News


చిన్న స్టాకుల సందడి కొనసాగుతుంది!

Monday 13th January 2020
Markets_main1578887916.png-30878

సందీప్‌ పోర్వల్‌
మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో ర్యాలీ కొనసాగుతుందని టెక్నికల్‌ సెటప్‌ సూచిస్తోందని ఆషికా స్టాక్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సందీప్‌ పోర్వల్‌ చెప్పారు. చిన్న షేర్లు బుల్లిష్‌గా ఉన్నందున ప్రస్తుత తరుణంలో ఈ విభాగానికి చెందిన నాణ్యమైన స్టాకులను ఎంచుకోవచ్చని సూచించారు. ఎంఅండ్‌ఎం, ఎక్సైడ్‌, అపోలోటైర్స్‌, షాపర్స్‌ స్టాప్‌ షేర్లను ఈ విభాగం నుంచి రికమండ్‌ చేశారు. లార్జ్‌క్యాప్స్‌లో ఆర్‌ఐఎల్‌ను పెరిగినప్పుడుల్లా అమ్మొచ్చని సిఫార్సు చేశారు. నిఫ్టీకి 12300 పాయింట్ల వద్ద ఇప్పటికీ బలమైన నిరోధం ఉందన్నారు. ఈ స్థాయిని దాటేందుకు నాలుగు వారాలుగా యత్నించి విఫలమైతోందన్నారు. అయితే దిగువకు వచ్చినప్పుడల్లా బలంగా రివర్స్‌ కావడం బుల్లిష్‌ బలానికి నిదర్శనమని చెప్పారు. 12300- 12350 పాయింట్ల పైన బలమైన క్లోజింగ్‌ వస్తే ర్యాలీ మరింత ముందుకు సాగుతుందని తెలిపారు. బ్యాంకు నిఫ్టీ కీలక డీఎంఏ స్థాయిలకు పైన కదలాడుతోందని, రాబోయే రోజులోఉ‍్ల 32610 పాయింట్ల పైకి బ్యాంకునిఫ్టీ వెళ్లవచ్చని అంచనా వేవారు. నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద బలమైన మద్దతు దొరుకుతోందన్నారు. ఇటీవల ఈ స్థాయి దిగువకు వచ్చిన రెండుమార్లు వెనువెంటనే బలమైన కొనుగోళ్లు వచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం బుల్స్‌కు, బేర్స్‌కు మధ్య హోరాహోరీ నడుస్తోందన్నారు. ఇందులో గెలిచేందుకు కొంత మేరకు బుల్స్‌కే ఎక్కువ ఛాన్స్‌లున్నాయని అభిప్రాయపడ్డారు. 



You may be interested

క్యూ3 ఎఫెక్ట్‌- ఇన్ఫోసిస్‌ 3 శాతం అప్‌

Monday 13th January 2020

3 శాతం ఎగసిన ఇన్ఫోసిస్‌ షేరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ జోరందుకుంది. అంతేకాకుండా భారీ ఆర్డర్లు లభించడంతో ప్రోత్సాహకర ఆదాయ అంచనాలు(గైడెన్స్‌) సైతం ప్రకటించడంతో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం(ఉదయం 9.25 ప్రాంతంలో) ఎన్‌ఎస్‌ఈలో ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 762 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 763 వరకూ పెరిగింది.  ఫలితాలు

సోమవారం వార్తల్లోని కంపెనీలు

Monday 13th January 2020

నేడు(13న) దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారం‍భమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి ట్రేడవుతోంది. అయితే వారాంతాన ట్రేడర్ల లాభాల స్వీకరణ కారణంగా యూఎస్‌ స్టాక్‌ ఇండెక్సులు స్వల్ప వెనకడుగు వేశాయి. ఇంట్రాడేలో సరికొత్త గరిష్టాలను అందుకున్నాక చివర్లో అమ్మకాలు తలెత్తడంతో డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ నష్టాలతో ముగిశాయి. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా కొన్ని కౌంటర్లు యాక్టివ్‌గా ట్రేడయ్యే అవకాశముంది. ఈ

Most from this category