News


స్టెరిలైట్‌కు తెలంగాణ ప్రాజెక్ట్‌- షేరు జూమ్‌

Thursday 2nd January 2020
Markets_main1577949606.png-30617

గ్రామీణ ప్రాంతాలకు హై‍స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌

తెలంగాణవ్యాప్తంగా 11 జిల్లాలలో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు వీలుగా భారీ ప్రాజెక్టును గెలుపొందినట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ తాజాగా వెల్లడించింది. తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌తో సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 3,000 గ్రామ పంచాయతీల పరిధిలో అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. తద్వారా ఆరు మిలియన్లమందికి అందుబాటు ధరల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ లభించే వీలున్నట్లు వివరించింది. ఈ టర్న్‌కీ ప్రాజెక్టు విలువ రూ. 1800 కోట్లుకాగా.. తొలి దశలో భాగంగా రూ. 1100 కోట్ల వర్క్‌ ఆర్డర్‌ను పొందినట్లు వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాలలో ఎండ్‌ టు ఎండ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ డిజైన్‌, నిర్మాణం తదితర కార్యక్రమాలను చేపట్టవలసి ఉన్నట్లు వివరించింది.

షేరు దూకుడు
బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టును పొందిన వార్తలతో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ ఒక్కసారిగా జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లో ఈ షేరు 8.5 శాతం దూసుకెళ్లింది. రూ. 128ను అధిగమించింది. మధ్యాహ్నం 12.30 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 7 శాతం లాభంతో రూ. 127 వద్ద ట్రేడవుతోంది.You may be interested

బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Thursday 2nd January 2020

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా బ్యాంకింగ్‌ షేర్లకు భారీగా లాభపడుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం మిడ్‌సెషన్‌కల్లా 0.75శాతం లాభపడింది. నేడు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 8,226.60 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ఒక దశలో 0.60శాతం పెరిగి 32296.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం 1:00లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(32102.90)తో పోలిస్తే 0.50శాతం

8నెలల గరిష్టానికి టాటా మోటర్స్‌

Thursday 2nd January 2020

టాటా మోటర్స్‌ షేరు గురువారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 9నెలల గరిష్టాన్ని అందుకుంది. అమెరికా చైనాల మధ్య వాణజ్య ఒప్పందం కుదరవచ్చనే అంచనాలు షేరు లాభపడేందుకు కారణమని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు. అర్థికంగా అతిపెద్ద దేశాల మధ్య కుదరనున్న ఈ వాణిజ్య ఒప్పందంతో టాటామోటర్స్‌ అనుబంధ సంస్థ జాగ్వర్‌ లాండ్‌ రోవర్‌ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా పెరగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టాటా మోటర్స్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌ కాగా తరువాత స్థానాల్లో అమెరికా,

Most from this category