News


ఫలితాల ఎఫెక్ట్‌...ఎస్‌ఆర్‌ఎఫ్‌ 14 శాతం ర్యాలీ

Tuesday 6th August 2019
Markets_main1565080206.png-27577

ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో కంపెనీ ఆశించిన స్థాయిలో ఫలితాలను నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. నిన్న మార్కెట్‌ ముగింపు అనంతరం కంపెనీ క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్షాలిడేషన్‌ ప్రాతిపదికన కంపెనీ తొలి క్వార్టర్లో నికరలాభం 41 శాతం వృద్ధి చెంది రూ.189.22 కోట్లను ఆర్జించింది. ఆదాయం 9శాతం పెరిగి రూ.1,828 కోట్లుగా నమోదైంది. నిర్వహణ లాభం 16 శాతం పుంజుకుని రూ. 295 కోట్లకు చేరింది. రికవరీ అనుకున్న దానికంటే నెమ్మదిగా జరగడంతో కెమికల్స్‌ వ్యాపారం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ క్వార్టర్లో ఫిల్మ్‌ వ్యాపారం ఆశించినదాని కంటే ఎక్కువగానే రాణించింది. వినియోగదారుల నుంచి ఆర్డర్లు రాకపోవడంతో టెక్స్‌టైల్స్‌ వ్యాపారంపై ఆశించిన స్థాయిలో రాణించకలేకపోయింది. పీటీఎఫ్‌ఈ తయారీ కోసం సమీకృత ప్లాంటు ఏర్పాటుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ పేర్కొంది. ఇందుకు రూ.424 కోట్లవరకూ వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో దహేజ్‌ యూనిట్‌ మూసివేసినట్లు సమాచారం ఇచ్చింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉండటంతో కంపెనీ నేడు 2.50శాతం లాభంతో రూ.2638.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి ట్రేడర్లు, ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో షేరు 15శాతం పెరిగి రూ.2960.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.1:30ని.లకు షేరు గతముగింపు ధర(రూ.2578.45)తో పోలిస్తే 13.50శాతం లాభంతో రూ.2926.55ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా షేరు ఏడాది కనిష్ట, గరిష్ట ధరలు వరుసగా రూ. 1616.60 రూ.3086.00లుగా నమోదయ్యాయి. 



You may be interested

ఐదేళ్ల కోసం... ప్రస్తుతం ఇన్వెస్ట్‌ చేయోచ్చు

Tuesday 6th August 2019

మార్కెట్లలో పతనం ఇన్వెస్టర్లను నిరాశావాదం వైపు నడిపించకూడదు. ఈ పరిస్థితిని మార్కెట్లలో కొనుగోలు చేయడానికి, రాబోయే ఐదేళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశంగా చూడాలని ఎమ్కే వెల్త్ మేనేజ్‌మెంట్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ జోసెఫ్ థామస్ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. కార్పోరేట్‌ ఆదాయాలపై అంచనాలు లేవు.. సానుకూల లేదా ప్రతికూల కార్పోరేట్‌ ఆదాయాలు మార్కెట్లను ఆశ్య్చర్యపరచలేదు. కార్పోరేట్‌

మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Tuesday 6th August 2019

గతకొద్ది రోజులుగా భారీగా నష్టపోయిన మెటల్‌ షేర్లకు మంగళవారం ట్రేడింగ్‌లో కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా నేడు లాభాల మార్కెట్లో మెటల్‌ షేర్లు సైతం మెరుస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేడు 2,385.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆరంభం నుంచి మెటల్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇంట్రాడేలో ఇండెక్స్‌ 2శాతం లాభపడి 2466.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది.

Most from this category