌సీటీసీ అన్నది వారెన్‌ బఫెట్‌ కొనుగోలు చేసే బలాలు కలిగిన స్టాక్‌.

Most from this category