News


బడ్జెట్‌ ముందు ఈ స్టాక్‌లను పరిశీలించవచ్చు: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీష్‌

Saturday 29th June 2019
Markets_main1561785905.png-26682

  • ఆకర్షిస్తున్నా స్మాల్‌ అండ్‌ మిడ్‌ క్యాప్‌
  • బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ ఉంది

సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ ఉందని, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ల వాల్యుషన్లు ఆకర్షిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ పీసీజీ అండ్‌ క్యాపిటల్‌ మార్కెట్‌ స్ట్రాటజీ హెడ్‌ వీకే శర్మ ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే...

వాస్తవిక అంచనాలు..
మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చాక తీసుకొస్తున్నా మొదటి బడ్జెట్‌ కావడంతో దీనిపై అందరూ దృష్ఠి సారిస్తున్నారు.  మాకైతే జీఎస్‌టీ అమలులోకి వచ్చాక ప్రతి జీఎస్‌టీ కౌన్సిల్‌ మీటింగ్‌ ఒక చిన్న పాటి బడ్జెట్‌లా అనిపించేది అందువలన బడ్జెట్‌కు సంబంధించిన ప్రాముఖ్యత తగ్గింది. కానీ అంతర్జాతీయ అభివృద్ధితో పాటు మనం కూడా వృద్ధి  చెందాలంటే వాణిజ్య పాలసీల తయారి అనేది నిరంతరం కొనసాగాలి. జూలై 5న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై మాకు కొన్ని వాస్తవిక అంచానాలున్నాయి.  అవి 
1) తాత్కాలిక బడ్జెట్‌లో తీసుకొచ్చిన ద్రవ్యలోటు 3.4 శాతాన్ని ఆర్థిక మంత్రి మార్చకపోవచ్చు
2)అటల్‌ బిహారి వాజ్‌పేయి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలలోని పెట్టుబడుల ఉపసంహరణను అనుకరించవచ్చు.
3)ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ప్రభుత్వ ఖర్చులను పెంచవచ్చు.

పీఎస్‌యూల రీక్యాపిటలైజేషన్‌..
    గత మూడు త్రైమాసికాల నుంచి మందగమనంలో ఉన్న ఆర్ధిక వ్యవస్థలో ద్రవ్యలోటును 3.4 శాతానికి పరిమితం చేయనుండడం ఊహించలేనిదే. కానీ ఈ విషయాన్ని బలంగా నమ్మడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి ఆర్బీఐ నుంచి డివిడెండ్‌లు లేదా ఇతర రూపేణ ఇన్‌ఫ్లోలు పెద్ద మొత్తంలో ఉండడం. రెండవది వ్యూహాత్మకంగా ప్రభుత్వరంగ సంస్థలలోని వాటాలను విక్రయించడం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణం చేయడం, వీటికి మూలధనాన్ని అందించడం రెండు కూడా జరిగే అవకాశం ఉంది. బ్యాంకుల నుంచే వచ్చే నగదును రీ క్యాపిటలైజేషన్‌కు వినియోగించి తద్వారా ప్రభుత్వ బ్యాంకుల రుణ సామర్ధ్యం పెంచవచ్చు. అంతేకాకుండా వ్యాపారాలకు  ఉద్దీపనులు అందించే అవకాశం ఉం‍టుంది. కానీ ఈ ప్రభుత్వ రంగం బ్యాంకులకు మూలధనాన్ని అందించడంతో పాటు బ్యాంకుల నిర్వహణ, వ్యవస్థలను బలపరచాలి. లేకుంటే ఈ కొత్త రుణాలు కూడా మొండి బకాయిలుగా మారే అవకాశం ఉంటుంది. 
      ప్రభుత్వ బీఈఎమ్‌ఎల్‌ వంటి ప్రభుత్వరంగ సంస్థలలోని పెట్టుబడులను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నప్పటికి ఆర్బీఐ నుంచి మిగులు నగదు అందే అవకాశం ఉంది కాబట్టి నగదు ఉపసంహరణ పక్రియ లక్ష్యాన్ని ఈ ఏడాది అంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోకపోవచ్చు. 

