News


వాళ్లు చిన్న స్టాక్స్‌ను కొంటూనే ఉన్నారు...!

Tuesday 23rd July 2019
Markets_main1563905619.png-27260

ప్రముఖ ఇన్వెస్టర్లుగా చెప్పుకునే అనిల్‌కుమార్‌ గోయల్‌, పొరింజు వెలియాత్‌ తదితరులు మార్కెట్‌ అనిశ్చిత పరిస్థితుల్లోనూ స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లను కొనసాగిస్తున్నట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ అమ్మకాల ఒత్తిడికి గత ఏడాదిన్నరగా నష్టాల పాలవుతూనే ఉన్న విషయం గమనార్హం. గోయల్‌, పొరింజు వెలియాత్‌లు స్మాల్‌, మైక్రోక్యాప్‌ స్టాక్స్‌ కొనుగోళ్లకు ఎక్కువగా ప్రాధాన్యం చూపించే విషయం తెలిసిందే. ఆర్థిక రంగం పరుగులు తీయడం మొదలు పెడితే, లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మధ్య, చిన్న స్థాయి కంపెనీలు ఎక్కువ వృద్ధి చూపించే అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా వీరు ముందు చూపుతో షాపింగ్‌ కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. 

 

జూలై 19 నాటికి ఏస్‌ ఈక్విటీ డేటాబేస్‌ సమాచారం ప్రకారం... జూన్‌ త్రైమాసికంలో అనిల్‌కుమార్‌ గోయల్‌ నాలుగు కంపెనీల్లో తన వాటాలను పెంచుకున్నట్టు తెలుస్తోంది. అలాగే, పొరింజు వెలియాత్‌ రెండు స్టాక్స్‌లో వాటాలు పెంచుకున్నారు. అనిల్‌కుమార్‌ గోయల్‌ చక్కెర రంగ కంపెనీల్లో ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసే విషయం తెలిసిందే. అవధ్‌ షుగర్‌లో గోయల్‌కు మార్చి నాటికి 4 శాతం వాటా ఉంటే, అది జూన్‌ చివరికి 5.46 శాతానికి పెరిగింది. ద్వారికేష్‌ షుగర్‌లోనూ 4.15 శాతం నుంచి 4.27 శాతానికి వాటా పెంచుకున్నారు. అమరజ్యోతి స్పిన్నింగ్‌మిల్స్‌లో అదనంగా 4,975 షేర్లను కొనుగోలు చేశారు. అలాగే, శ్రీకాళహస్తి పైప్స్‌లో 2 శాతం వాటా కొన్నారు. శ్రీకాళహస్తి పైప్స్‌లో డీఎస్‌పీ స్మాల్‌క్యాప్‌, హెచ్‌ఎస్‌బీసీ ఇన్‌ఫ్రా ఈక్విటీ, రిలయన్స్‌ క్యాపిటల్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌కు ఒక శాతానికి పైగా వాటాలు ఉండడం గమనార్హం. 

 

ఇక అడోర్‌ ఫాంటెక్‌, ఆస్టిన్‌ ఇంజనీరింగ్‌, కాస్మో ఫిల్మ్స్‌, పనామా పెట్రోకెమ్‌, శామ్‌టెక్స్‌ ఫ్యాషన్స్‌, సంఘ్వి మూవర్స్‌, సర్లా పెర్‌ఫార్మెన్స్‌, స్టార్‌ పేపర్‌ మిల్స్‌, స్టెరిలైట్‌ టూల్స్‌, తిరుమలై కెమికల్స్‌ తదితర కంపెనీల్లో గోయల్‌ వాటాల పరంగా ఎటువంటి మార్పుల్లేవు.  ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌ను నిర్వహించే పొరింజు వెలియాత్‌ జూన్‌ త్రైమాసికంలో... సోమ్‌ డిస్టిలరీస్‌లో వాటా పెంచుకున్నారు. ఈక్యూ ఇండియా ఫండ్‌ పేరుతో జూన్‌ చివరికి 1.70 శాతం వాటా కలిగి ఉన్నారు. మార్చి చివరికి ఈ సంస్థ వాటా 1.54 శాతంతో పోలిస్తే పెరిగినట్టు తెలుస్తోంది. కేరళ ఆయుర్వేద, ఆగ్రోటెక్‌ ఫుడ్స్‌, అన్సాల్‌ బిల్డ్‌వెల్‌, ఈస్ట్రర్న్‌ ట్రెండ్స్‌లో వాటాల్లో మార్పుల్లేవు. ఎంకే గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో పొరింజు తన వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోలో భాగంగా 15,500 షేర్లను కొనుగోలు చేశారు. అయితే, ఇంకా చాలా కంపెనీలు జూన్‌ త్రైమాసికం నాటికి వాటాదారుల వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఆయా కంపెనీల్లో వీరి వాటాల వివరాలు గణాంకాల వెల్లడితోనే తెలుస్తాయి.  మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 10 శాతం వరకు నష్టపోతే, జనవరి నుంచి ఏకంగా 21 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. 



You may be interested

మిడ్‌క్యాప్స్‌ కచ్చితంగా ఎందుకు ర్యాలీ చేస్తాయంటే...?

Tuesday 23rd July 2019

నిఫ్టీ 10,000 పాయింట్లకు ఈ ఏడాది పతనం అవుతుందని తాము భావించడం లేదని ఐఐఎఫ్‌ఎల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ భాసిన్‌ తెలిపారు. స్వల్పకాలానికి కనిష్ట స్థాయి అన్నది 200డీఎంఏకు దగ్గర్లో 11,125 వద్ద ఇప్పటికే ఏర్పాటైందని తాము భావిస్తున్నట్టు చెప్పారు. మరీ పడితే 11,000 కనిష్ట స్థాయిని నమోదు చేయవచ్చన్నారు. డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల నేపథ్యంలో వచ్చే కొన్ని రోజుల్లోనే ఇది జరగొచ్చన్నారు. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌

నాలుగో రోజూ నష్టాలే...

Tuesday 23rd July 2019

38000ల దిగువ ముగిసిన సెన్సెక్స్‌  15 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ  మార్కెట్‌కు నష్టాల కష్టాలు ఆగేలా లేవు. వరుసగా 4రోజూ నష్టాలతోనే ముగిసింది. మార్కెట్లో కొనసాగుతున్న వరుస పతనంతో సెన్సెక్స్‌ 48 పాయింట్లు నష్టపోయి 38000 స్థాయి దిగువున 37,982 వద్ద ముగిసింది. నిఫ్టీ 15 పాయింట్లను కోల్పోయి 11,331 వద్ద స్థిరపడింది. ఈ 4 ట్రేడింగ్‌ సెషన్స్‌లో సెన్సెక్స్‌ సూచీ 1232 పాయింట్లను, నిఫ్టీ 357 పాయింట్లును కోల్పోయాయి. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌,

Most from this category