News


స్మాల్‌క్యాప్స్‌ హవా...: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌

Friday 7th June 2019
Markets_main1559931754.png-26165

వచ్చే ఏడాది, రెండేళ్ల కాలంలో మిడ్‌క్యాప్‌, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే స్మాల్‌క్యాప్‌ అద్భుత పనితీరు చూపిస్తాయని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ నవీన్‌ కులకర్ణి తెలిపారు. మార్కెట్లలో అస్థిరతలు తగ్గుముఖం పడుతున్నాయని, ఇది స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌కు చాలా మంచిదన్నారు. ద్రవ్య లభ్యత సవాళ్లను పరిష్కరించడం కీలకమైన ప్రాధాన్య అంశంగా నవీన్‌ పేర్కొన్నారు. ఆర్‌బీఐ, ప్రభుత్వం దీన్ని పరిష్కరించగలవన్నారు. అతిపెద్ద సంస్కరణలు అన్నవి పెద్ద సవాలుగా అభివర్ణించారు. 

 

భూముల సమీకరణ, కార్మిక సంస్కరణలు లేదా వ్యవసాయ రంగంలో సంస్కరణలు అన్నవి కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాళ్లుగా నవీన్‌ కులకర్ణి పేర్కొన్నారు. నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో కార్మిక సంస్కరణలు చేపట్టడం అన్నది రాజకీయంగా, ఆర్థికంగా సవాళ్లను తెచ్చిపెడుతుందన్నారు. అయితే, ఈ సంస్కరణలు అన్నవి ఎంతో ముఖ్యమైనవని,  వీటి సమర్థత అన్నది కూడా సవాలు అవుతుందదని, ప్రయోజనాలు దీర్ఘకాలంలోనే కనిపిస్తాయని అభిప్రాయపడ్డారు. ఎన్‌డీఏ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెట్టిందని, గతంతో పోలిస్తే 2019-2024 కాలంలోనూ ప్రాధాన్యంలో మార్పు ఉండకపోవచ్చని నవీన్‌ కులకర్ణి అభిప్రాయపడ్డారు. ఇన్‌ఫ్రాపై అధిక వెయిటేజీతో ఉన్నామని, సిమెంట్‌ తదితర ఇన్‌ఫ్రా ఆధారిత రంగాల్లో ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పారు. 

 

ఆటోమొబైల్‌ రంగంలో విలువ వృద్ధి పెరుగుతోందని, అయితే బీఎస్‌-6 అమలు కారణంగా గణనీయంగా వ్యయాల పెరుగుదల సవాళ్లు ఎదురుకానున్నాయని నవీన్‌ అన్నారు. దీంతో ఆటోమొబైల్‌ రంగ స్టాక్స్‌ను జోడించే విషయంలో కొంత జాగ్రత్త పాటిస్తున్నట్టు చెప్పారు. ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ వ్యాల్యూషన్‌ చాలా అధిక స్థాయికి చేరిందన్నారు. హెచ్‌యూఎల్‌ మాత్రం మంచి పనితీరును చూపుతోందన్నారు. అధికంగా డివిడెండ్‌ చెల్లించే స్టాక్స్‌ ట్రాక్‌ రికార్డు మిశ్రమంగా ఉందని, వీటిల్లో ఎక్కువ కంపెనీలు ప్రభుత్వ రంగానివేనన్నారు. క్యాపిటల్‌ అలోకేషన్‌ పరంగా వీటికి మంచి ట్రాక్‌ రికార్డు లేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీని పోర్ట్‌ఫోలియోకు యాడ్‌ చేసుకోవచ్చని సూచించారు. You may be interested

నిప్పన్‌ చేతికి ఆర్‌నామ్‌... ఇన్వెస్టర్లకు లాభమేనా?

Friday 7th June 2019

రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ (రిలయన్స్‌మ్యూచువల్‌ ఫండ్స్‌)లో నియంత్రిత వాటాను రిలయన్స్‌ క్యాపిటల్‌ నుంచి జపాన్‌కు చెందిన నిప్పన్‌ లైఫ్‌ కొనుగోలు చేయబోతోంది. మరి ఆర్‌నామ్‌ మ్యూచువల్‌ ఫం‍డ్స్‌ ఇన్వెస్టర్లకు, కంపెనీ వాటాదారులకు లాభదాయకమేనా...? ఈ ప్రశ్నకు నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుందాం...   రిలయన్స్‌ నిప్పన్‌ లైఫ్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఆర్‌నామ్‌) ఆస్తుల పరంగా దేశంలోనే ఐదో అతిపెద్ద మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ. ఈ సంస్థ నిర్వహణలో ఇన్వెస్టర్లకు సంబంధించి

క్రిప్టోకరెన్సీ లావాదేవీ జరిపితే జైలుకే!?

Friday 7th June 2019

క్రిప్టోనిషేధ బిల్లు ముసాయిదా ప్రతిపాదన భారత్‌లో క్రిప్టోకరెన్సీ లావాదేవీలు జరిపితే పదేళ్లు జైలు శిక్ష విధించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్రిప్టోకరెన్సీ అమ్మినా, కొన్నా జైలుకు పంపాలని క్రిప్టోకరెన్సీ నిషేధ బిల్లు 2019 ముసాయిదా ప్రతి పేర్కొంది. ముసాయిదా ప్రకారం ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రిప్టోలను మైన్‌ చేసిన, ఉత్పత్తి చేసిన, నిల్వ ఉంచుకున, అమ్మిన, బదిలీ చేసిన, వదిలించుకున, జారీ చేసిన, ఇక ఇతర ఏ లావాదేవీ జరిపిన’వాళ్లు ఈ నిషేధ కేటగిరీలోకి

Most from this category