News


వెలుగులో స్టీల్‌ షేర్లు

Monday 4th November 2019
Markets_main1572857382.png-29334

అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్ల ర్యాలీ కారణంగా దేశీయ మార్కెట్లో  స్టీల్‌ షేర్లు మెరుస్తున్నాయి. అమెరికా చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల్లో భాగంగా పూర్తిస్థాయి ఒప్పందంపై ఇరుదేశాధ్యక్షులు ఈ నెలలో సంతకాలు చేయవచ్చని సంకేతాలు వెలువడ్డాయి. ఈ సానుకూలాంశంతో రానున్న రోజుల్లో మందగించిన ప్రపంచ వృద్ధి తిరిగి కోలుకుంటుందనే అంచనాలు ప్రపంచమార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ పెంచాయి. స్థూల ఆర్థిక వ్యవస్థలో అనుకూలమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఫెర్రస్‌ స్టాక్స్‌ గడ్డుకాలం సమిసిపోతుందనే ఆశాభావాన్ని ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తుంది. ఫలితంగా మిడ్‌సెషన్‌ సమయానికి స్టీల్‌ రంగంలో ప్రధాన షేర్లైన జిందాల్‌ స్టీల్‌ 9శాతం ర్యాలీ చేసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6శాతం లాభపడింది. సెయిల్‌, వేదాంత, టాటా స్టీల్‌ షేర్లు 4శాతం పెరిగాయి. స్టీల్‌ స్టాక్స్‌లతో మెటల్‌ షేర్లలో ‍ప్రధాన షేర్లైన అల్యూమినియం కాపర్‌ తయారీ కంపెనీ హిందాల్కోలు 3శాతం పెరిగాయి. అలాగే, మెయిల్‌, ఏపిల్‌ అపోలో, ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు 2.50శాతం నుంచి అరశాతం పెరిగాయి. మరోవైపు వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. 



You may be interested

మీడియం టెర్మ్‌ కోసం స్టాక్‌ సిఫార్సులు

Monday 4th November 2019

పటిష్టమైన అప్‌ట్రెండ్‌లో వున్న ప్రస్తుత మార్కెట్లో మధ్య కాలానికి రాబడుల్ని ఇవ్వగలిగే షేర్లను వివిధ విశ్లేషకులు సూచించారు. అవి.... విశ్లేషకులు: ఎస్‌ఎస్‌జే ఫైనాన్స్‌ అండ్‌ సెక్యురిటీస్‌     కోటక్‌ మహింద్రా బ్యాంక్‌: కొనచ్చు; తాజా ధర: రూ. 1,578; టార్గెట్‌ ధర: రూ. 1,871; అప్‌సైడ్‌: 18 శాతం; కాలవ్యవధి: 9-12 నెలలు కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ వారపు చార్టులలో 2017 జనవరిలో ఏర్పరిచిన స్థాయి రూ. 692 నుంచి జూన్‌ 2018 ఏర్పరిచిన స్థాయి

మళ్లీ రూ. 40 స్థాయికి యస్‌బ్యాంక్‌??

Monday 4th November 2019

బ్రోకరేజ్‌ల అంచనాలు తాజాగా యస్‌బ్యాంకు మేనేజ్‌మెంట్‌ ప్రకటించిన మూలధన సమీకరణతో బ్యాంకు షేరు మరోమారు రూ. 40 స్థాయిలకు దిగివస్తుందని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు, నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు తాజా ఫలితాల్లో ఏమాత్రం మెరుగుదల చూపలేదు. దీంతో బ్యాంకుపై ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న పాజిటివ్‌ ధృక్పధం కరుగుతున్న సూచనలు కనిపించాయి. తాజాగా ప్రకటించిన మూలధన సమీకరణలో భాగంగా బ్యాంకు ఈక్విటీలో దాదాపు 30 శాతం వాటాను విక్రయించే అవకాశం ఉందని, ఇందుకు

Most from this category