News


నిరాశపరిచిన స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ షేర్ల లిస్టింగ్‌

Tuesday 20th August 2019
Markets_main1566282447.png-27889

  • 10శాతం డిస్కౌంట్‌తో లిస్టింగ్‌ 

రెండువారాల కిందట ఐపీఓ ఇష్యూను పూర్తి చేసుకున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ షేర్ల లిస్టింగ్‌  నిరాశపరించింది. ఇటీవల మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు, ఐపీఓకు అనుకున్నంత స్థాయిలో సబ్‌స్క్రైబ్‌ కాకపోవడం లిస్టింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితంగా మంగళవారం బీఎస్‌ఈలో ఐపీఓ ఇష్యూ ధర(రూ.780.00)తో పోలిస్తే షేర్లు 10.50శాతం డిస్కౌంట్‌తో రూ.700.00 వద్ద లిస్ట్‌ అయ్యాయి. ఇంట్రాడేలో ఒకదశలో 11.50శాతం వరకు పతనమైన రూ.691.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఉదయం గం.11:15ని.లకు ఇష్యూ ధర(రూ.780.00)తో పోలిస్తే 6.50శాతం నష్టంతో రూ.729.50 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
ఇష్యూ వివరాలు:-
సోలార్‌‌ ఈపీసీ రంగంలో సేవలు అందించే స్టెర్లింగ్‌‌ అండ్‌‌ విల్సన్ కంపెనీ ఆగస్ట్‌ 6-8 తేదిలో ఐపీఓ ఇష్యూకు వచ్చింది. ఇష్యూకు ధరల శ్రేణి రూ.775-780గా నిర్ణయించింది. మూడురోజుల పాటు సాగిన ఈ ఇష్యూకు పేలవ స్పందన లభించింది. ఐపీఓకు కేవలం 92శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అ‍య్యింది. ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ.3,125 కోట్ల నిధుల సమీకరించింది.



You may be interested

బౌన్స్‌బ్యాక్‌ ఉంటుందా?

Tuesday 20th August 2019

తప్పదంటున్న నిపుణులు విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు ఇటీవలి కాలంలో ఫ్యూచర్స్‌ మార్కెట్లో విపరీతంగా అమ్మకాలకు పాల్పడ్డారు. ఫలితంగా మార్కెట్లు ఓవర్‌సోల్డ్‌ జోన్‌లోకి వెళ్లిపోయాయి. ఇలా జరిగినప్పుడు తమ పొజిషన్లను కవర్‌ చేయడానికి మళ్లీ కొనుగోళ్లు జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మొదలైతే మార్కెట్లలో మళ్లీ భారీ ర్యాలీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  మార్కెట్లో ఎఫ్‌పీఐలు లక్ష షార్ట్‌ పొజిషన్లు తీసుకున్నాయని, ఇది చాలా ఎక్కువని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలా ఎఫ్‌పీఐలు

ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలు!

Tuesday 20th August 2019

విస్తరిస్తున్న ఈక్విటీ, బాండ్‌ఈల్డ్స్‌ అంతరాలు ప్రపంచంలోని ధనిక దేశాల్లో బాండ్‌ ఈల్డ్స్‌ అంతరం విస్తరిస్తున్న క్రమం ఆందోళన కలిగిస్తోందని ఎకనమిస్టులు చెబుతున్నారు. త్వరలో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే నిజమైతే ఈక్విటీలు అల్లకల్లోలమవుతాయని హెచ్చరిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో పూర్తి మాంద్యం వచ్చేందుకు అవకాశాలు మూడింట ఒకవంతుకు పెరిగాయని, గతేడాదితో పోలిస్తే మాంద్య భయాలు ఐదు రెట్లు అధికమయ్యాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం బాండ్స్‌ రాబడులకు, స్టాక్స్‌ రాబడులకు

Most from this category