News


ఈ కంపెనీల ఫలితాల్లో స్థిరమైన వృద్ధి

Thursday 27th June 2019
Markets_main1561658221.png-26636

దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా స్వల్ప కాలంలో వచ్చే అస్థిరతల ప్రభావాలను తట్టుకుని మరీ ఇన్వె‍స్టర్లు లాభాలను పోగేసుకోవచ్చు. ఇప్పటి వరకు మార్కెట్‌ గణాంకాలు ఇవే తెలియజేస్తున్నాయి. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో మంచి కంపెనీలు సైతం దిద్దుబాటుకు గురై, అందుబాటు ధరల్లో ఉన్నవీ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ద్వారా మంచి రాబడులకు అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్‌ చేసే కంపెనీల్లో ఆదాయం, లాభాల పరంగా స్థిరమైన వృద్ధి ఉందా? అని చూసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే వాటిల్లో భవిష్యత్తుకు కొంత భరోసా ఉంటుందని భావించొచ్చు. ఈ విధమైన ఫలితాల్లో స్థిరమైన వృద్ధి చూపిస్తున్న మిడ్‌, స్మాల్‌ కంపెనీలను వ్యాల్యూ రీసెర్చ్‌ తెలియజేసింది.

 

గృహ్‌ ఫైనాన్స్‌
గుజరాత్‌ రూరల్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(గృహ్‌ ఫైనాన్స్‌) 1986లో ఏర్పాటైంది. హెచ్‌డీఎఫ్‌సీ, ఆగాఖాన్‌ ఫండ్‌ ఫర్‌ ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ ప్రమోటర్లు. 11 రాష్ట్రాల్లో 195 కార్యాలయాలు ఉన్నాయి. హౌసింగ్‌ రుణాల వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ చైర్మన్‌, సీఈవోగా కేకి ఎం మిస్త్రీ గృహ్‌ ఫైనాన్స్‌కు అధిపతిగా ఉన్నారు. ఐదు రకాల గృహ రుణ పథకాలను నిర్వహిస్తోంది. గత ఐదేళ్లుగా షేరువారీ ఆదాయం వృద్ధి చెందుతోంది. 2015 ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి 14.2 శాతంగా ఉండగా, 2019 ఆర్థిక సంవత్సరం నాటికి 22.9 శాతానికి పెరిగింది. రుణ ఆస్తులు కూడా ఏటా 20 శాతం చొప్పున పెరుగుతూ ప్రస్తుతం రూ.17.408 కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో కాస్ట్‌ ఆఫ్‌ బారోయింగ్‌ (నిధుల సమీకరణ వ్యయాలు) పెరిగింది. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో నిధుల కొరత ఇందుకు కారణం. బంధన్‌ బ్యాంకులో గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి ఇటీవలే కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆమోదం తెలిపింది. దీంతో విలీనం అనంతరం బంధన్‌ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 15 శాతం వాటా ఉంటుంది. 

 

సోలార్‌ ఇండస్ట్రీస్‌
1995లో ఏర్పాటైంది. పేలుడు పదార్థాలను ఎగుమతి చేసే అతిపెద్ద సంస్థ. దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశం వెలుపల ఐదు ప్లాంట్లు ఉండగా, వీటిని రెట్టింపు చేసుకోవాలన్న ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల ఎంటీల సామర్థ్యం ఉండగా, 2020 నాటికి 4.5 లక్షల ఎంటీలకు పెంచుకోనుంది. ఈ విస్తరణ పనుల కోసం గత ఆర్థిక సంవత్సరంలో రూ.271 కోట్లను వెచ్చించింది. పారిశ్రామిక పేలుడు పదార్థాలను ఎక్కువగా మైనింగ్‌ రంగం వినియోగిస్తోంది. కోల్‌ ఇండియా అతిపెద్ద ఖాతాదారు. సోలార్‌ ఇండస్ట్రీస్‌ ఆదాయంలో 17 శాతం ప్రభుత్వరంగ కంపెనీల నుంచే వస్తోంది. హౌసింగ్‌ 27 శాతం, మౌలిక సదుపాయాల రంగం నుంచి 35 శాతం ఆదాయం వస్తోంది. రక్షణ రంగం వాటా 7 శాతంగా ఉంది. ముడి పదార్థాల ధరలు పెరగుదల, నియంత్రపరమైన అవరోధాలు ఈ తరహా వ్యాపారంపై ప్రభావం చూపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ కంపెనీ ఆర్డర్‌ బుక్‌ విలువ రూ.1,146 కోట్లు. గత నాలుగేళ్లుగా ఈ కంపెనీ ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2015లో షేరువారీ ఆదాయం 11 శాతంగా ఉంటే, 2019 మార్చి నాటికి ఇది 18.6 శాతానికి పెరిగింది. గత పదేళ్ల కాలంలో ఏటా ఇన్వెస్టర్లకు ఈ స్టాక్‌ 36 శాతం చొప్పున సగటు రాబడులను ఇచ్చింది.  

