News


సెప్టెంబర్‌లో స్మాల్‌క్యాప్‌ అదరహో!

Tuesday 1st October 2019
Markets_main1569953005.png-28663

గత నెలలో స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేశాయనే చెప్పుకోవాలి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీగా దిద్దుబాటుకు గురై ఉండడంతో వీటిల్లో వ్యాల్యూ బయింగ్‌కు ఇన్వెస్టర్లు, ఇనిస్టిట్యూషన్స్‌ మొగ్గు చూపడం వాటిల్లో కొంత రికవరీకి తోడ్పడింది. దీనికితోడు ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్‌ పన్ను తగ్గింపు కూడా వాటి ర్యాలీకి దోహదం చేసింది. అయితే, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల ఇన్వెస్టర్లు ఇప్పటికీ అప్రమత్తంగా ఉండాలని, స్టాక్‌ వారీగా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 

 

సెప్టెంబర్‌ 27 నాటికి బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ 6.36 శాతం పెరిగింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 5.93 శాతం లాభపడింది. అదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ పెరుగుదల 4 శాతం కావడం గమనార్హం. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్‌లో ప్రకటించిన ఆదాయపన్ను సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. జూలై, ఆగస్ట్‌ మాసాల్లో ఎఫ్‌పీఐలు నికరంగా మన మార్కెట్ల నుంచి రూ.30,000 కోట్లను వెనక్కి తీసుకోగా, సెప్టెంబర్‌ 27 నాటికి మాత్రం నికరంగా రూ.7,500 కోట్ల మేర కొనుగోళ్లు చేశారు. ‘‘స్మాల్‌ క్యాప్‌ సూచీ 2018 మార్చి నుంచి బెంచ్‌ మార్క్‌ సూచీతో వెనుకబడి ఉంది. చాలా స్టాక్స్‌ వాటి దీర్ఘకాలిక సగటు ధరల కంటే తక్కువలో ట్రేడ్‌ అవుతున్నాయి. అంటే ఈ విభాగంలో సెంటిమెంట్‌ ఇప్పటికీ ప్రతికూలంగా ఉందని తెలుస్తోంది’’ అని రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌ స్ట్రాటజిస్ట్‌ అరుణ్‌ కుమార్‌ తెలిపారు. 

 

సెప్టెంబర్‌లో ర్యాలీ చేసిన స్టాక్స్‌లో సోరిల్‌ ఇన్‌ఫ్రా, ఇండియాబుల్స్‌ ఇంటెగ్రేటెడ్‌ సర్వీసెస్‌, ధంపూర్‌ షుగర్‌ మిల్స్‌, కెల్టన్‌ టెక్‌ సొల్యూషన్స్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, బీపీసీఎల్‌, రతన్‌ ఇండియా పవర్‌, రుచిరా పేపర్స్‌, ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, తాజ్‌ జీవీకే హోటల్స్‌, టైటాగఢ్‌ వ్యాగన్స్‌, సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌, వీ2రిటైల్‌, క్యాప్రి గ్లోబల్‌, స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌, గోవా కార్బన్‌, ఎవరెస్ట్‌ కాంటో సిలిండర్‌ తదితర స్టాక్స్‌ ఉన్నాయి. స్మాల్‌క్యాప్‌ సూచీ బలహీనత మరికొన్ని త్రైమాసికాల పాటు కొనసాగొచ్చని అంచనా వేశారు కుమార్‌. దీపక్‌నైట్రేట్‌, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ ల్యాబ్స్‌, టింకెన్‌ ఇండియా మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి మెరుగైన పనితీరు చూపించొచ్చన్నారు. ఇక సెప్టెంబర్‌ మాసంలో ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్‌లో తాల్వాల్కర్‌ హెల్త్‌క్లబ్స్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, డెన్‌ నెట్‌వర్క్స్‌, అలోక్‌ ఇండస్ట్రీస్‌, హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటాకామ్‌, సోమాని సిరామిక్స్‌, కాఫీడే ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌డీఐఎల్‌, సుజ్లాన్‌ ఎనర్జీ ఉన్నాయి. పండుగల సీజన్‌లో అమ్మకాలు మంచిగా సాగితే, వృద్ధి తిరిగి పుంజుకుంటుందన్న సంకేతాలు కనిపిస్తే మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌లో ర్యాలీ తిరిగి మొదలు కావచ్చన్నారు కుమార్‌. అప్పటి వరకు లార్జ్‌క్యాప్‌పైనే దృష్టి పెట్టడం మంచిదని సూచించారు.You may be interested

జీఎస్‌టీ వసూళ్లూ డౌన్‌

Wednesday 2nd October 2019

 సెప్టెంబర్‌లో రూ.91,916 కోట్లు 2018 ఇదే నెల్లో రూ.98,202 కోట్లు న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు సెప్టెంబర్‌లో పెరక్కపోగా క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఆగస్టుతో పోల్చితే ఈ మొత్తం రూ.98,202 కోట్ల నుంచి రూ.91,916 కోట్లకు తగ్గినట్లు ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.  2018 సెప్టెంబర్‌తో పోల్చి చూసినా, తాజా సమీక్షా నెల్లో వసూళ్లు తగ్గడం గమనార్హం. అప్పట్లో ఆ మొత్తం రూ.94,442 కోట్లు. అంటే వార్షికంగా

వీ షేప్‌ రికవరీకి అవకాశం లేదు..:!

Tuesday 1st October 2019

నిఫ్టీ-50కి సమీప కాలంలో 11,100 - 11,300 బలమైన మద్దతు స్థాయిలుగా నిలుస్తాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. మార్కెట్లో వీ షేప్‌ రికవరీకి (పడిన విధంగా తిరిగి రికవరీ అవడం) అవకాశం లేదన్నారు. ఆర్థిక వ్యవస్థలో దారుణ పరిస్థితులు రెండో త్రైమాసికం లేదా మూడో త్రైమాసికం (డిసెంబర్‌ నాటికి) నాటికి ముగిసిపోవచ్చన్నారు. పలు అంశాలపై ఓ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.    కార్పొరేట్‌

Most from this category