News


కెమికల్‌ షేర్లు.. రేసు గుర్రాలు

Wednesday 26th February 2020
Markets_main1582710137.png-32111

నెల రోజులుగా లాభాల పరుగు
జాబితాలో ఎన్‌ఎఫ్‌ఐఎల్‌, ఫెయిర్‌కెమ్‌
నియోజెన్‌ కెమ్‌, దీపక్‌ నైట్రైట్‌, ఆల్కిల్‌

కరోనా వైరస్‌ తలెత్తిన తదుపరి నెల రోజులుగా దేశీ స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీలకు డిమాండ్‌ బలపడుతూ వస్తోంది. దీంతో ఫెయిర్‌కెమ్‌ స్పెషాలిటీ, నియోజెన్‌ కెమికల్స్‌, దీపక్‌ నైట్రైట్‌, ఆల్కిల్‌ అమైన్స్‌ తదితర కమోడిటీ కౌంటర్లు నాలుగు వారాల్లో 24-50 శాతం​మధ్య ర్యాలీ చేశాయి. ఈ బాటలో రెండు రోజులుగా నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ సైతం​దూకుడు చూపుతోంది. మంగళవారం ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకగా. తాజాగా మరో 10 శాతం జంప్‌చేసింది. ఇందుకు ఒక గ్లోబల్‌ కంపెనీ నుంచి దాదాపు రూ. 3,000 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకోవడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

నియోజెన్‌ జోరు 
ఫ్లోరోకెమికల్స్‌ విభాగంలో హైపెర్ఫార్మెన్స్‌ ప్రొడక్ట్‌ సరఫరాకు నవీన్‌ ఫ్లోరిన్‌ ఆర్డర్‌ను పొందడంతో జోరందుకుంది. దీంతో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో ఉదయం ట్రేడింగ్‌లోనే రూ. 1630 సమీపంలో చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. తద్వారా 2019 అక్టోబర్‌లో నమోదైన రూ. 693 నుంచి చూస్తే రెట్టింపునకుపైగా ఎగసింది. ఇక నియోజెన్‌ కెమికల్స్‌ మధ్యాహ్నం 3 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో 12 శాతం దూసుకెళ్లి రూ. 516 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 19 శాతం జంప్‌చేసింది. తద్వారా రూ. 548 వద్ద సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. ఇందుకు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలు సహకరిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫలితాలు ప్రకటించాక ఈ షేరు 43 శాతం లాభపడటం గమనార్హం. క్యూ3లో నియోజెన్‌ నికర లాభం 91 శాతం, ఆదాయం 30 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఇబిటా మార్జిన్లు 16.5 శాతం నుంచి 19.4 శాతానికి బలపడ్డాయి. దహేజ్‌ సెజ్‌లో ఏర్పాటు చేసిన ప్లాంటు కారణంగా ఆదాయం మరింత వృద్ధి చూపనున్నట్లు నియోజెన్‌ అంచనా వేస్తోంది. 

ఇతర కౌంటర్లు సైతం
కెమికల్‌ కంపెనీలలో గత నెల రోజుల్లో ఫెయిర్‌కెమ్‌ 50 శాతం ర్యాలీ చేయగా.. ఆల్కిల్‌ అమైన్స్‌ 35 శాతం, దీపక్‌ నైట్రైట్‌ 29 శాతం, భగేరియా ఇండస్ట్రీస్‌ 25 శాతం, ఇండియా గ్లైకాల్స్‌ 24 శాతం, శ్రీపుష్కర్‌ కెమికల్స్‌ 23 శాతం చొప్పున లాభపడ్డాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఆల్కిల్‌ అమైన్స్‌ కెమికల్స్‌ 5 శాతం పెరిగి రూ. 1728 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1774 వద్ద గరిష్ట రికార్డును చేరింది. ఇదే విధంగా రూ. 521 వద్ద దీపక్‌ నైట్రైట్‌ 52 వారాల గరిష్టాన్ని తాకగా.. శ్రీ పుష్కర్‌ కెమికల్స్‌ షేరు దాదాపు 3 శాతం ఎగసి రూ. 128 వద్ద ట్రేడవుతోంది. తొలుత గరిష్టంగా రూ. 134ను అధిగమించింది.You may be interested

మార్కెట్లో మరింత కరెక‌్షన్‌!

Wednesday 26th February 2020

రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అంచనా ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌ నానాటికీ మరింత విస్తరిస్తోంది. దీంతో అంతర్జాతీయ ఎకానమీలన్నీ భయపడుతున్నాయి. ఇది ఇండియాకు సైతం ప్రమాదకరమేనని, వైరస్‌ విస్తరణ మరింత ముదిరితే ఇండియాసైతం ప్రభావితం అవుతుందని మార్కెట్‌ నిపుణుడు రామ్‌దేవ్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ వైరస్‌ చైనాలో దాదాపు 3 వేల మందిని బలికొంది. కరోనా భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు నేల చూపులు చూడడం ఆరంభించాయి. ఇండియా

52 వారాల కనిష్టానికి 166 షేర్లు

Wednesday 26th February 2020

బుధవారం 166 షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. 3P ల్యాండ్‌ హోల్డింగ్స్‌, A2Z ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌, ABB ఇండియా, అగ్రి టెక్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంక్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, ఆంధ్రా పేపర్‌, అపర్‌ ఇండస్ట్రీస్‌, అప్కోటెక్స్‌ ఇండస్ట్రీస్‌, ఆర్కిస్‌, ఆరో గ్రీన్‌టెక్‌, అర్షియా, అటోమోటివ్‌ స్టాంపింగ్స్‌ అండ్‌ అసెంబ్లిస్‌, అసోసియేటెడ్‌ అల్కాహాల్స్‌ అండ్‌ బ్రూవరీస్‌, అట్లాంటా, బజాజ్‌ కన్జూమర్‌కేర్‌, బాల్మర్ లారీ అండ్‌ కంపెనీ, బంధన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌

Most from this category