News


ఆటుపోట్ల మార్కెట్లో ఇవే బెటర్‌!

Monday 10th February 2020
Markets_main1581309260.png-31644

దేశీయ మార్కెట్లు గతవారం ఆరంభంలో చూపిన జోరును కొనసాగించలేకపోతున్నాయి. ఈ వారం ఆరంభంలో సూచీలు దాదాపు అరశాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా కరోనా భయాలు, ఆర్థిక మందగమన భయాలు.. మార్కెట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా స్థిర ప్రదర్శన చూపే క్వాలిటీ స్టాకులను నమ్ముకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో మంచి రాబడులు ఇచ్చిన ట్రాక్‌ రికార్డు ఉండి, నాణ్యమైన మేనేజ్‌మెంట్‌ ఉన్న కంపెనీల షేర్లపై దృష్టి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. దేశీయ ఎక్చేంజ్‌ల్లోని దాదాపు 3000 షేర్లలో 56 షేర్లు మాత్రమే గత మూడేళ్లుగా దాదాపు 10 శాతం వార్షిక రాబడులు ఇస్తున్నాయి. వీటిలో 22 కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ.వెయ్యికోట్లపైన ఉంది. ప్రస్తుత పరిస్థితిలో ఇన్వెస్టర్లు ఈతరహా స్టాకులను నమ్ముకోవడం మంచిది. 


ఇలా దశాబ్దకాలంగా మంచి రాబడినిస్తున్న షేర్లలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, నెస్లె, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌; బెర్గర్‌ పెయింట్స్‌, దివీస్‌ ల్యాబ్‌, అబాట్‌ ఇండియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, జుబిలాంట్‌ ఫుడ్‌వర్క్స్‌, బాటా ఇండియా తదితరాలున్నాయి. ఇవన్నీ వివిధ వ్యాపార వలయాలను తట్టుకొని నిలిచి మార్కెట్‌లో లీడర్‌షిప్‌ను కొనసాగిస్తున్నాయి. వీటి పద్దుల పట్టీలు పరిశీలిస్తే ఈ ఏడాది కూడా ఇవి మంచి ఫలితాలు, రాబడులు అందించగలవని భావిస్తున్నట్లు ఈక్వినోమిక్స్‌ రిసెర్చ్‌ అడ్వైజరీ తెలిపింది. You may be interested

మీ ‘పన్ను’ దారేది..?

Monday 10th February 2020

ఐటీ: కొత్తదా.. పాతదా? ఎవరికి ఏ పన్ను విధానం ప్రయోజనం... రూ.10 లక్షల ఆదాయంపై ప్రస్తుత విధానమే లాభం మినహాయింపులను పూర్తిగా వినియోగించుకోవాలి దాంతో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు సెక్షన్‌ 80సీ ఇన్వెస్ట్‌ చేయని వారికి పన్ను ఆదా ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోని వారికి నూతన పన్ను విధానం ప్రయోజనకరం ఎవరికి ఏదన్నది వారి ఆర్థిక ప్రణాళిక ప్రకారమే నిర్ణయం ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నూతన పన్ను రేట్లతో

వేరే ఫండ్‌కు మారిపోవాలా ?

Monday 10th February 2020

(ధీరేంద్ర కుమార్‌ వాల్యూ రీసెర్చ్‌ సీఈవో) ప్ర: ఒక కంపెనీ(యాక్సిస్‌) మ్యూచువల్‌ ఫండ్స్, ఇతర కంపెనీల మ్యూచువల్‌ ఫండ్స్‌ కంటే మంచి రాబడులనిస్తున్నాయి. ఒకే కేటగిరీ అని కాకుండా అన్ని కేటగిరీల ఫండ్స్‌ విషయంలో కూడా ఈ కంపెనీ పనితీరు బాగా ఉంది. దీనికేమైనా ప్రత్యేకమైన కారణాలున్నాయా ? -సూరిబాబు, విశాఖపట్టణం  జ: సదరు కంపెనీ అనుసరిస్తున్న పెట్టుబడుల వ్యూహం మంచి ఫలితాలనిస్తున్నందువల్ల ఆ కంపెనీ ఫండ్స్‌ మంచి పనితీరు కనబరుస్తున్నాయని చెప్పవచ్చు. ఒక్కో

Most from this category