STOCKS

News


స్థిరంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌

Monday 12th August 2019
Markets_main1565583999.png-27697

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ సోమవారం స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:15 ని.సమయంలో 7  పాయింట్ల నష్టంతో 11,116.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11123 పాయింట్లతో పోలిస్తే 7 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి.  మరోవైపు ఆసియా ప్రధాన సూచీలు లాభనష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు శుక్రవారం కూడా నష్టపోయాయి.   

మిశ్రమంగా ఆసియా మార్కెట్లు:- 
ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ సోమవారం స్వల్పలాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. అమెరికా ఎన్నికలు వచ్చే ఏడాది (2020)లో జరుగుతున్న నేపథ్యంలో అం‍తవరకు అమెరికా చైనాల మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఉండకపోవచ్చని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ అంచనా వేసింది. అలాగే ట్రేడ్‌ వార్‌ అత్యధికంగా అమెరికా ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌  తెలిపింది.  చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 0.70శాతం లాభంతో 2,794 పాయింట్ల వద్ద, జకర్తా కాంపోసిట్‌ అరశాతం నష్టంతో 6,256.68 వద్ద, కోప్సి ఇండెక్స్‌ అరశాతం లాభంతో 1,945.85 వద్ద, తైవాన్‌ ఇండెక్స్‌ 0.10శాతం స్వల్ప లాభంతో 10, 504 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌, సింగపూర్‌ మార్కెట్లకు నేడు సెలవు. 

అమెరికా మార్కెట్లు మళ్లీ పతనం:- 
అమెరికా చైనాల దేశాల మధ్య సెప్టెంబర్‌లో జరగాల్సిన వాణిజ్య పరిష్కార చర్చలు రద్దు అయ్యే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అనుమానం వ్యక్తం చేయడంతో శుక్రవారం అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. అలాగే పలు దేశ సెంట్రల్‌ బ్యాంకులు వడ్డీరేట్ల కోత తగ్గింపునకు మొగ్గు చూపుతుండం కూడా అక్కడి ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఈ దేశ ప్రధాన ఇండెక్స్‌లైన ఎస్‌అండ్‌పీ 0.66శాతం నష్టపోయి 2.918.76 వద్ద, డోజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ ఏవరేజ్‌ 0.34శాతం క్షీణించి 26,287 వద్ద, నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 1శాతం పతనమైన 7,959 వద్ద స్థిరపడ్డాయి. You may be interested

‘పన్ను’కు టైమైంది....

Monday 12th August 2019

ఈ నెలాఖరు వరకు ఐటీఆర్‌ దాఖలు గడువు ఒక నెలపాటు పొడిగించిన కేంద్రం గడువులోపు దాఖలుతో జరిమానాల భారం ఉండదు ఆదాయంలో ఎన్నో భాగాలు కొన్నింటిపైనే పన్ను మినహాయింపులు పోను మిగిలిన ఆదాయంపై పన్ను ఆన్‌లైన్‌లోనే సులభంగా రిటర్నులు దాఖలు అందరికీ ఒకటే ఫామ్‌ కాదు ఒక్కో వర్గానికి ఒక్కో ఐటీఆర్‌ గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నులు దాఖలు చేసేందుకు పెద్దగా సమయం లేదు. వాస్తవానికి జూలై చివరి నాటికే ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం

నేడు మార్కెట్లకు సెలవు

Monday 12th August 2019

బక్రీద్‌ సందర్భం‍గా సోమవారం మార్కెట్లకు సెలవు దినం. అందుచేత బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు పనిచేయవు.  అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌కు కూడా సెలవు. కమోడిటీ ఎక్సే​ంజ్‌లు మాత్రం మధ్యాహ్నం పనిచేయవు. సాయంత్ర సమయంలో యధావిధిగా పనిచేస్తాయి. ఇక స్టాక్‌ మార్కెట్‌ తిరిగి యథావిధిగా మంగళవారం (13న) ప్రారంభమవుతుంది. గతవారం ట్రేడింగ్‌ చివరిరోజైన శుక్రవారం మార్కెట్‌ వరుసగా రెండోరోజూ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 254.55 పాయింట్ల లాభంతో 37,581.91 వద్ద నిఫ్టీ 77.20 పాయింట్లు పెరిగి 11,109.70

Most from this category