News


ఈ చిన్న షేర్లు లబోదిబో

Monday 23rd March 2020
Markets_main1584957988.png-32638

ట్రేడింగ్‌ ప్రారంభంలోనే మార్కెట్లు 10 శాతం కుప్పకూలినప్పటికీ అమ్మకాలు ఆగలేదు.  సమయం గడిచేకొద్దీ అమ్మకాల తీవ్రత మరింత పెరిగింది. దీంతో సెన్సెక్స్‌ 3700 పాయింట్లకుపైగా కోల్పోగా.. నిఫ్టీ ఏకంగా 1,000 పాయింట్లు పడిపోయింది. దీంతో ఇండెక్స్‌ షేర్లన్నీ భారీగా పతనమయ్యాయి. ఈ నేపథ్యంలో పలు మధ్య, చిన్నతరహా కౌంటర్లలో అమ్మకాలు ఉధృతమయ్యాయి. అంతా అమ్మేవాళ్లేతప్ప కొనుగోలుదారులు కరవుకావడంతో 20 శాతం లోయర్‌ సర్క్యూట్లను తాకాయి. వివరాలు చూద్దాం..


20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ 

పీఎస్‌పి ప్రాజెక్ట్స్‌: ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌పీ ప్రాజెక్ట్స్‌ షేరు 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 290 దిగువన ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 2250 షేర్లుకాగా..
మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 4000 షేర్లు చేతులు మారాయి. ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!

స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌: ఎన్‌ఎస్‌ఈలో స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్‌ షేరు 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 597 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం
3800 షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 2600 షేర్లు చేతులు మారాయి.  ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!

కళ్యాణి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ: ఎన్‌ఎస్‌ఈలో కళ్యాణి ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీరు 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 849 వద్ద ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 200
షేర్లుకాగా.. మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 190 షేర్లు చేతులు మారాయి.  ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!

రినైసెన్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌: ఎన్‌ఎస్‌ఈలో రినైసెన్స్‌ గ్లోబల్‌ షేరు 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ.  202 దిగువన ఫ్రీజయ్యింది. బీఎస్‌ఈలో గత నెల రోజుల సగటు ట్రేడింగ్ పరిమాణం 4800 షేర్లుకాగా..
మధ్యాహ్నానికల్లా ఈ కౌంటర్లో 500 షేర్లు మాత్రమే చేతులు  మారాయి.  ఇది 52 వారాల కనిష్టంకావడం గమనార్హం!



You may be interested

మార్కెట్‌ మహాపతనంలో 20శాతం ర్యాలీ చేసిన షేర్లు ఇవే..!

Monday 23rd March 2020

స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మరోసారి మహా పతనాన్ని చవిచూసింది. ఈ తరుణంలో కొన్ని షేర్లు 20శాతం వరకు లాభాల్ని ఇన్వెస్టర్లకు అందించాయి. నేటి ట్రేడింగ్‌లో మొత్తంగా 1450 షేర్లు నష్టాలను చవిచూడగా,  ఫార్మాస్యూటికల్స్‌, ఇండస్ట్రీయల్‌ రంగాలకు చెందిన  156 షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడ్డాయి.  కరోనా వైరస్ వ్యాధిని నివారణకు ఔషధాన్ని కనుక్కోనేందుకు కేంద్రం పలు ప్రైవేట్ ల్యాబ్‌లకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. దీంతో నేడు అత్యధిక లాభాలను గడించిన షేర్లలో

మిడ్‌ క్యాప్స్‌ మహాపతనం

Monday 23rd March 2020

బీఎస్‌ఈ-500లో పలు షేర్లు బోర్లా ఫైనాన్షియల్‌ కౌంటర్లకు నష్టాల షాక్‌ 50-75 శాతం మధ్య డౌన్‌ కరోనా సృష్టిస్తున్న విలయానికి వణుకుతున్న ప్రపంచ దేశాల  సరసన తాజాగా ఇండియా చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకీ కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లలో మరోసారి ఆందోళనలు పెరిగాయి. దీంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు తాజాగా ఏకంగా 12 శాతంపైగా కుప్పకూలాయి. కొద్ది రోజులుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారనున్న అంచనాలతో

Most from this category