ప్రభుత్వం మౌలిక మంత్రం..
కొన్ని మౌలిక రంగ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం బాండ్లును విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రైవేటు పెట్టుబడులు పెంచడానికి రాయితీలను ప్రకటించవచ్చు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది కాబట్టి ఎకానమీ పరుగులు పెట్టాలంటే బ్యాంకులు సమకూర్చుకున్న మూలధనంతో మరల రుణాలు ఇవ్వడం మొదలు పెట్టాలి. 

ఈ స్టాక్‌లు ఓకే..
ఎక్కడ విజిబులిటీ ఉంటుందో అక్కడికి నగదు ప్రవహాం కనిపిస్తుంది. మన చరిత్ర కూడా అదే చెబుతోంది. సమీప భవిష్యత్తులో బ్యాంకింగ్‌ సెక్టార్‌లో విజిబులిటీ కనిపిస్తోంది. అందుకే ఈ రంగంలో పెట్టుబడులు పెరిగాయి. మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ల వైపు కూడా  నగదు ప్రవాహాం ఉంది. ​కానీ అక్కడ నగదు ప్రవాహాం ఆకర్షిణియమైన వాల్యుషన్‌ల వలన జరుగుతోంది కాని విజుబిలిటీ వలన కాకపోవడం గమనార్హం. మరికొంత కాలంలో మిడ్‌, స్మాల్‌క్యాప్‌లు పెట్టుబడిదారులను  ఆకర్షిస్తాయి. 

ఆ మూడు బ్యాంకుల భవిష్యత్తు బాగుంది!
  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు ముందు ముందు మంచి రోజులున్నాయి. రైట్‌ ఆఫ్‌లు చేసిన నగదు రైట్‌ బ్యాక్‌ కావడంతో  పాటు ఆర్థిక వ్యవస్థను పభుత్వం ముందుండి నడిపించడంతో వీటి భవిష్యత్తు బాగుంది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం వచ్చాక మౌలిక రంగ అభివృద్ధిపై ఎక్కువగా దృష్ఠి పెట్టే అవకాశం ఉంది. కనుక ఎల్‌ అండ్‌ టీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఈ రంగం‍లో  వృద్ధి చెందవచ్చు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు అధిక వినియోగ సామర్ధ్యం ఉండడం వలన అధిక సంపాదనకు వీలుంది. రక్షణ-మౌలిక రంగంలో బీఈఎమ్‌ఎల్‌ స్టాక్‌ను పరిగణించవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో ఇది ముందుంది కూడా.

 You may be interested

11850పై ఎస్‌జీఎక్స్‌ ముగింపు

Saturday 29th June 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం 11850పై ముగిసింది. సింగపూర్‌ మార్కెట్లో నిన్న రాత్రి 16.50 పాయిం‍ట్ల లాభంతో 11,854.50 వద్ద ముగిసింది. నేడు జీ-20 సదస్సులో అమెరికా- చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలమవుతాయనే ఆశావహనంతో నిన్న యూరప్‌ మార్కెట్లతో అమెరికా మార్కెట్లు సైతం లాభంతో ముగిశాయి. అమెరికాలోని ప్రధాన ఇండెక్స్‌ నాస్‌డాక్‌ 39 పాయింట్లు లాభపడి 8000 స్థాయిపై 8,006.24 వద్ద, డౌజోన్స్‌

టాటా మోటార్స్‌కు భాగస్వామి కావాలి

Saturday 29th June 2019

టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్య న్యూఢిల్లీ: భవిష్యత్‌ వృద్ధి కోసం టాటా మోటార్స్‌కు నూతన భాగస్వామి అవసరం ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ వ్యాఖ్యానించారు. 2018-19 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో... ఆయన వాటాదారులకు పలు వ్యూహాలను తెలియజేశారు. ‘‘జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) గడిచిన ఏడాదికాలం నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే, వ్యయాలను తగ్గించడానికి కంపెనీకి చెందిన బ్రిటిష్ శాఖ తగిన చర్యలు తీసుకుంటోంది.

Most from this category