 

రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌
ఇది కూడా గృహ రుణాల వ్యాపారంలో ఉన్న కంపెనీయే. 2000లో ఏర్పాటైంది. ముఖ్యంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలే లక్ష్యంగా అడుగులు వేసింది. ఈ కంపెనీకి 143 శాఖలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అత్యధికంగా తమిళనాడులో శాఖలు ఉన్నాయి. కంపెనీ రుణాల్లో ఈ రాష్ట్రం వాటా 57 శాతం. స్వయం ఉపాధిపై ఆధారపడిన వ్యక్తులకు ప్రధానంగా రుణాలను ఇస్తుంటుంది. కంపెనీ రుణ పుస్తకంలో ఇలా ఇచ్చిన రుణాలు 57 శాతంగా ఉన్నాయి. 2019 మార్చి నాటికి లోన్‌ బుక్‌ రూ.11,036 కోట్లుగా ఉంది. ఇందులో గృహ రుణాలు 81.6 శాతం. మిగిలినవి ఆస్తులను తనఖా ఉంచుకుని ఇచ్చిన రుణాలు. సగటు లోన్‌ సైజు రూ.14 లక్షలు. గత ఏడాది కాలంలో కంపెనీ స్థూల ఎన్‌పీఏలు పెరిగి 3.1 శాతంగా ఉన్నాయి. ప్రొవిజన్‌ కవరేజీ రేషియో 40 శాతంగా ఉంది. ఇంది కొంచెం ఆందోళన కలిగించేది. నికర వడ్డీ మార్జిన్‌ 4.9 శాతం నుంచి 4.5 శాతంగా ఉంది. షేరువారీ ఆర్జనలో గత ఆర్థిక సంవత్సరంలో 18.6 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం ఈ స్టాక్‌ 9.1పీఈలో ట్రేడ్‌ అవుతోంది. You may be interested

మే మాసంలో పీఎంఎస్‌లకు లాభాలు

Thursday 27th June 2019

చాలా నెలల తర్వాత మే మాసంలో అధిక శాతం పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీస్‌(పీఎంఎస్‌)లు సానుకూల లాభాలను కళ్లజూశాయి. సార్వత్రిక ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో తిరిగి మోదీ సర్కారే విజేతగా నిలవడంతో ఆ నెలలో స్టాక్‌ మార్కెట్లు మంచి ర్యాలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పీఎంఎస్‌లలో 82 శాతం సానుకూల రాబడులను మేలో సంపాదించాయి. అంతకుముందు ఏప్రిల్‌ నెలలో కేవలం 30 శాతం పీఎంఎస్‌లే సానుకూల రాబడులను సంపాదించడం గమనార్హం.    ఎల్‌ఐసీ

రేపే కేపీఆర్ అగ్రోకెమ్ ఐపీఓ ప్రారంభం

Thursday 27th June 2019

ఇష్యూ ధ‌ర రూ.210 కోట్లు  ధ‌రల‌ శ్రేణి రూ.59-61 ఆంధ్ర‌ప్రదేశ్ ఆధారిత ఆగ్రిక‌ల్చ‌ర్ కేపీఆర్  అగ్రోకెమ్ కంపెనీ ఐపీఓ ఇష్యూ గురువారం ప్రారంభం కానుంది. ఇష్యూ ద్వారా కంపెనీ  రూ.210 కోట్ల‌ను స‌మీక‌రించనుంది. ఐపీఓలో భాగంగా ప్ర‌మోట‌ర్ కంపెనీ, 14 మంది ప్ర‌మోట‌ర్లు మొత్తం 1.2 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫ‌ర్ ఫ‌ర్ సేల్ ప‌ద్ధ‌తిలో విక్ర‌యిచనున్నారు. ఇష్యూకు ధ‌ర శ్రేణి రూ.59-61ల మ‌ధ్య నిర్ణ‌యించారు. ఐపీఓ ఇష్యూ జూన్ 28న ప్రారంభ‌మైన, జూన్

Most from this category