News


ఎస్‌ఆర్‌ఎఫ్‌, పాలీకేబ్‌, బాలకృష్ణ -బెస్ట్‌ మిడ్‌ క్యాప్స్‌!?

Thursday 23rd January 2020
Markets_main1579762217.png-31131

టెలికంలో ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో భేష్‌
ఫార్మా రంగంలో బయోకాన్‌, దివీస్‌ లేబ్స్‌కు ఓటు
కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలున్న కంపెనీలకు చెక్‌

ఇటీవల మార్కెట్లలో ట్రెండ్‌ మారిందంటున్నారు షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ప్రెసిడెం‍ట్‌ హేమంగ్‌ జానీ. ఎంపిక చేసిన కౌంటర్లు బలపడుతున్నప్పటికీ.. ఇటీవల బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రెండ్‌ అంత ఆశావహంగాలేదంటూ బడ్జెట్‌వరకూ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇంటర్వ్యూలోని ఇతర పలు అంశాలు ఇలా..

ప్రధానంగా ఫైనాన్షియల్స్‌ ఆధారంగానే నిఫ్టీలో 22 శాతం వృద్ధిని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. అయితే ఇండస్‌ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ తదితర ఫలితాలను చూస్తే పరిస్థితులు అంత ఆశావహంగా కనిపించడంలేదు. స్లిప్పేజెస్‌, రుణాల నాణ్యత వంటి అంశాలు నిరాశపరుస్తున్నాయి. మొత్తంగా ఫైనాన్షియల్స్‌ వృద్ధి నిరుత్సాహపరుస్తోంది. అయితే టెలికం వంటి కొన్ని రంగాలతోపాటు, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ మంచి పనితీరును ప్రదర్శిస్తున్నాయి. బ్యాంకింగ్‌ నుంచి పెట్టుబడులు వీటికి మళ్లవచ్చు. కొంతమంది బ్యాంకింగ్‌ రంగంలో క్లిష్టపరిస్థితులు తొలగినట్లేనని చెబుతున్నప్పటికీ మొండి రుణాల(ఎన్‌పీఎల్‌) సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బడా ప్రయివేట్‌ బ్యాంకులలో అతిగా ఇన్వెస్ట్‌ చేయడం తగదు.
మిడ్‌ క్యాప్స్‌లో
మిడ్‌ క్యాప్స్‌లో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌, పాలీకేబ్‌ ఇండియా, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ పటిష్ట పనితీరు ప్రదర్శించాయి. ఫలితాలు, వృద్ధి అవకాశాల ఆధారంగా మార్కెట్లు ఈ కౌంటర్లపట్ల దృష్టిసారించే వీలుంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లను పెట్టుబడులకు పరిశీలించవచ్చు. ఎల్‌అండ్‌టీ పనితీరు విషయానికివస్తే.. డైవర్సిఫైడ్‌ కంపెనీ కావడంతో ఏవో కొన్ని రంగాలపైనే ఆధారపడకపోవడం ప్లస్‌పాయింట్‌కాగా.. ఆదాయం, నికర లాభం ఆకట్టుకోలేదు. అయితే ఆర్డర్‌బుక్‌ బలపడటం సానుకూల అంశం. ఏడాది కాలంగా ఈ షేరు పుంజుకోలేదు. ఆశావహ అంచనాల నేపథ్యంలో ఈ షేరుని హోల్డ్‌ చేయవచ్చు.
సమస్యలున్నా
ఏజీఆర్‌ బకాయిలు, స్పెక్ట్రమ్‌ వేలం తదితర సమస్యలున్నప్పటికీ ఇటీవల టెలికం రంగం జోరు చూపుతోంది. ఈ ఏడాది(2020) టెలికం కంపెనీలు మెరుగైన ఫలితాలు ప్రకటించనున్నాయి. ప్రధానంగా ఏజీఆర్‌ బకాయిల చెల్లింపులకు వీలుగా నిధులను సమకూర్చుకున్న భారతీ ఎయిర్‌టెల్‌ బలంగా కనిపిస్తోంది. పటిష్ట బ్యాలన్స్‌షీట్‌, వృద్ధి అవకాశాల రీత్యా ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో ఉత్తమ పనితీరు చూపవచ్చు. 
ఫార్మా 3 విభాగాలు
ఫార్మా రంగాన్ని మూడు విభాలుగా పేర్కొనవచ్చు. ఎంఎన్‌సీలను మినహాయిస్తే.. యూఎస్‌ జనరిక్‌ అమ్మకాలపై ఆధారపడే కంపెనీలలో సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌ తదితరాలను పేర్కొనవచ్చు. ఇప్పటికే పలు సవాళ్లను అధిగమించినప్పటికీ వృద్ధిలో ఆశాజనక పరిస్థితులు కనిపించడంలేదు. ‍స్పెషాలిటీ డ్రగ్స్‌ వంటి విభాగాలు ఊపందుకోకుంటే.. ఈ కంపెనీల వేల్యుయేషన్స్‌ సైతం ఆశించిన స్థాయిలో మెరుగుపడకపోవచ్చు. ఇక దివీస్‌ లేబ్స్‌, బయోకాన్‌ వంటి కంపెనీలు ప్రపంచ పరిస్థితులు ఎలాఉన్నా స్పష్టమైన వృద్ధిని చూపుతున్నాయి. దీంతో మార్కెట్లు ఎంపిక చేసిన కొన్ని కౌంటర్లవైపు దృష్టిసారిస్తు‍న్నాయి. ఫార్మాలో బయోకాన్‌, దివీస్‌ మెరుగ్గా కనిపిస్తున్నాయి.
ఈ కౌంటర్లకు దూరం 
కంపెనీకి కీలకమైన బిజినెస్‌ మందగించడంతోపాటు.. ప్రకటనల ఆదాయం తదితరాలు సైతం వెనకడుగు వేయడంతో జీ ఇటీవల నేలచూపులు చూస్తోంది. దీనికితోడు కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలు కంపెనీని చుట్టుముట్టాయి. షేరు దిద్దుబాటుకు లోనైనప్పటికీ కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సమస్యలున్న కంపెనీలను ఎంపిక చేసుకోకపోవడమే మేలు. ఇటీవల పలు ఇతర కారణాల వల్ల యస్‌ బ్యాంక్‌ కౌంటర్‌ పతనమవుతూ వచ్చింది. ఎప్పటికప్పుడు రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇంతకంటే క్షీణించదన్న అంచనాలతో కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ బాటలోనే ఇండియాబుల్స్‌, యస్‌ బ్యాంక్‌ వంటి కౌంటర్లలో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా పెరుగుతూ వస్తోంది. You may be interested

