News


నష్టాలలో ట్రేడవుతున్న స్పైస్‌ జెట్‌, ఇండిగో

Friday 21st June 2019
Markets_main1561097823.png-26467

పెరిగిన చమురు ధరలే కారణం
చమురు ధరలు గత మూడు వారల గరిష్ఠానికి పెరగడంతో శుక్రవారం స్పైస్‌జెట్‌ షేరు విలువ 5శాతం, ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో) షేరు విలువ 3 శాతం నష్టపోయాయి. అమెరికా డ్రోన్‌ను ఇరాన్‌ కూల్చివేసిందనే వార్తల నేపథ్యంలో పశ్చిమాసియా దేశాలలో ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరిగాయి. మూడు నెలల కోసం  జెట్‌ ఎయిర్‌వేస్‌ విదేశి విమాన సర్విసుల హక్కులను విమానయాన మంత్రిత్వ శాఖ దేశియ విమాన సంస్థలకు  పంచడంతో మొదటి స్థానంలో ఉన్న ఇండిగో వారానికి 84 విమాన సర్వీసులు, రెండవ స్థానంలో ఉన్న స్పైస్‌ జెట్‌ వారానికి 77 విమాన సర్వీసులను పొందాయి. దేశియ విమాన ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్‌లో పడిపోగా మే నెలలో 2.96 శాతం పెరిగిందని విమాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ప్రకటించింది. 49 శాతం దేశి మార్కెట్‌ వాటాతో ఇండిగో ప్రథమ స్థానంలో ఉండగా , స్సైస్‌ జెట్‌ వాటా మే లో 13.1శాతం నుంచి 14.8 శాతం పెరిగి రెండవ స్థానంలో ఉంది.  ఉదయం 11.37 సమయానికి ఇండిగో షేరు 2.37శాతం నష్టంతో రూ.1,544.10 వద్ద, స్పైస్‌ జెట్‌ షేరు 4.67శాతం నష్టంతో రూ.124.45 వద్ద ట్రేడవుతున్నాయి.You may be interested

ఆర్థిక క్రియాశూన్యత సుస్పష్టం

Friday 21st June 2019

ఎంపీసీ భేటీలో ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్య ముంబై: ఆర్థిక వ్యవస్థలో క్రియాశూన్యత సుస్పష్టంగా కనిపిస్తోందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ పేర్కొన్నారు. జూన్‌ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకూ జరిగిన సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 5.75 శాతం) పావుశాతం తగ్గించింది. రేటు తగ్గింపు వరుసగా

కొత్తగా 2.76 లక్షల కొలువులు

Friday 21st June 2019

ఈ ఏడాది ప్రథమార్ధంలో రావచ్చని అంచనా ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ రంగాల్లోనే అత్యధికం టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదికలో వెల్లడి ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్‌, ఎఫ్‌ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. విదేశీ రిటైల్ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి పెద్ద యెత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్‌-సెప్టెంబర్ 2019-20 కాలానికి సంబంధించి ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్‌లీజ్ సర్వీసెస్

Most from this category