News


ఈ స్టాక్స్‌పై ఓ లుక్కేయొచ్చు: జగన్నాథం

Sunday 4th August 2019
Markets_main1564940816.png-27527

ఆటోమొబైల్‌ రంగంలో మూడు నాలుగేళ్ల కాలంలో మంచి రాబడులకు అవకాశం ఉందే కానీ, అది మూడు నాలుగు నెలల్లో మాత్రం కాదని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల పేర్కొన్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

ఆటోమొబైల్‌ రంగం గురించి మాట్లాడుతూ... ఆటోమొబైల్‌ రంగంలో మార్కెట్‌ లీడర్లుగా ఉన్న కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికీ తక్కువ విలువల వద్ద లేవని, 50 శాతం వరకూ దిద్దుబాటుకు గురైనా కానీ కొన్ని ఇప్పటికీ అధిక వ్యాల్యూషన్ల వద్దే ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి అమ్మకాల్లో బేస్‌ ప్రభావం (గతేడాది ఇదే కాలంతో పోలిస్తే) కనిపిస్తుందని, ఆప్పటి నుంచి వాహన విక్రయాల్లో 2, 3 శాతం స్థాయిలో వృద్ధి నమోదవుతుందని జగన్నాథం తెలిపారు. అంతేకానీ, ఇప్పట్లో గత గరిష్టాలకు విక్రయాలు పెరిగే అవకాశం లేదన్నారు. అయితే, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో సెప్టెంబర్‌ రెండో భాగం నుంచి డిమాండ్‌ ఊపందుకోవచ్చన్నారు. అయితే, ఈ సారి పండుగల సందర్భంగా డిమాండ్‌ బాగుంటుందని ఇప్పుడే ఊహించడం కూడా కష్టమేనని అభిప్రాయపడ్డారు. షేర్ల ధరలు అధిక వ్యాల్యూషన్లతో ఉన్నందున ఇంకా పడిపోయే అవకాశం లేకపోలేదన్నారు.

 

మార్కెట్లు దిద్దుబాటుకు గురికావడం సరైనదేనన్నారు జగన్నాథం. ఎందుకంటే గత 12 నెలల్లో ఆర్థిక రంగం 3 స్టార్‌ స్థాయిలో ఉంటే, మార్కెట్లు 5 స్టార్‌ వద్ద ట్రేడయ్యాయని అభివర్ణించారు. ఇప్పుడు ఆర్థిక రంగానికి తగ్గట్టు మార్కెట్లు దిద్దుబాటుకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పుడు మార్కెట్‌ 4 స్టార్‌కు వచ్చిందని, దీంతో హెచ్‌ఎన్‌ఐల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. దాంతో మార్కెట్లకు కచ్చితమైన కనిష్టం ఏర్పడుతుందన్నారు. నిఫ్టీ ఎర్నింగ్స్‌ను చూస్తే చాలా నిరాశపరిచేలా ఉందని, నిఫ్టీ-50లో 29 కంపెనీలు ఇప్పటి వరకు ఫలితాలను ప్రకటించగా, ఈపీఎస్‌లో 7 శాతం వృద్ధి క్షీణత ఉన్నట్టు చెప్పారు. మార్కెట్‌ కదలికలపై కంపెనీల ఫలితాల ప్రభావం 60 శాతం మేర ఉంటుందన్నారు. 

 

మార్కెట్లలో దిద్దుబాటు ముగిసిన తర్వాత, వ్యాల్యూషన్లు సహేతుక స్థాయికి వస్తాయని, దాంతో మళ్లీ పెట్టుబడులు తరలివస్తాయన్న అభిప్రాయాన్ని జగన్నాథం వ్యక్తం చేశారు. జీవిత బీమా కంపెనీల పట్ల తాము సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. 5-10 ఏళ్ల దీర్ఘకాలిక వృద్ధి స్టోరీ ఇప్పటికే ఆరంభమైందని, మార్కెట్‌ పరిస్థితులతో సంబంధం లేకుండా గత ఆరు నెలల్లో ఈ స్టాక్స్‌లో సంపద వృద్ధి కూడా కనిపించిందన్నారు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్‌తో పోలిస్తే బీమా కంపెనీలకు ఎక్కువ మార్కెట్‌ విలువ ఉందన్నారు. ఈ విభాగంలో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను అతిపెద్ద కంపెనీగా పేర్కొన్నారు. అయినప్పటికీ రూ.లక్ష కోట్ల మార్కెట్‌ విలువ వద్దే ఉందని, అదే పెద్ద బ్యాంకు మార్కెట్‌ క్యాప్‌ రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఉందన్నారు. సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలకు కూడా భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. ఈ రెండు రంగాలను దీర్ఘకాలం కోసం సూచించారు. 



You may be interested

స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఎంపికకు ఆరు పరీక్షలు

Sunday 4th August 2019

స్మాల్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో 2017 నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్న వారికి మింగుడు పడని అంశం... ఇప్పటికీ పెట్టుబడులపై రాబడులు కనిపించని పరిస్థితి. కానీ, చారిత్రకంగా చూస్తే దీర్ఘకాలంలో ‍స్మాల్‌క్యాప్‌ పథకాలు మంచి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏడేళ్లు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇన్వెస్ట్‌ చేసుకోవాలనుకునే వారు ఇప్పటికీ వీటిని పరిశీలించొచ్చు. అయితే, స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ ఎంపిక కోసం చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.   రాబడులు బుల్‌ దశలో కాకుండా, మార్కెట్‌

ఎన్‌పీఎస్‌ ఇన్వెస్టర్లూ ఇది విన్నారా...?

Sunday 4th August 2019

జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌)లో ఇన్వెస్ట్‌ చేస్తున్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఆగస్ట్‌ 1 నుంచి పరిపాలనా రుసుం తిరిగి అమల్లోకి వచ్చింది. ఇన్వెస్టర్‌ పెట్టుబడుల విలువపై వార్షికంగా 0.005 శాతాన్ని అడ్మినిస్ట్రేటివ్‌ చార్జీ కింద ఎన్‌పీఎస్‌ ఫండ్స్‌ మేనేజర్లు ఇకపై రాబట్టుకుంటారు. ఇది దీర్ఘకాలంలో రాబడులను కొంత మేర ప్రభావితం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.    ఎన్‌పీఎస్‌ ట్రస్ట్‌ జనరల్‌ మేనేజర్‌ అఖిలేశ్‌ కుమార్‌ చందాదారులకు

Most from this category