News


మూడు, ఐదేళ్లలో స్మాల్‌క్యాప్‌ అద్భుత రాబడులు!

Tuesday 15th October 2019
Markets_main1571079465.png-28878

ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎంపిక చేసిన కొన్ని పెద్ద కంపెనీల్లో నే ఇన్వెస్ట్‌ చేస్తుండడం భద్రత కోసం తప్పిస్తే రాబడుల కోసం కాదన్నారు కేర్‌ పీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ అమిత్‌దోషి. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

 

మీ ట్రేడింగ్‌ వ్యూహం..?
ఇన్వెస్ట్‌ చేయడమే మా వ్యూహం. దీన్నే పాటిస్తాం. ఈక్విటీ మార్కెట్ల చరిత్రను చూసినట్టయితే... మంచి వ్యాపారాలు ఈక్విటీ మార్కెట్ల కరెక్షన్‌ దశను అధిగమించి విజేతలుగా నిలుస్తాయని తెలుస్తోంది. మేం మంచి పనితీరు (పెట్టుబడులపై రిటర్నులు) చూపించడానికి కారణం కొన్ని ఎంపిక చేసిన కంపెనీల్లో తగినంత ఇన్వెస్ట్‌ చేయడం వల్లే. 

 

ఇన్వెస్టర్లకు ఏ వ్యూహం అనుసరణీయం?
మార్కెట్‌ మొత్తం కూడా సమస్యల నుంచి బయటకు వచ్చిందని చెప్పడం కష్టమే. ఎందుకంటే ఇప్పటికీ 12-15 లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ మినహాయిస్తే మిగిలిన వాటి విషయంలో విశ్వాసం లోపించింది. ఆర్థిక రంగం వైపు చూసినా కొన్ని సూక్ష్మ ఆర్థిక గణాంకాలు అంత సానుకూలంగా లేవు. దీనికితోడు కొన్ని అంతర్జాతీయ అంశాలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. కనుక తగినంత అధ్యయనం చేయకుండా ఇన్వెస్ట్‌ చేస్తే చేతులు కాల్చుకోవడమే అవుతుంది. మంచి స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను మూడు, ఐదేళ్ల కాలం కోసం కొనుగోలు చేసుకోవడానికి ఇది మంచి సమయం. 

 

రెండు మూడేళ్లలో స్మాల్‌క్యాప్‌ లార్జ్‌క్యాప్‌ మించి రాబడులను ఇస్తాయా?
ఇందులో సందేహం అక్కర్లేదు. ఒక్కసారి మార్కెట్లు కుదుటపడితే తిరిగి ఇన్వెస్టర్లలో నమ్మకం ఏర్పడుతుంది. అధిక పీఈతో కూడిన లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులు ఆకర్షణీయంగా కనిపిస్తున్న స్మాల్‌, మిడ్‌క్యాప్‌లోకి మళ్లుతాయి. కొంత కాలానికి ఇది తప్పకుండా జరుగుతుంది. 

 

సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలపై అంచనాలు?
చాలా రంగాల ఫలితాలు స్తబ్దుగా ఉంటాయి. ఆటోమొబైల్‌, యాన్సిలరీలు, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, సిమెంట్‌, మెటల్‌, ఇన్‌ఫ్రా, క్యాపిటల్‌ గూడ్స్‌, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ (ఏసీ, రియల్‌ ఎస్టేట్‌, టెక్స్‌టైల్స్‌ మినహా) ఫలితాలు ఆకర్షణీయంగా ఉండబోవు. ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, వ్యవసాయ ముడి ఉత్పత్తులు, ఐటీ, పేపర్‌, ప్యాకేజింగ్‌ మంచి ఫలితాలు ప్రదర్శిస్తాయి. 

 

2020 ఆర్థిక సంవత్సరంపై అంచనాలు?
దారుణ పరిస్థితులు ముగిసినట్టే. మంచి వర్షాలు, తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ చమురు ధరలు సానుకూలం. దీనికి తోడు కార్పొరేట్‌పన్ను తగ్గింపు, కొత్త తయారీ కంపెనీలపై 15 శాతమే పన్ను పెట్టుబడులకు దారితీస్తుంది. లిక్విడిటీ పెంపునకు ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు ద్వితీయార్ధం నుంచి తిరిగి పూర్వపు పరిస్థితులు ఏర్పడడానికి దారితీస్తాయి. You may be interested

పాజిటివ్‌ ప్రారంభం

Tuesday 15th October 2019

క్రితం రోజు నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు మంగళవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 102 పాయింట్ల లాభంతో 38,316 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 20 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,360 పాయింట్ల వద్ద ఆరంభమయ్యింది. యస్‌బ్యాంక్‌, ఐఓసీ, ఓఎన్‌జీసీ, బీపీసీఎల్‌, టీసీఎస్‌లు 1-2 శాతం మధ్య ట్రేడింగ్‌ ప్రారంభంలో పెరిగాయి. ఇన్ఫోసిస్‌, ఇన్‌ఫ్రాటెల్‌, జీ టెలి, హిందాల్కో, వేదాంత, టాటా మోటార్స్‌ షేర్లు 1-2.5 శాతం

నెలలో భారీగా నష్టపోయిన షేర్లు

Tuesday 15th October 2019

కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ ఈక్విటీ మార్కెట్లు భారీ ర్యాలీ చేశాయి. మార్కెట్లో సెంటిమెంట్‌ కూడా కుదుటపడింది. కానీ, గత నెల 20 నుంచి చూస్తే బీఎస్‌ఈ 500 సూచీలోని 121 ‍స్టాక్స్‌ నెల రోజుల్లోనే ఏకంగా 10 శాతం నుంచి 50 శాతం మధ్య నష్టపోయాయి. బాగా పడిపోయి, చౌక ధరల్లో ఉన్న

Most from this category