డిస్కౌంట్లో స్పందన స్ఫూర్తి లిస్టింగ్
By Sakshi

మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్పూర్తి మార్కెట్లో లిస్ట్యిన మొదటి రోజే తన ఇష్యు ధర కంటే 3 శాతం పైగా డిస్కౌంట్ ధరతో ప్రారంభమైంది. ఈ కంపెనీ షేరు సోమవారం ఎన్ఎస్ఈ(నేషనల్ స్టాక్ ఎక్సేంజీ)లో 3.6 శాతం డిస్కౌంట్‌తో(ఇష్యు ధర కంటే) రూ. 825 వద్ద, బీఎస్ఈలో 3.7 శాతం డిస్కౌంట్‌తో రూ. 823 వద్ద ప్రారంభమైంది. కాగా ఈ ఫైనాన్స్ సంస్థ జారీచేసిన పబ్లిక్ ఇష్యూకు రూ. 850 (షేరుకు) ఆఫర్ ధర నిర్ణయించారు. స్పందన స్ఫూర్తి షేరు ఉదయం 11.25 సమయానికి ఆఫర్ ధర కంటే 13.15 శాతం తగ్గి రూ. 743.45 వద్ద ట్రేడవుతోంది. వాల్యూమ్ల విషయానికొస్తే, ఈ కంపెనీ బీఎస్ఈలో 37,000 షేర్లు, ఎన్ఎస్ఈలో 6 లక్షల షేర్లు చేతులు మారాయి.
ఈ కంపెనీ రూ. 1,200 కోట్ల ఐపీఓ కి మంచి స్పందన వచ్చింది. మొత్తంగా 1.5 రెట్ల చందాదారులను ఐపీఓ ద్వారా పొందగలిగింది. యాంకర్ ఇన్వెస్టర్లకోసం కేటాయించిన 42,08,886 షేర్లతో కలిపి మొత్తంగా ఈ ఇష్యులో 93,56,725 షేర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి తాజా ఇష్యు ఆదాయాన్ని ఉపయోగించనున్నామని కంపెనీ తెలిపింది.
You may be interested
10900- 11250 పాయింట్ల రేంజ్లో నిఫ్టీ!
Monday 19th August 2019యాక్సిస్ సెక్యూరిటీస్ నిఫ్టీ స్వల్పకాలానికి పరిమిత రేంజ్‌లోనే కదలాడుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ రిసెర్చ్ హెడ్ రాజేశ్ పల్వియా అభిప్రాయపడ్డారు. సూచీల కదలికలపై ఆయన అంచనాలు ఇలా ఉన్నాయి... నిఫ్టీ గతవారం స్వల్ప రేంజ్లో కదలాడి చివరకు స్వల్ప నష్టంతో ముగిసింది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ బేరిష్ క్యాండిల్ ఏర్పరిచింది. ప్రస్తుతం సూచీలు లోయర్టాప్, లోయర్ బాటమ్ ఫార్మేషన్లో కదలాడుతున్నాయి. ట్రెండ్ ఇంకా బలహీనంగానే కనిపిస్తోంది. చార్టుల ప్రకారం నిఫ్టీ 11100 పాయింట్ల పైన
ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్ తక్కువే!
Monday 19th August 2019ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్ తక్కువే! ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో పెట్టుబడులకు రిస్క్ కొంత తక్కువగా ఉండాలని ఆశించే వారు ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ పథకం రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. ఈక్విటీ, డెట్‌తోపాటు, ఆర్బిట్రేజ్ అవకాశాల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఇన్కమ్