News


స్పెషాలిటీ కెమికల్‌ షేర్ల జోరు

Thursday 30th January 2020
Markets_main1580365975.png-31333

కరోనా వైరస్‌ కారణంగా దేశీ కంపెనీలకు లబ్ది 
ఏడాది గరిష్టాలకు స్పెషాలిటీ కెమికల్‌ షేర్లు

తాజాగా ప్రపంచ అత్యవసర పరిస్థితికి తెరతీస్తున్న చైనీస్‌ కరోనా వైరస్‌ దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనున్న అంచనాలు పెరుగుతున్నాయి. చైనీస్ హుబే ప్రొవిన్స్‌లో పుట్టిన కరోనా వైరస్‌ ఇటీవల పలు దేశాలకు విస్తరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలకు కారణమవుతోంది. దీంతో దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా బ్రోకింగ్‌ సంస్థ జేంఎం ఫైనాన్షియల్‌ గత కొంతకాలంగా పటిష్ట పనితీరును చూపుతున్న పలు స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీలను ప్రస్తావిస్తోంది. దేశీ కంపెనీలలో కొన్ని చైనా, తదితర ప్రపంచ దేశాలలోని పరిశ్రమలకు ఎగుమతులను నిర్వహించడం ద్వారా లబ్ది పొందుతున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న కరోనా ప్రభావం మరిన్ని అవకాశాలకు దారి చూపగలదని జేఎం అభిప్రాయపడింది. చైనాలోని పలు స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీలు పర్యావరణ నిబంధనల కారణంగా గతంలో మూత పడటంతో కొంతకాలంగా దేశీ కంపెనీలకు అవకాశాలు మెరుగుపడుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి.

ఇకపై మరింత జోరు
నిజానికి 2019లో దేశీ కెమికల్‌ కంపెనీల ఎగుమతులు కొంతమేర మందగించాయి. 2014-18 మధ్య 21 శాతం వార్షిక వృద్ధిని సాధించినప్పటికీ గతేడాది స్వల్ప పెరుగుదలతో సరిపెట్టుకున్నాయి. అయితే ఇటీవల అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు సద్దుమణగడంతో ప్రపంచవ్యాప్తంగా స్పెషాలిటీ కెమికల్స్‌కు డిమాండ్‌ పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా 2020లో ఆదాయం, మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నాయి. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా కూడా దేశీ ప్రొడక్టులకు ఎగుమతి అవకాశాలు పెరగనున్నట్లు అభిప్రాయపడ్డాయి.

జాబితా ఇలా
వివిధ రకాల స్పెషాలిటీ కెమికల్స్‌ తయారీలో దేశీయంగా పలు కంపెనీలు కార్యకలాపాలు విస్తరించాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ది పొందనున్న కంపెనీల జాబితాలో ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌, పీఐ ఇండస్ట్రీస్‌, గలాక్సీ సర్ఫక్టాంట్స్‌, ఆర్తి ఇండస్ట్రీస్‌, అక్షర్‌ కెమ్‌ ఇండియా, మేఘమణి ఆర్గానిక్స్‌, తదితరాలను జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంటోంది.

ఫైన్‌ ఆర్గానిక్‌ జూమ్‌  
ఫైన్‌ ఆర్గానిక్‌ మినహా.. ఇటీవల లాభాల బాటలో సాగుతున్న పలు స్పెషాలిటీ కెమికల్‌ కౌంటర్లలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనికితోడు మార్కెట్లు డీలాపడటం కూడా ప్రభావం​చూపుతున్నట్లు తెలియజేశారు. ఉదయం 11.50 ప్రాంతంలో ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 5.3 శాతం జంప్‌చేసి రూ. 2,418 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2479 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బుధవారం 3 శాతం ఎగసి ఏడాది గరిష్టానికి చేరిన నవీన్‌ ఫ్లోరిన్‌ షేరు 2.5 శాతం క్షీణించి రూ. 1215 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1244 వవరకూ ఎగసింది. ఇక బుధవారం రూ. 3804 సమీపంలో ఏడాది గరిష్టాన్ని చేరిన ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ 0.3 శాతం నీరసించి రూ. 3756 వద్ద ట్రేడవుతోంది. ఇదే విధంగా ముందురోజు రూ. 1588 వద్ద 52 వారాల గరిష్టాన్ని అందుకున్న పీఐ ఇండస్ట్రీస్‌ 1.2 శాతం క్షీణించి రూ. 1520 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో గలాక్సీ సర్ఫక్టాంట్స్‌ 1.5 శాతం బలపడి రూ. 1600 వద్ద కదులుతోంది. 



You may be interested

బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు- బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం డౌన్‌..!

Thursday 30th January 2020

మార్కెట్‌ పతనంలో భాగంగా గురువారం ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం సెషన్‌లో 1శాతం(317 పాయింట్లు) వరకు నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,889.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ ఇండెక్స్‌లో ప్రైవేట్‌ రంగ షేర్లైన యస్‌ బ్యాంక్‌(6 శాతం), ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌(5 శాతం), ఆర్‌బీఎల్‌(3శాతం), అత్యధిక వెయిటేజీ

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 30th January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా స్టాక్‌మార్కెట్‌లో గురువారం ప్రభావితమయ్యే షేర్లు ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌: ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, క్యాపిటల్‌ ఫస్ట్‌ బ్యాంక్‌ ఇటీవల విలీనం అయ్యి ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌గా ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ డిసెంబర్‌ 31తో ముగిసిన  క్యూ3 నికర నష్టం రూ.1,639 కోట్లుగా ప్రకటించింది. కాగా గతేడాది నికర నష్టం రూ.2,504 కోట్లుగా ఉంది. కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌:  గతేడాది సెప్టెంబర్‌తో ముగిసిన క్యూ2లో ఆడిట్‌ చేయని

Most from this category