News


స్పైస్‌జెట్‌- అలుఫ్లోరైడ్‌ లాభాల్లో

Friday 27th December 2019
Markets_main1577424685.png-30473

లాభాలతో ప్రారంభమైన మార్కెట్లలో ఉదయం సెషన్‌లో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్లు వెలుగులోకి వచ్చాయి. ఈ జాబితాలో అందుబాటు ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్‌ కౌంటర్‌తోపాటు, అల్యూమినియం ఫ్లోరైడ్‌ తయారీ కంపెనీ అలుఫ్లోరైడ్‌ చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం..

స్పైస్‌జెట్‌ లిమిటెడ్‌
గత మూడు రోజులుగా ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్న చౌక ధరల విమానయన కంపెనీ స్పైస్‌జెట్‌ షేరు మరోసారి జోరు చూపుతోంది. బీఎస్‌ఈలో 10.45 ప్రాంతంలో ఈ షేరు 3.75 శాతం జంప్‌చేసింది. రూ. 100 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 102.5 వరకూ ఎగసింది. గత మూడు రోజుల్లో ఈ షేరు 9 శాతం బలపడింది. కాగా.. గత 20 రోజుల సగటుతో పోలిస్తే ఈ కౌంటర్లో ఇప్పటికే ట్రేడింగ్‌ పరిమాణం రెండు రెట్లు ఎగసినట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు.

అలుఫ్లోరైడ్‌ లిమిటెడ్‌
జోర్డాన్‌ కంపెనీలతో కలసి అక్కడ అల్యూమినియం ఫ్లోరైడ్‌ తయారీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు అలుఫ్లోరైడ్‌ పేర్కొంది. జోర్డాన్‌ ఫాస్ఫేట్‌ మైనింగ్‌ కంపెనీ, జోర్డాన్‌ ఇండియా ఫెర్టిలైజర్‌ కంపెనీలతో ప్లాంటు ఏర్పాటుపై ఇప్పటికే తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. అలుఫ్లోరైడ్‌ కంపెనీలో ప్రమోటర్లకు 59.29 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈలో అలుఫ్లోరైడ్‌ షేరు 2 శాతం పెరిగి రూ. 92 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 94.3 వరకూ పుంజుకుంది.



You may be interested

పసిడి.....8వారాల గరిష్టం

Friday 27th December 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 8వారాల గరిష్టం వద్ద స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌ ఔన్స్‌ పసిడి ధర 4డాలర్లు పెరిగి 1,518.65 వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా అమెరికా చైనాల మధ్య కుదిరిన తొలి దఫా ఒప్పందంపై అనుమాలు రేకత్తడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడటం, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఇప్పటికే గరిష్టస్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతున్న తరుణంలో

పీఎస్‌యూ బ్యాంకుల ర్యాలీ

Friday 27th December 2019

మూడు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన దేశీ స్టాక్‌ మార్కెట్లు వారాంతాన జోరందుకున్నాయి. జనవరి డెరివేటివ్‌ సిరీస్‌ తొలి రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ‍ప్రాంతంలో సెన్సెక్స్‌ 202 పాయింట్లు ఎగసి 41,366కు చేరగా.. 53 పాయింట్లు పుంజుకుని 12180 వద్ద ట్రేడవుతోంది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో ఉన్నట్లుండి ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లకు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో పలు పీఎస్‌యూ బ్యాంక్‌ కౌంటర్లు

Most from this category