ఐదునెలల గరిష్ఠానికి సిమెంట్‌ ధరలు!

Thursday 23rd January 2020

ఏడునెలల వరుస పతనం తర్వాత జనవరిలో సిమెంట్‌ ధరలు ఒక్కమారుగా ఐదునెలల గరిష్ఠాలకు ఎగిసాయి. దేశవ్యాప్తంగా నిర్మాణ రంగ కార్యకలాపాలు జోరందుకోవడంతో సిమెంట్‌ ధరలు పెరిగాయి. డిసెంబర్‌తో పోలిస్తే ఆల్‌ఇండియా సగటు సిమెంట్‌ బస్తా ధర రూ.17 పెరిగి రూ. 340కి చేరిందని బ్లూమ్‌బర్గ్‌ క్వింట్‌ సర్వే తేల్చింది. గతేడాది ఏప్రిల్‌ తర్వాత ఒక్క నెల్లో సిమెంట్‌ ధర ఇంత పెరగడం ఇదే తొలిసారి. ధర పెరుగుదల అధికంగా దక్షిణాదిన

స్వల్పంగా పెరిగిన పసిడి

Thursday 23rd January 2020

 చైనాలో విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో రక్షణాత్మక పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తిచూపించిన నేపథ్యంలోగురువారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ ధర 3 డాలర్లు పెరిగి 1559.00 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. దేశీయ ఎంసీఎక్స్‌లో10 గ్రాముల పసిడి ధర రూ.61 స్వల్ప లాభంతో రూ. 39974 వద్ద కదులుతోంది.   

Most from this category