News


యస్‌ బ్యాంకుకు స్మార్ట్‌ ఇన్వెస్టర్లు నో!

Wednesday 17th July 2019
Markets_main1563386323.png-27134

ప్రైవేటు రంగ యస్‌ బ్యాంకుపై స్మార్ట్‌ ఇన్వెస్టర్లకు (విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ), మ్యూచువల్‌ ఫండ్స్‌ తదితర) నమ్మకం సన్నగిల్లుతోంది. బ్యాంకు పనితీరు నూతన సీఈవో రవనీత్‌ గిల్‌ సారథ్యంలో కుదుపులకు గురి అవుతుండడంతో వీరు దూరమవుతున్నట్టు తెలుస్తోంది. గడచిన ఏడాది కాలంలో యస్‌ బ్యాంకు షేరు ఇన్వెస్టర్ల పెట్టుబడులను నాలుగింట మూడొంతులు తుడిచిపెట్టేసింది. రూ.404 స్థాయి నుంచి ఈ షేరు రూ.85.70 స్థాయి వరకు పడిపోగా, ప్రస్తుతం రూ.98.45 వద్ద ఉంది. ఒకవైపు పెట్టిన పెట్టుబడి విలువ దారుణంగా పడిపోవడం, బ్యాంకు ఫలితాలు దారుణంగా ఉండడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపుతున్నారు. 

 

యస్‌ బ్యాంకు తన చరిత్రలో తొలిసారిగా 2019 జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.1,506 కోట్ల నష్టాన్ని ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ సీఈవో, ఎండీగా తప్పుకున్న తర్వాత నూతన సీఈవో రవనీత్‌ గిల్‌ ఆధ్వర్యంలో ప్రకటించిన తొలి ఫలితాలు మార్చి త్రైమాసికానివే. దీంతో రికవరీ అవుతున్న స్టాక్‌ కాస్తా రివర్స్‌ డైరెక్షన్‌ తీసుకుని భారీగా నష్టపోయింది. తాజా త్రైమాసికంలోనూ బ్యాంకు కేవలం రూ.96 కోట్ల లాభాన్నే నమోదు చేయడం రానున్న రోజుల్లో ఈ స్టాక్‌పై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బ్యాంకు తాజా ఫలితాల పట్ల ఇప్పటికీ కొందరు విశ్లేషకులు సానుకూలంగా లేరు. కొందరు మాత్రం సానుకూలంగా ఉన్న పరిస్థితి. జూన్‌ త్రైమాసికంలో బ్యాంకు లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,260 కోట్ల నుంచి 92 శాతం తగ్గడం, ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోవడం గమనార్హం.

 

జూన్‌ త్రైమాసికం చివరికి యస్‌ బ్యాంకు వాటాదారుల గణాంకాలను పరిశీలిస్తే... మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల వాటా 6.59 శాతానికి తగ్గింది. మార్చి త్రైమాసికం చివరికి మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలకు బ్యాంకులో 9.54 శాతం వాటా ఉంది. ఇక మార్చి క్వార్టర్‌ నాటికి ఎఫ్‌పీఐలకు 40.33 శాతం వాటా ఉండగా, జూన్‌ చివరికి 33.69 శాతానికి తగ్గిపోయింది. ఇక దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీకి మాత్రం బ్యాంకులో ఉన్న వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఎల్‌ఐసీకి 8.87 శాతం వాటా ఉంది. ఇక జూన్‌ క్వార్టర్‌లో యస్‌ బ్యాంకులో రిటైల్‌ ఇన్వెస్టర్ల వాటా పెరగడం గమనార్హం. షేరు ధర బాగా పడిపోవడంతో వారు కొనుగోళ్లకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల వరకు విలువైన వాటాదారులు మార్చి క్వార్టర్‌లో 11.13 శాతం కాగా, జూన్‌లో 18.72 శాతానికి చేరారు. అదే రూ.2 లక్షలకుపైగా వాటాలున్న వారు మాత్రం 2.83 శాతం నుంచి 1.74 శాతానికి తగ్గారు. 


 You may be interested

నెగిటివ్‌ ఓపెనింగ్‌

Thursday 18th July 2019

ప్రపంచ మార్కెట్ల ప్రతికూలతల కారణంగా గురువారం భారత్‌ సూచీలు స్వల్పనష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 11 పాయింట్ల నష్టంతో 39,204 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల నష్టంతో 11,675 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. క్రితం రోజు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన విప్రో ట్రేడింగ్‌ ప్రారంభంలో 2.5 శాతం గ్యాప్‌అప్‌తో ప్రారంభంకాగా, యస్‌బ్యాంక్‌ 9 శాతం పతనమయ్యింది. 

విలువల రీత్యా ఐటీ షేర్లు బాగున్నాయి: హేమంగ్‌ జాని

Wednesday 17th July 2019

ఫార్మా రంగంపై పూర్తి పాజిటివ్‌గా ఉండొద్దు ఎఫ్‌ఎంసీజీలో వచ్చే 2-3 నెలల్లో  ఎటువంటి అప్‌మూవ్‌ లేదు ప్రస్తుతం పరిస్థితుల్లో కొన్ని కార్పోరేట్‌ బ్యాంక్‌లు, సిమెంట్‌, కొన్ని దేశియ నిర్మాణ కంపెనీలు, కొన్ని ఫార్మా కంపెనీలను పరిశీలించడం మంచిదని షేర్‌ఖాన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హేమంగ్‌ జాని ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే....... ఐటీ బాగుం‍ది... త్రైమాసిక ఫలితాలు విడుదలయ్యాక  ఇన్ఫోసిస్‌ షేర్లు సానుకూలంగా స్పందించాయి.  యాక్సెంచర్ వంటి కొన్ని

Most from this category