STOCKS

News


బేర్‌ గుప్పిట్లో చిన్నషేర్లు!

Friday 9th August 2019
Markets_main1565340964.png-27667

స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ బేర్‌మార్కెట్లోకి ప్రవేశించాయని టెక్నికల్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధాన సూచీలు సైతం బేర్‌మార్కెట్లో ప్రవేశించడానికి దగ్గర్లో ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. ఏడాది గరిష్ఠస్థాయిల నుంచి బిఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌ సూచీ ఇప్పటివరకు 39 శాతం పతనం కాగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 20 శాతం క్షీణించింది. దీంతో టెక్నికల్‌గా ఈ రెండు సూచీలు బేర్‌మార్కెట్లోకి ప్రవేశించినట్లయింది. సెన్సెక్స్‌ తన ఏడాది గరిష్ఠం నుంచి ఇప్పటికి 9 శాతం క్షీణించింది. సాధారణంగా గరిష్ఠాల నుంచి 20 శాతం పతనమైతే సాంకేతికంగా బేర్‌మార్కెట్లోకి ప్రవేశించినట్లు నిపుణులు లెక్కిస్తారు. ఈ ప్రకారం మిడ్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఆల్రెడీ బేర్‌ గుప్పిట్లోకి వెళ్లినట్లయింది. రెండు నెలల క్రితం ప్రధాన సూచీలు అప్‌మూవ్‌లో ఉన్నతరుణంలోనే చిన్నస్టాకుల సూచీలు స్తబ్దుగా నిలిచాయి. ఎప్పుడైతే ప్రధాన సూచీల్లో పతనం ఆరంభమైందో ఈ చిన్నసూచీలు పోటీ పడి మరీ క్షీణతను నమోదు చేశాయి. నిజానికి మార్కెట్‌ విస్తృతి నెగిటివ్‌గా ఉన్నా కొన్ని పెద్ద షేర్లను అడ్డం పెట్టుకొని ప్రధాన సూచీలను పడకుండా ఆపడం జరిగిందని ఎపిక్‌ రిసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ చెప్పారు. స్మాల్‌క్యాప్‌ సూచీలోని 747 స్టాకుల్లో 653స్టాకులు ప్రస్తుతం తమ ఏడాది గరిష్ఠాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి.

ఇలా క్షీణించిన స్టాకుల్లో టాప్‌20 స్టాకుల వివరాలు ఇలా ఉన్నాయి...

ఇన్వెస్టర్‌ ఏం చేయాలి?
ఏడాదిన్నరగా చిన్నస్టాకుల్లో ఏమాత్రం రికవరీ లేని పతనం నడుస్తోంది. ఇందుకు వాల్యూషన్లు, ఎర్నింగ్స్‌, మందగమనం ప్రధానకారణాలు. అయితే పోర్టుఫోలియో ఏర్పాటు చేసుకోదలిచే ఇన్వెస్టర్లు కొంత రిస్కయినా ఫర్వాలేదనుకొని నాణ్యమైన చిన్నస్టాకులను ఎంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఒకేసారి మొత్తం నిధులను పెట్టుబడిగా పెట్టకుండా క్రమానుగత పెట్టుబడులను ఎంచుకోవాలని సలహా ఇచ్చారు. కొంత రిస్కు తగ్గించుకోదలిస్తే పోర్టుఫోలియోలో చిన్నస్టాకులతో పాటు కొన్ని బ్లూచిప్స్‌ను కలుపుకోవడం ఉత్తమమని సూచించారు. అయితే వాల్యూషన్ల పరంగా ఇంకా చిన్నస్టాకుల్లో పతనం మిగిలేఉందని, ఈ సమయంలో వీటిని నమ్ముకోవడం మంచిది కాదని సాంక్టమ్‌ వెల్త్‌ హెచ్చరిస్తోంది. ఇప్పటికి లార్జ్‌క్యాప్స్‌ని నమ్మడమే మంచిదని సూచించింది. చిన్నవైనా, పెద్దవైనా నాణ్యమైన స్టాక్స్‌ను మాత్రమే ఎంచుకోవాలని ఎక్కువమంది నిపుణుల సూచన. You may be interested

నిఫ్టీ అప్‌ట్రెండ్‌ ర్యాలీకి ఈ షేర్ల ర్యాలీ కీలకం

Friday 9th August 2019

నిఫ్టీ అప్‌ట్రెండ్‌ ర్యాలీకి రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కీలకమని యస్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రీతీష్‌ మెహతా అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ పయనంపై మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే... గురువారం మార్కెట్‌ టర్న్‌ అరౌండ్‌లో భాగంగా నిఫ్టీ సూచీ 10,800 వద్ద విరామస్థాయిని ఏర్పరుచుకుందని మెహతా తెలిపారు. బేరిష్‌ కారణాలతో మార్కెట్‌ ఒక పతనదిశలో వెళ్లినప్పుడు కొంతదూరం తర్వాత ఒక సగటు స్థాయికి తిరిగి వస్తుంది. నిఫ్టీ ఇండెక్స్‌

లాభాల్లో ఆటో షేర్లు

Friday 9th August 2019

ప్రభుత్వం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయించడం, మూడేళ్లు దాటిన హొల్డింగ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాలపై(ఎల్‌టీసీజీ) విధించే ట్యాక్స్‌ ను తొలగించడం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌ను(డీడీటీ) సులభతరం చేయడం వంటి మార్కెట్‌ ప్రెండ్లీ నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉండడంతో శుక్రవారం మార్కెట్లు పాజిటివ్‌గా కదులుతున్నాయి. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ మధ్యాహ్నం 2.07 సమయానికి 1.60 శాతం లాభపడి 7,110.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో

Most from this category