News


స్టీల్‌ షేర్లు... తగ్గినప్పుడల్లా కొనొచ్చు!

Thursday 5th December 2019
Markets_main1575518976.png-30068

నిపుణుల సూచన
అంతర్జాతీయంగా స్టీల్‌ రంగం బాగుందని, ఈ నేపథ్యంలో దేశీయ స్టీల్‌స్టాకుల్లో వచ్చే పతనాలకు ఆందోళన పడాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి ఇలాంటి పతనాలను కొత్త కొనుగోళ్లకు అవకాశాలుగా మలచుకోవాలని చెప్పారు. ట్రేడ్‌వార్‌ జాప్యం జరగొచ్చన్న పుకార్లు ఇటీవల స్టీల్‌స్టాకుల్లో కరెక‌్షన్‌ తెచ్చాయి. యూఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలతో ఇటీవల కాలంలో జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, టాటాస్టీల్‌, జేఎస్‌పీఎల్, సెయిల్‌ తదితర షేర్లు నష్టాలు చూశాయి. అయితే వాల్యూషన్లు, ఫండమెంటల్స్‌ చూసుకుంటే ఈ షేర్లను తగ్గినప్పుడల్లా కొనొచ్చని నిపుణులు సలహా ఇచ్చారు. ఇటీవల కాలంలో దేశీయ స్టీల్‌ కంపెనీలు 2-3 శాతం మేర ధరలు పెంచాయి. అంతర్జాతీయంగా కూడా స్టీలు ధరలు దాదాపు 3.5 శాతం పెరిగాయి. దేశీ కంపెనీలు మరో 2-3 శాతం మేర ధరలు పెంచాలని యోచిస్తున్నాయి. ఇవన్నీ కంపెనీలకు మేలు చేసే అంశాలేనని నిపుణుల విశ్లేషణ. అంతర్జాతీయంగా స్టీల్‌ ధరలు 11 శాతం పెరిగినా, దేశీయ స్టీల్‌ ధరలు మాత్రం 5-6 శాతమే పెరిగాయి. అందువల్ల ఇవి మరింత పెరిగే ఛాన్సులున్నాయి.

మరోవైపు స్టీల్‌ తయారీకి అవసర ముడిపదార్ధాల ధరలు ఇటీవల కాలంలో బాగా పతనమయ్యాయి. అంతర్జాతీయంగా ముడి ఇనుము ధర ఏడాది గరిష్ఠం నుంచి 30 శాతం పతనమైంది. అంతర్జాతీయ కుకింగ్‌ కోల్‌ ధరలు ఏడాది హై నుంచి 30 శాతం దిగివచ్చాయి. ఇవన్నీ కంపెనీలకు కలిసివచ్చే అంశాలేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ధరల పతనం ప్రభావం క్యు3 అనంతరం బాగా కనిపిస్తుందన్నారు. చైనా సహా అంతర్జాతీయంగా స్టీల్‌కు డిమాండ్‌ పెరగడం కూడా కంపెనీలకు కలిసిరానుంది. స్టీల్‌ రంగంలో అప్‌సైకిల్‌ ఆరంభమవుతున్నందున స్టీల్‌ కంపెనీల షేర్లు రాబోయే కాలంలో మంచి పరుగు తీస్తాయని మార్కెట్‌ నిపుణుల భావన. You may be interested

ఎయిర్‌టెల్‌ 400 కోట్ల డాలర్ల సమీకరణ

Thursday 5th December 2019

ఏజీఆర్‌ ఇక్కట్ల నుంచి బయటపడేందుకు ఎయిర్‌టెల్‌ సన్నాహాలు ఆరంభిస్తోంది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్‌ బోర్డు బుధవారం 400 కోట్ల డాలర్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో ప్రస్తుతానికి 300 కోట్ల డాలర్లను వివిధ రూపాల్లో సమీకరిస్తారు. 200 కోట్ల డాలర్లను క్యుఐపీ మార్గంలో, వంద కోట్ల డాలర్లను ఎఫ్‌సీసీబీల జారీ ద్వారా, మరో వంద కోట్ల డాలర్లను ఎన్‌సీడీల జారీ ద్వారా సమీకరించేందుకు బోర్డు అనుమతినిచ్చింది. ఇందులో చివరి రెండు

18న జీఎస్‌టీ మండలి సమావేశం

Thursday 5th December 2019

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమీక్షా సమావేశం ఈ నెల 18వ తేదీన జరగనుంది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.  అంచనాలకన్నా తక్కువ జీఎస్‌టీ వసూళ్లు, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన జీఎస్‌టీ పరిహారం వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. జీఎస్‌టీ పరిహారం అంశాన్ని ఈ సమీక్షా సమావేశం చర్చిస్తుందని బుధవారం స్వయంగా

Most from this category