News


విల్సన్‌ సోలార్‌ ఐపీవో నేటి నుంచే... కంపెనీ విశేషాలు

Tuesday 6th August 2019
Markets_main1565030016.png-27556

సోలార్‌ ఇంజనీరింగ్‌, నిర్మాణ రంగ కంపెనీ, షాపూర్‌జీ పల్లోంజీ గ్రూపులో భాగమైన ‘స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌’ (ఎస్‌డబ్ల్యూఎస్‌ఎల్‌) ఐపీవో ఆగస్ట్‌ 6 నుంచి (మంగళవారం) ప్రారంభం అవుతోంది. ఒక్కో షేరుకు ధరల శ్రేణి రూ.775-780. బుధవారం ( ఈ నెల 8న)తో ఇష్యూ ముగుస్తుంది. ఐపీవోలో కనీసం 19 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇష్యూకు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, క్రెడిట్‌ సూసే ఇండియా, డూచే ఈక్విటీస్‌ ఇండియా, ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, యస్‌ సెక్యూరిటీస్‌ బుక్‌ రన్నింగ్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఐపీవో, కంపెనీకి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే...

 

స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సోలార్‌ కంపెనీ సోలార్‌ ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) సేవలను అందించే పూర్తి స్థాయి అంతర్జాతీయ సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద సోలార్‌ ఈపీసీ సేవల కంపెనీగా 2018లో గుర్తింపు పొందింది. సోలార్‌ పీవీ సిస్టమ్స్‌ ఏర్పాటు విషయంలో ఈ ఘనత సాధించింది. ఈ సంస్థకు అంతర్జాతీయంగా 4.6 శాతం మార్కెట్‌ వాటా ఉంది. భారత్‌తోపాటు (16.6శాతం మార్కెట్‌ వాటా), ఆఫ్రికా (36.6 శాతం మార్కెట్‌ వాటా), మధ్య ప్రాచ్యం(40.4 శాతం మార్కెట్‌ వాటా)లోనూ 2018లో అతిపెద్ద సోలార్‌ ఈపీసీ సేవల సంస్థగా నిలిచింది. అంటే సోలార్‌ ప్రాజెక్టుల డిజైన్‌, నిర్మాణం, నిర్వహణ పరంగా సమగ్ర సేవలను అందిస్తుంది. 2019 మార్చి నాటికి 205 సోలార్‌ ప్రాజెక్టులను చేపట్టింది. వీటి ఉత్పత్తి సామర్థ్యం 6,870 మెగావాట్లు. కంపెనీ వద్ద రూ.3,831 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. అస్సెట్‌ లైట్‌ నమూనా కావడంతో మూలధన నిధులు పెద్దగా అవసరం ఉండదు. కస్టమర్లే ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమిని సమీకరించుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన ఎక్విప్‌మెంట్‌ను ఈ కంపెనీ లీజుకిస్తుంది. 

 

తాజా ఐపీవోలో ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో​ షేర్లను విక్రయిస్తున్నారు. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ‍2,083 కోట్లు, ఖర్షీద్‌ యాజ్ది దరువాలా రూ.1,041 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ చేస్తున్నారు. కనుక ఐపీవో ద్వారా వచ్చే నిధులు ప్రమోటర్ల జేబుల్లోకి వెళతాయే కానీ, కంపెనీ వ్యాపార అవసరాలు, వృద్ధి ప్రణాళికలకు కాదని గుర్తుంచుకోవాలి. ఐపీవో తర్వాత షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ వాటా 65.77 శాతం నుంచి 49.11 శాతానికి, ఖర్షీద్‌ యాజ్ది వాటా 33.33 శాతం నుంచి 25.01 శాతానికి తగ్గుతాయి. 2018-19లో ఈ కంపెనీ లాభం వార్షికంగా 41.66 శాతం పెరిగి రూ.638 కోట్లుగాను, ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.8,240 కోట్లుగానూ ఉన్నాయి. You may be interested

నష్టాల ప్రారంభం....నిముషాల్లో లాభాల్లోకి

Tuesday 6th August 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యద్ధం....కరెన్సీ యుద్ధంగా పరిణమించడం, కశ్మీర్‌ను విభజించడం వంటి అంతర్జాతీయ, దేశీయ అంశాల నడుమ భారీ పతనాల్ని చవిచూస్తున్న భారత్‌ సూచీలు మంగళవారం సైతం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 132 పాయింట్ల నష్టంతో 36,568 పాయింట్ల వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల క్షీణతతో 10,815 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అయితే ఆసియా సూచీలు భారీ నష్టాల నుంచి కోలుకుంటున్ననేపథ్యంలో భారత్‌ సూచీలు సైతం మార్కెట్‌ ప్రారంభమైన

కరెక్షన్‌కు ఈ స్థాయిలో బ్రేక్‌ పడుతుందా..?

Tuesday 6th August 2019

స్టాక్‌ మార్కెట్లు సోమవారం కూడా నష్టాల పాలయ్యాయి. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయాలు, వాణిజ్య యుద్ధం విషయమై తాజా ఆందోళనలు అమ్మకాలకు దారితీయడంతో నష్టాలు తప్పలేదు. ఐటీ సూచీ తరహా అన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌ సూచీ 1.4 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2 శాతం మేర నష్టపోయాయి. ఈ నేపథ్యంలో స్టాక్‌ సూచీల తదుపరి గమనంపై నిపుణుల విశ్లేషణ పరిశీలిస్తే...   నిఫ్టీ సమీప ట్రెండ్‌ ప్రతికూలంగానే ఉంటుంది. హ్యామర్‌ తరహా

Most from this category