News


స్వల్ప కరెక్షన్‌ కొనుగోలుకు అవకాశం...

Monday 8th April 2019
Markets_main1554662475.png-24999

నిఫ్టీ సానుకూల స్థాయిల్లో ఉందని, చిన్న కరెక్షన్‌లు వస్తే కొనుగోళ్లకు అవకాశంగా చూడాలని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ షెట్టి పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థతో ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిఫ్టీ మద్దుతు స్థాయిల గురించి మాట్లాడుతూ... నిఫ్టీ స్వల్ప కాల ట్రెండ్‌ సానుకూలంగా ఉందన్నారు. నిఫ్టీకి తక్షణ మద్దతు 11,500-11,550 స్థాయిల్లో ఉందని ఈ  స్థాయిల వరకు మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే కొనుగోళ్లకు అవకాశంగా చూడాలని సూచించారు. 

 

కీలకమైన కనిష్ట స్థాయిల నుంచి మిడ్‌క్యాప్స్‌ వేగంగా రివర్స్‌ అయ్యాయని నాగరాజ్‌ తెలిపారు. చిన్న దిద్దుబాటు కనిపిస్తే వీటిని స్వల్పకాలం కోసం కొనుగోలు చేసుకోవచ్చన్నారు.  సమీప కాలంలో బ్యాంకు నిఫ్టీ 35,000 స్థాయిని చేరుకోకపోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ స్థాయిని అధిగమించే ముందు తగినంత కరెక్షన్‌ ఉండొచ్చన్నారు. సాంకేతికంగా చూస్తే టాటా మోటార్స్‌, కోటక్‌ బ్యాంకు, సెయిల్‌, బాటా ఇండియా, కెన్‌ఫిన్‌ హోమ్‌ కొనుగోళ్లకు మంచి అనుకూల స్టాక్స్‌గా సూచించారు. మెటల్స్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లకు ఇది మంచి సమయమా? అ‍న్న ప్రశ్నకు... స్వల్ప కాలానికి ఇవి బోటమ్డ్‌ అవుట్‌ అయినట్టు చెప్పారు. దీర్ఘకాల పొజిషన్లను పరిశీలించొచ్చని, కరెక్షన్‌ కనిపిస్తే కొనుగోలుకు వినియోగించుకోవచ్చన్నారు. 



You may be interested

నష్టాలను అధిగమించాలంటే వీటిని మర్చిపోవద్దు..!

Monday 8th April 2019

స్టాక్‌ మార్కెట్‌ అంటే అనిశ్చితి. ఎప్పుడు మార్కెట్లు ఏ టర్న్‌ తీసుకుంటాయో ఎవరూ చెప్పజాలరు. మరి ఈ అస్థిరతలను ఎలా అధిగమించాలన్నది తెలిసిన ఇన్వెస్టర్లు తక్కువ మందే ఉంటారు. స్టాక్స్‌ ఇన్వెస్టింగ్‌ను జూదంలా భావించి, నష్టపోయి మార్కెట్‌ను వీడేవారూ ఉన్నారు. కానీ, స్టాక్‌ మార్కెట్‌ అన్ని సాధనాల్లోకి మెరుగైన రాబడులను ఇస్తుందని ప్రపంచవ్యాప్తంగా చరిత్ర చెబుతోంది. కనుక ఈక్విటీలను రాబడుల వనరుగా మార్చుకోవాలంటే కొన్ని సూత్రాలను పాటించాలని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌

షేర్ల బైబ్యాక్‌ అన్ని సమయాల్లోనూ మంచిదేనా?

Monday 8th April 2019

షేర్ల బైబ్యాక్‌ (వాటాలను తిరిగి కొనుగోలు) ఇన్వె‍స్టర్లకు ఎప్పుడూ మంచిదేనన్న అభిప్రాయం ఒకటి ఉంది. కంపెనీ పనితీరు చక్కగా ఉందన్న సంకేతాన్ని ఇది ఇస్తుందనుకుంటారు. కానీ, బైబ్యాక్‌లు అన్నింటినీ ఒకే గాటన కట్టొద్దు. షేర్ల బైబ్యాక్‌ నిజంగా ఇన్వెస్టర్లకు మేలు చేసేదేనా? అన్నది తెలుసుకోవాలంటే ఉద్దేశ్యాలు అర్థం చేసుకోవాలి.     షేరు ధర చౌకగా ఉండడమే కంపెనీలు బైబ్యాక్‌ నిర్ణయం తీసుకునేందుకు ప్రోత్సాహకరమని వారెన్‌ బఫెట్‌ అంటారు. ‘‘30-40 ఏళ్ల క్రితం

Most from this category