STOCKS

News


కరోనా ఎఫెక్ట్‌- కెమికల్‌ కంపెనీలకు బెనిఫిట్‌?!

Wednesday 29th January 2020
Markets_main1580277300.png-31298

ఏడాది గరిష్టాలకు స్పెషాలిటీ కెమికల్‌ షేర్లు
6 శాతం జంప్‌చేసిన ఫైన్‌ ఆర్గానిక్‌
3 శాతం లాభపడిన నవీన్‌ ఫ్లోరిన్‌

కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలను వణికిస్తున్న చైనీస్‌ కరోనా వైరస్‌ దేశీ కంపెనీలకు లబ్ది చేకూర్చనుందా.. అంటే అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు. చైనీస్ హుబే ప్రొవిన్స్‌లో పుట్టిన కరోనా వైరస్‌ కారణంగా దేశీయంగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీలకు ఆర్డర్లు పెరిగే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. గత కొంతకాలంగా పటిష్ట పనితీరును చూపుతున్న ఆరు స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీలను ఈ సందర్భంగా జేంఎం ఫైనాన్షియల్‌ ప్రస్తావించింది. ఈ కంపెనీలు చైనాలోని పరిశ్రమలకు ఎగుమతులను నిర్వహించడం ద్వారా లబ్ది పొందుతున్న నేపథ్యంలో తాజాగా నెలకొన్న కరోనా ప్రభావం మరిన్ని అవకాశాలకు దారి చూపగలదని అభిప్రాయపడింది. చైనాలోని పలు స్పెషాలిటీ కెమికల్‌ కంపెనీలు పర్యావరణ నిబంధనల కారణంగా మూత పడటంతో గత కొంతకాలంగా దేశీ కంపెనీలకు అవకాశాలు మెరుగుపడుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఇకపై మరింత జోరు
నిజానికి 2019లో దేశీ కెమికల్‌ కంపెనీల ఎగుమతులు కొంతమేర మందగించాయి. 2014-18 మధ్య 21 శాతం వార్షిక వృద్ధిని సాధించినప్పటికీ గతేడాది స్వల్ప పెరుగుదలతో సరిపెట్టుకున్నాయి. అయితే ఇటీవల అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాలు సద్దుమణగడంతో స్పెషాలిటీ కెమికల్స్‌కు డిమాండ్‌ పెరగనున్నట్లు పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా 2020లో ఆదాయం, మార్జిన్లు మెరుగుపడే వీలున్నట్లు భావిస్తున్నాయి.

52 వారాల గరిష్టాలకు 
ఇటీవల లాభాల బాటలో సాగుతున్న ఫైన్‌ ఆర్గానిక్‌, నవీన్‌ ఫ్లోరిన్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, పీఐ తదితర కౌంటర్లు మరోసారి ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి 52 వారాల గరిష్టాలను తాకాయి. ఉదయం 11.10 ప్రాంతంలో ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 2,444 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 2451 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. నవీన్‌ ఫ్లోరిన్‌ ఇంటర్నేషనల్‌ షేరు 2.6 శాతం పెరిగి రూ. 1231 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1259 వద్ద ఏడాది గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో ఎస్‌ఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌ 0.6 శాతం పుంజుకుని రూ. 3787 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 3804 సమీపంలో ఏడాది గరిష్టాన్ని తాకింది. ఇక పీఐ ఇండస్ట్రీస్‌ 1.6 శాతం క్షీణించి రూ. 1548 వద్ద ట్రేడవుతోంది. అయితే తొలుత రూ. 1588 వరకూ ఎగసింది.ఇది 52 వారాల గరిష్టంకాగా.. గలాక్సీ సర్ఫక్టాంట్స్‌ 0.5 శాతం బలపడి రూ. 1590 వద్ద కదులుతోంది. తొలుత రూ. 1600 వరకూ పెరిగింది!You may be interested

ఆ స్టార్టప్స్‌కు మరో అవకాశం ఉండదు:రతన్‌ టాటా

Wednesday 29th January 2020

ముంబై: ఇన్వెస్టర్ల డబ్బులను వృధాచేసి, మాయమైన స్టార్టప్స్‌కు మరో అవకాశం ఉండదని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘కొన్ని స్టార్టప్స్‌ ఇట్టే ఆకట్టుకుంటాయి. డబ్బులు వసూలు చేస్తాయి. ఆ తర్వాత కనుమరుగవుతాయి. అటువంటి స్టార్టప్స్‌కు రెండు, మూడవ అవకాశం ఉండదు’ అని అన్నారు. టైకాన్‌ లైఫ్‌టైం అచీవ్‌మెంట్‌ అవార్డును ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి చేతుల మీదుగా స్వీకరించిన సందర్భంగా మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు

కోకాపేటలో ఐదెకరాలు కొన్న సాలార్‌పురియా

Wednesday 29th January 2020

ఒమాక్సె నుంచి రూ.650 కోట్లకు కొనుగోలు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ రంగం సంస్థ సాలార్‌పురియా సత్వా కోకాపేటలో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. న్యూఢిల్లీకి చెందిన రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ ఒమాక్సె గ్రూప్‌ నుంచి రూ.650 కోట్ల వ్యయంతో ఈ స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిసింది. సాలార్‌పురియా ప్రస్తుతం హైదరాబాద్‌లో 1.3 కోట్ల చ.అ.ల్లో కమర్షియల్‌ స్పేస్‌ను అభివృద్ధి చేస్తోంది. వచ్చే రెండేళ్లలో

Most from this category