News


టీసీఎస్‌ షేర్లు అమ్మేసిన ఎస్‌పీ గ్రూప్‌

Saturday 14th December 2019
Markets_main1576314302.png-30229

ద షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌(ఎస్‌పీ) గురువారం దాదాపు 19 లక్షల షేర్లను విక్రయించింది. ఈ విక్రయంతో గ్రూప్‌ రూ. 380 కోట్లు సమీకరించింది. ఈ నెల్లో ఎస్‌పీ గ్రూప్‌ టీసీఎస్‌ షేర్లను విక్రయించడం ఇది రెండో సారి. గతవారం గ్రూప్‌ దాదాపు 20 లక్షల షేర్లను రూ. 400 కోట్లకు అమ్మేసింది. గ్రూప్‌నకు ఉన్న రుణభారం తగ్గించుకునేందుకు ఈ విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపింది. స్టెర్లింగ్‌, విల్సన్‌ సోలార్‌లో ఉన్న రూ. 1000 కోట్ల రుణభారం తగ్గిస్తామని స్టాక్‌ ఎక్చేంజ్‌లకు గ్రూప్‌ తెలిపింది. ఇప్పటికే ఈ రెండు కంపెనీలకు రూ. 250 కోట్లు అందించినట్లు సమాచారం. మిగిలిన మొత్తం డిసెంబర్‌ చివరకు అందజేయనుంది. గ్రూప్‌ నెత్తిన మొత్తం రూ. 30 వేల కోట్ల రుణభారం ఉంది. దీన్ని తగ్గించుకునేందుకు వివిధ విక్రయాలను ఎస్‌పీ గ్రూప్‌ చేపట్టింది. భారీగా కంపెనీ షేర్లను విక్రయించడంతో గురువారం టీసీఎస్‌షేరు దాదాపు ఒకటిన్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. టాటాసన్స్‌లో ఎస్‌పీ గ్రూప్‌నకు ఉన్న 18.38 శాతం వాటా కింద 73.45 లక్షల టీసీఎస్‌ షేర్లున్నాయి. తాజాగా షాపూర్జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఇక్రా ఏఏ- నుంచి ఏ ప్లస్‌కు డౌన్‌గ్రేడ్‌ చేసింది. 



You may be interested

పరిమిత లాభాల్లో ముగిసిన ఏడీఆర్‌లు

Saturday 14th December 2019

అమెరికాలో ట్రేడయ్యే భారత ఏడీఆర్‌లు శుక్రవారం పరిమిత లాబాల్ని కూడగట్టుకున్నాయి. ఒక్క డాక్టర్‌ రెడ్డీస్‌ తప్ప మిగిలిన అన్ని ఏడీఆర్‌లు 1శాతం నుంచి 0.10శాతం వరకు పెరిగాయి. అమెరికా చైనాల మధ్య డీల్‌ ఒప్పందం కుదిరినట్లు ట్రంప్‌ ప్రకటనతో మెటల్‌ రంగానికి వేదాంత ఏడీఆర్‌ 1.20శాతం పెరిగింది. అక్కడి మార్కెట్లో టెక్నాలజీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించిన కారణంగా  విప్రో ఏడీఆర్‌ 0.82శాతం, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు 0.50శాతం లాభపడ్డాయి.

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 14th December 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ ఫ్యూచర్స్ సూచీ ముగింపు(12142.35)తో పోలిస్తే 6డాలర్లు స్వల్ప లాభంతో 12,149 వద్ద స్థిరపడింది. నిఫ్టీ ఫ్యూచర్‌ 122 పాయింట్లు లాభపడ్డప్పటికీ.., రాత్రి అమెరికా సూచీల ఫ్లాట్‌ ముగింపు కారణంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ సూచీ సైతం అదే ట్రెండ్‌ను అవలంభించింది. అంతర్జాతీయంగా, దేశీయంగా గానీ నేడు, రేపు ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోకపోతే సోమవారం నిఫ్టీ సూచీ

Most from this category