News


ఈ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకూ నష్టాలు..!

Monday 17th June 2019
Markets_main1560794719.png-26359

చిన్న ఇన్వెస్టర్లు... ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, అమ్మకాల డేటాను పరిశీలించి, పెట్టుబడుల నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే, స్టాక్‌ మార్కెట్లో గుడ్డిగా ఎవరినీ అనుసరించారదన్నది నిపుణులు చెప్పేమాట. ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నామంటే అందుకు తగిన కారణాలు ఉండాలి. అవి భావోద్వేగాలు, ఆకర్షణలకు అతీతంగా పూర్తిగా ఫండమెంటల్స్‌ ఆధారంగానే ఉండాలి. ఇన్వెస్టింగ్‌లో సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లను అనుసరించే వారికి కొన్ని స్టాక్స్‌ విషయంలో చేదు ఫలితాలే ఎదురయ్యాయి. ఎందుకంటే మ్యూచువల్‌ ఫండ్స్‌, బీమా కంపెనీలు, విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన కొన్ని షేర్లలో కొన్ని గత కొంత కాలంలో తీవ్రంగా పతనమయ్యాయి. వీటి రేటింగ్‌లను క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు డౌన్‌గ్రేడ్‌ చేశాయి. 

 

మార్కెట్‌ గణాంకాలను పరిశీలిస్తే ఎన్‌ఎస్‌ఈలో 142 కంపెనీల్లో 35 శాతం అంతకంటే అధిక వాటాలు ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు, మనీ మేనేజర్లకు వాటాలున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో 80 స్టాక్స్‌ ఈ ఏడాది ఇప్పటి వరకు 80 శాతం వరకు ఇన్వెస్టర్ల సంపదను కరిగించేశాయి. వీటిల్లో యస్‌ బ్యాంకు, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇలా ఇన్వెస్టర్ల సంపదను హరించేసిన స్టాక్స్‌ జాబితాలో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా (80 శాతం), మెక్లాయిడ్‌ రసెల్‌(80శాతం), ప్రోవోగ్‌ ఇండియా (71శాతం), జైకామ్‌ ఎలక్ట్రానిక్స్‌ (71శాతం), మన్‌పసంద్‌ బెవరేజెస్‌ (61శాతం), బిర్లా సాఫ్ట్‌ (58శాతం), బల్లార్‌పూర్‌ ఇండస్ట్రీస్‌ (57శాతం), కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ (55శాతం), జైన్‌ ఇరిగేషన్‌ (44శాతం), పటేల్‌ ఇంజనీరింగ్‌ (41శాతం), యస్‌ బ్యాంకు (36శాతం), కేఎస్‌ఎస్‌ (33శాతం), శ్రీరామ్‌ ఈపీసీ (33శాతం), సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ (30 శాతం) ఉన్నాయి. ఇంకా, ఐవీఆర్‌సీఎల్‌, తమిళనాడు న్యూస్‌ప్రింట్‌, పీటీసీ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌,  మెక్‌డొవెల్‌ హోల్డింగ్స్‌ తదితర కంపెనీలు సైతం ఎంతో కొంత నష్టపోయినవే. ఇదే కాలంలో ప్రధాన సూచీలు నికరంగా లాభాల్లో ఉండడం గమనార్హం. 

 

‘‘కార్పొరేట్‌ పరిపాలనా అంశాలు, నిధుల దుర్వినియోగం వంటి అంశాలతో పడిపోయిన స్టాక్స్‌ తిరిగి కోలుకోలేవు. ఈ తరహా కంపెనీల నుంచి పూర్తిగా బయటపడి మంచి కంపెనీల్లో పొజిషన్‌ తీసుకోవాలన్నది నా సూచన’’ అని స్టివార్ట్‌ అండ్‌ మ్యాక్‌రిచ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ అజయ్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. ‘‘ఇనిస్టిట్యూషన్స్‌కు వాటాలున్నంత మాత్రాన అది మంచి కంపెనీ అని చెప్పలేం. ఓ స్టాక్‌ను కొనుగోలు చేసేందుకు చూసే వాటిల్లో ఇది కేవలం ఒక అంశమే. ఎందుకంటే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టే ముందు తగినంత పరిశోధన చేసి పెడతారన్న నమ్మకం వల్లే’’అని ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఏకే ప్రభాకర్‌ తెలిపారు. యస్‌ బ్యాంకు, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విషయంలో ఏకే ప్రభాకర్‌ ఇన్వెస్టర్లను హెచ్చరించారు. ‘‘జీకి మంచి వ్యాపారం ఉంది. కానీ, ప్రమోటర్లు సమస్యను ఎదుర్కొంటున్నారు. మంచి కొనుగోలుదారులు ముందుకు రాకపోతే ఈ కౌంటర్‌ విషయంలో ఆసక్తి చూపించడానికి ఏమీ లేదు. యస్‌ బ్యాంకు విషయంలో కొత్త యాజమాన్యం పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుత సమస్య సమీప కాలంలో తొలగిపోయేది కాదు. యస్‌ బ్యాంకు స్టాక్‌ కొనుగోలుకు కావాల్సినంత సమయం ఉంది’’ అని ప్రభాకర్‌ తెలియజేశారు. ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు వాటాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసే ముందు తమ వంతుగా అధ్యయనం చేయాలని అజయ్‌ జైస్వాల్‌ సూచించారు.You may be interested

పదేళ్ల కోసం పది స్టాక్స్‌

Monday 17th June 2019

ఈ రోజు చెట్టు నీడలో సేద తీరుతున్నారంటే ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో ఒకరు ఆ చెట్టును నాడడం వల్లే కదా... అలాగే, పదేళ్ల క్రితమే స్టాక్స్‌ను కొనుగోలు చేసి ఉంటే, అవి మంచి వ్యాపారాలు, యాజమాన్యాల చేతుల్లో ఉన్నవి అయితే, ఈ పాటికి ఎన్నో రెట్ల ప్రతిఫలం ఇచ్చి ఉండేవి. అలాగే, మరో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం దృష్టితో ఇప్పుడే పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఎకనమిక్స్‌

11780 పైన క్లోజయితేనే అప్‌మూవ్‌కు అవకాశం

Monday 17th June 2019

నిఫ్టీపై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా గతవారమంతా 11800- 12000 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన నిఫ్టీ ఈ వారం ఆరంభంలో ఈ రేంజ్‌ నుంచి బ్రేక్‌డౌన్‌ చూపింది. సోమవారం కీలక 11800 పాయింట్లను కోల్పోయి 11672 పాయింట్ల వద్ద క్లోజయింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 11770 పాయింట్లను కోల్పోయినందున స్వల్పకాలిక డౌన్‌ట్రెండ్‌ ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ 11780 పాయింట్ల పైన బలంగా క్లోజయితేనే తిరిగి 12050 పాయింట్లను చేరవచ్చని నార్నోలియా

Most from this category