News


హిృతిక్‌ స్టాక్స్‌ నుంచి మిడ్‌క్యాప్స్‌లోకి..

Tuesday 5th November 2019
Markets_main1572892335.png-29341

హిృతిక్‌ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులు మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోకి మళ్లొచ్చని అంచనా వేస్తున్నట్టు ఇండియానివేష్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ వినయ్‌ పండిట్‌ తెలిపారు. మార్కెట్లకు సంబంధించి తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో ఆయన పంచుకున్నారు. 

 

దీపావళికి నిఫ్టీ నూతన గరిష్టాలను తాకొచ్చన్న తమ అంచనాలకు అనుగుణంగానే మార్కెట్లు ర్యాలీ చేస్తున్నట్టు పండిట్‌ పేర్కొన్నారు. లార్జ్‌క్యాప్‌ కంపెనీల ఎర్నింగ్స్‌లో 15-18 శాతం వృద్ధి ఉందని, మార్కెట్‌ వ్యాప్త ర్యాలీకి ఇది ప్రేరణనిస్తుందన్నారు. మొదటి త్రైమాసికంలో అధిక పన్ను కేటాయింపులతో రెండో త్రైమాసికంలో పన్ను కేటాయింపులు తక్కువగా ఉన్నాయని చెప్పారు. గతేడాది రెండో త్రైమాసికంలో తక్కువ బేస్‌ (ముఖ్యంగా ఆటో విక్రయాల్లో) ఉండడం కూడా ఒక సానుకూలమన్నారు. నిఫ్టీ గరిష్టాలను చేరడం పూర్తయిందని తాము భావించడం లేదన్నారు. అయితే, కొన్ని ప్రధాన స్టాక్స్‌ మాత్రం గరిష్టాలను చేరాయన్నారు. ఈ నేపథ్యంలో హిృతిక్‌ స్టాక్స్‌ (హెచ్‌డీఎఫ్‌సీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు) నుంచి మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లోకి పెట్టుబడులు వెళతాయని అంచనా వేస్తున్నట్టు పండిట్‌ చెప్పారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌ నిఫ్టీలో చేరేందుకు పోటీలో ఉన్నట్టు పేర్కొన్నారు. యస్‌ బ్యాంకు, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌ స్థానంలో ఇవి నిఫ్టీలోకి ప్రవేశించొచ్చని అంచనా వేశారు. 

 

ఆటోమొబైల్‌ రంగం గురించి మాట్లాడుతూ.. అక్టోబర్‌ నెల విక్రయాలు ఉత్సాహకరంగా ఉన్నాయన్నారు. మారుతి సుజుకీ ఇప్పటికీ 30పీఈ రేషియోలో ఉందన్నారు. అయితే, చారిత్రకంగా చూస్తే మార్జిన్లు కనిష్ట స్థాయిలో ఉండడం, కనిష్ట ఆర్‌వోఈ నేపథ్యంలో ఈ స్టాక్‌ రూ.7,500-7,700ను అధిగమించిన ప్రతీసారీ లాభాల స్వీకరణకు అవకాశంగా పండిట్‌ తెలిపారు. ఈ స్టాక్‌కు సెల్‌ రేటింగ్‌ ఇచ్చామని, టార్గెట్‌ ధరగా రూ.5,700ను పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల అమ్మకాల పరంగా టీవీఎస్‌ గణాంకాలు నిరుత్సాహపరిచాయని అన్నారు. హీరో మోటార్స్‌, బజాజ్‌ ఆటో సానుకూల గణాంకాలతో ఆశ్చర్యపరచొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ రంగం జూలై-ఆగస్ట్‌ మధ్య బోటమ్‌అవుట్‌ అయిందన్నారు. టీవీఎస్‌ మోటార్‌, హీరో మోటో, బజాజ్‌ ఆటో నుంచి సానుకూల పనితీరు ఆశించొచ్చని అంచనా వేశారు. ఆటో (ద్విచక్ర వాహనాలు), ఆటో యాన్సిలరీ, బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ సమస్యలకు పరిష్కారాలు, రక్షణ రంగ ఆర్డర్లు, రిటైల్‌ విక్రయాలు పుంజుకోవడం, దేశీయ ఫార్మా కంపెనీల బలమైన ప్రదర్శన బుల్స్‌కు సానుకూలంగా పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్‌, టెలికం, ప్యాసింజర్‌ వాహనాలు, క్యాపిటల్‌ గూడ్స్‌, రియల్‌ ఎస్టేట్‌లో బేర్స్‌ ప్రభావం ఉంటుందన్నారు. మొత్తం మీద మార్కెట్‌ గమనం సానుకూలంగా ఉందన్నారు. గత 10-15 రోజుల్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడుల, మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక కొనసాగుతుండడం దీర్ఘకాలంలో మార్కెట్‌కు సానుకూలంగా పేర్కొన్నారు. You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ లాభం రూ.10,749 కోట్లు

Tuesday 5th November 2019

(అప్‌డేటెడ్‌) 76 శాతం వృద్ధి  186 రెట్లు పెరిగిన డివిడెండ్‌ ఆదాయం  16 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం  న్యూఢిల్లీ: భారత్‌లో అతి పెద్ద నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.10,749 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం, రూ.6,097 కోట్లుతో పోల్చితే 76 శాతం వృద్ధి సాధించామని హెచ్‌డీఎఫ్‌సీ తెలిపింది. గృహ్‌ ఫైనాన్స్‌లో

మెటల్‌ స్టాక్స్‌పై బుల్స్‌ పట్టు!

Monday 4th November 2019

నిఫ్టీ మెటల్‌ సూచీ గరిష్ట స్థాయిని చేరొచ్చని, గత గరిష్ట స్థాయి రూ.2,576ను అధిగమించొచ్చని కోటక్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వీపీ శ్రీకాంత్‌ చౌహాన్‌ అంచనా వేశారు. ‘‘ఆటో సూచీ మార్గంలోనే మెటల్‌ సూచీ కూడా కొనసాగుతుంటుంది. 2018లో గరిష్ట ‍స్థాయి నుంచి ఆటో ఇండెక్స్‌ 50 శాతం పడిపోయింది. అలాగే మెటల్‌ ఇండెక్స్‌ 4,200 నుంచి 2,100 స్థాయికి 50 శాతం పడిపోయింది. ఇటీవలి కనిష్ట స్థాయి

Most from this category