News


ఎస్‌ఆర్‌ఎఫ్‌ జూమ్‌- జీ.. కుదేల్‌

Wednesday 5th February 2020
Markets_main1580896823.png-31534

పెట్టుబడి ప్రణాళికలకు బోర్డు అనుమతించినట్లు వెల్లడించడంతో విభిన్న కెమికల్స్‌ తయారీ కంపెనీ ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. కాగా.. మరోపక్క కంపెనీ ఖాతా పుస్తకాలను ప్రభుత్వం తనిఖీ చేయనున్న వార్తలతో మీడియా రంగ దిగ్గజం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి ఎస్‌ఆర్‌ఎఫ్‌ భారీ లాభాలతో కళకళలాడుతుంటే.. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కౌంటర్‌ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం..

ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌
ఆగ్రో కెమికల్స్‌ విభాగంలో వినియోగించగల ఇంటర్మీడియెట్స్‌ తయారీకి ప్రత్యేకించిన ప్లాంట్ల ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఎస్‌ఆర్‌ఎప్‌ లిమిటెడ్‌ పేర్కొంది. ఇందుకు రూ. 238 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. వార్షికంగా 2150 మిలియన్‌ టన్నుల(ఎంటీపీఏ) సామర్థ్యంగల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. నవంబర్‌కల్లా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.20 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ షేరు దాదాపు 7 శాతం జంప్‌చేసి రూ. 3989కు చేరింది. ఇంట్రాడేలో రూ. 3997ను అధిగమించింది. ఇది సరికొత్త గరిష్టంకావడం విశేషం! కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన కంపెనీ ఈ ఏడాది క్యూ3లో 40 శాతం వృద్ధితో రూ. 259 కోట్ల నికర లాభం ఆర్జించింది. 

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌
కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కంపెనీకి చెందిన ఖాతా పుస్తకాల పరిశోధనకు ఆదేశాలు జారీ చేసినట్లు వెలువడిన వార్తలు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్లో అమ్మకాలకు కారణమయ్యాయి. దీంతో వరుసగా రెండో రోజు ఈ షేరు నష్టాల బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 8.5 శాతం పతనమై రూ. 224 దిగువకు చేరింది. ఇంట్రాడేలో రూ. 220 వరకూ జారింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అంశంలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కార్పొరేట్‌ శాఖ ఆర్థిక గణాంకాలపై పరిశోధనలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కంపెనీ నుంచి కొంతమంది స్వతంత్ర డైరెక్టర్లు వైదొలగిన విషయం విదితమే.



You may be interested

ఫ్యూచరో-ఈను ఆవిష్కరించిన మారుతీ సుజుకీ

Wednesday 5th February 2020

బుధవారం మారుతీ సుజుకీ ఆటో ఎక్స్‌పో-2020లో కూపే స్టైల్‌ ఎలక్ట్రిక్‌ కాన్సెప్ట్‌ కారు ‘‘ఫ్యూచరో-ఈ’’ను  ఆవిష్కరించింది. మిషన్‌ గ్రీన్‌ మిలియన్‌లో భాగంగా ఈకారును విడుదల చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. పర్యావరణాన్ని దృష్టిలోపెట్టుకుని వచ్చే ఐదేళ్లలో 10 లక్షల గ్రీన్‌ కార్ల(సీఎన్‌జీ, హైబ్రిడ్స్‌, ఎలక్ట్రిక్‌)ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈఓ కెనిచీ అయుక్వా వెల్లడించారు.  ఫ్యూచరో- ఈలో క్రాస్‌బార్‌ డిజైన్‌ ఉంది. కారు

కొత్త సంస్కరణల్లేవు.. అయినా రేటింగ్‌ యథాతధం..

Wednesday 5th February 2020

బడ్జెట్‌పై ఫిచ్‌ రేటింగ్స్‌ నూతన నిర్మాణాత్మక సంస్కరణలు తాజా బడ్జెట్లో పెద్దగా లేవని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజన్సీ ఫిచ్‌ రేటింగ్స్‌ అభిప్రాయపడింది. అయితే ఈ కారణంతో భారత వృద్ధి అంచనాలను మార్చడం లేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇండియా జీడీపీ 5.6 శాతం వృద్ధి సాధిస్తుందని తెలిపింది. 2024-25 నాటికి జీడీపీలో ప్రభుత్వ వ్యయం వాటా 60 శాతానికి పరిమితం చేయాలన్న ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట లక్ష్యం నెరవేరకపోవచ్చని అభిప్రాయపడింది. 2021-11 నాటికి

Most from this category