News


ఎస్‌పీ అపారెల్స్‌, కేఈఐ.. జూమ్‌

Friday 24th January 2020
Markets_main1579852498.png-31168

వరుసగా రెండో రోజు సానుకూలంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా కదులుతున్నాయి. మధ్యాహ్నం 1 ప్రాంతం‍లో సెన్సెక్స్‌ 141 పాయింట్లు పెరిగి 41,528ను తాకగా.. నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 12,231 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో రిటైల్‌ విభాగాన్ని విక్రయించే ప్రణాళికలు ప్రకటించడంతో ఎస్‌పీ అపారెల్స్‌ కౌంటర్‌ జోరందుకోగా.. నిధుల సమీకరణ వివరాలు వెల్లడించడంతో కేఈఐ ఇండస్ట్రీస్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఎస్‌పీ అపారెల్స్‌ 
రిటైల్‌ విభాగాన్ని విక్రయించే ప్రతిపాదనకు బోర్డు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు ఎస్‌పీ అపారెల్స్‌ లిమిటెడ్‌ తాజాగా వెల్లడించింది. దీంతో ఎస్‌పీ రిటైల్‌ బ్రాండ్స్‌కు స్లంప్‌ సేల్‌ ప్రాతిపదికన విక్రయించనున్నట్లు తెలియజేసింది. డీల్‌ మొత్తం విలువ రూ. 81 కోట్లుకాగా.. ఎస్‌పీ రిటైల్‌ బ్రాండ్స్‌ కొంతమేర నగదును చెల్లించనున్నట్లు తెలియజేసింది. మిగిలిన మొత్తానికి తప్పనిసరిగా మార్పిడి చేసుకునే ఎస్‌పీ రిటైల్‌ బ్రాండ్స్‌ ప్రిఫరెన్స్‌ షేర్లను కేటాయించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎప్‌సీ అపారెల్స్‌ షేరు 4.5 శాతం జంప్‌చేసి రూ. 211 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 216 వరకూ ఎగసింది. దుస్తుల తయారీ కంపెనీ ఎస్‌పీ అపారెల్స్‌లో ప్రమోటర్లకు 61.63% వాటా ఉంది.

కేఈఐ ఇండస్ట్రీస్‌
ఎలక్ట్రిక్‌ కేబుళ్ల కంపెనీ కేఈఐ ఇండస్ట్రీస్‌.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ద్వారా రూ. 500 కోట్లను సమీకరించే వీలున్నట్లు తెలియజేసింది. గురువారం ప్రారంభమైన క్విప్‌ ఇష్యూలో భాగంగా షేరుకి రూ. 518.14 ధరను నిర్ణయించింది. నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలకు వినియోగించనున్నట్లు పేర్కొంది. క్విప్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో కేఈఐ ఇండస్ట్రీస్‌ షేరు 3.25 శాతం పురోగమించి రూ. 541 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 548 వరకూ ఎగసింది. కాగా.. ఇటీవల క్యూ3 ఫలితాలు ప్రకటించిన కంపెనీ పూర్తి ఏడాదికి(2019-20) ఆదాయ అంచనాల(గైడెన్స్‌)ను 18-19 శాతానికి పెంచిన విషయం విదితమే. అంతక్రితం 17-18 శాతం వృద్ధిని అంచనా వేసింది.



You may be interested

జవనరి 30 నుంచి సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ ఏడో ఇష్యూ..!

Friday 24th January 2020

రూ.10వేల కోట్ల సమీకరణ యోచనలో కేంద్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల(సీపీఎస్‌ఈ) ఈటీఎఫ్‌ ఏడో విడుత ఇష్యూ ఈ నెలాఖరున ప్రారంభం కాబోతుంది. తద్వారా కేంద్రం రూ.10వేల కోట్లను సమీకరించాలని భావిస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరుసార్లు సీపీఎస్‌ఈ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) ఇష్యూకు జారీ చేసింది. ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించడంతో కేంద్రం మరో విడత సీపీఎస్‌ఈ ఈటీఎఫ్‌ను జారీచేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు మార్కెట్‌

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం అప్‌!

Friday 24th January 2020

ఉదయం నష్టాల్లో ప్రారంభమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం మధ్యాహ్నం కల్లా మళ్లీ లాభాల్లోకి రావడమే కాకుండా 1 శాతం జంప్‌చేసింది. నేటి ఉదయం 46 పాయింట్ల నష్టంతో 31వేల దిగువున 30,974 వద్ద ప్రారంభమైన సంగతి తెలిసిందే. మధ్యాహ్న సెషన్‌లో ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో12:15 గంటలకు మునుపటి ముగింపు (31,004.05)తో పోలిస్తే 1శాతం(296 పాయింట్లు) లాభంతో 31,299.90 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో అత్యధికంగా

Most from this category