STOCKS

News


ఈ ఆర్థిక సంవత్సరమంతా మందగమనం ఉంటుంది: గిరీష్ పాయ్‌

Monday 22nd July 2019
Markets_main1563779648.png-27227

  • జీడీపీ వృద్ధి 6-6.5శాతానికి పడిపోయే అవకాశం. 
  • అమెరికా వృద్ధి మందగమనంపై మదుపర్ల ఆందోళన.
  • దేశీయ, అంతర్జాతీయ మందగమన ప్రభావం ఎఫ్‌వై20 హెచ్‌2లో,  ఎఫ్‌వై 21 హెచ్‌1లో కనిపించనుంది.

 
ఆర్థిక సంవత్సరం 2020కి గాను ఆర్థిక వృద్ధి 6-6.5 శాతంగా నమోదుకావచ్చు. ఆదాయాల వృద్ధి 20-25 శాతం నుంచి తగ్గవచ్చని నిర్మల్ బంగ్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ గిరీష్ పై ఓ ఆంగ్ల చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే..

వృద్ధి రేటు తగ్గనుంది..
కార్పొరేట్‌ లాభాల వృద్ధి ఈ త్రైమాసికం నుంచి తగ్గనున్నాయి. ఇప్పటికే కొన్ని రంగాలు మార్కెట్లను నిరాశపరిచాయి. సాధారణంగా ఆర్థిక వ్యవస్థను నడిపించే రంగాలు మరింత ప్రమాదంలో పడకుండా ఉంటాయని ఆశిస్తున్నా.  ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆర్థిక సంవత్సరం 2020కి గాను దేశ ఆర్థిక వృద్ధి 6-6.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. లాభాల వృద్ధి కూడా 20-25 శాతం నుంచి తగ్గవచ్చు. ఈ ఆర్థిక సంవత్సరపు లాభాల్ని పరిశీలిస్తే చాలా వరకు  కార్పొరేట్ బ్యాంకుల నుంచి వస్తున్నాయని అర్థమవుతుంది.  ఇతర రంగాలు ఊహించినంత వృద్ధిని ఇవ్వలేకపోవచ్చు. అంతేకాకుండా కార్పొరేట్ బ్యాంకులు ఆస్తి నాణ్యత సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 
  ఎన్‌బీఎఫ్‌సి సంక్షోభం, వినియోగం మందగించడం వలన  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వంటి బ్యాంకులు అంచనాలకు తగ్గట్టు రుణాలు ఇవ్వలేకపోయాయి.  విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) దృక్పథం ప్రకారం ఆలోచిస్తే విదేశాలలో బాండ్‌ ఈల్డ్‌ ‍్స బాగా ఉన్నాయి.  ఇలాంటి పరిస్థితులలో ప్రతికూల దిగుబడినిచ్చే భూభాగాల నుంచి భారతదేశం వంటి మార్కెట్లకు తమ నగదును మార్చడానికి విదేశి ఇన్వెస్టర్లు ప్రయత్నించవచ్చు.  దీంతోపాటు అమెరికా వృద్ధి గణనీయంగా మందగించడం వలన ఈ ఆందోళన అధికంగా ఉంది. ఇది అంతర్జాతీయంగా ఉన్న ఇన్వెస్టర్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

 దీర్ఘకాలంలో  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌..
 దీర్ఘకాలంలో  హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ను పరిశీలించవచ్చు. పుస్తక విలువ, ఆదాయాల పరంగా గణనీయమైన వృద్ధిని సాధించిన స్టాకులలో ఇది ముందుంటుంది. ఈ స్టాకును పోర్ట్‌ఫోలియోలో ప్రధానంగా పరిశీలించవచ్చు.  కానీ సమీప కాలంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం వలన ఎన్‌బీఎఫ్‌సీ రంగం ఇంకా కోలుకోలేదు. ఆర్థిక వ్యవస్థలోని కొన్ని భాగాలకు గతంలో ఉన్న సౌలభ్యాలు ఇప్పుడు అందడం లేదు. ఫలితంగా ఆర్థిక వృద్ధి నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. ఆటో రంగంలో ఉన్న సమస్యల వలన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రుణ వృద్ధి మందగించింది. సమీప కాలంలో దీని వృద్ధిలో సమస్యలున్నప్పటికి దీర్ఘకాలానికి మాత్రం ఈ స్టాకు బలంగా ఉంది. 

బాండ్‌ ఈల్డ్‌లు మరింత తగ్గవచ్చు..
దేశీయంగా బాండ్‌  ఈల్డ్‌ ‍్స సుమారుగా 8.2 శాతం స్థాయిల నుంచి దాదాపు 6.3-6.4 శాతం స్థాయిలకు చేరుకున్నాయి. అంతేకాకుండా  ఇది 6 శాతం కి వెళ్లే అవకాశం కూడా ఉంది.  డిపాజిట్ వడ్డీ రేట్లతో పాటు రుణ రేట్లు మాత్రం ఆ మేరకు తగ్గలేదు. చిన్న పొదుపు రేట్లను 10 బేసిస్‌ పాయింట్లు మాత్రమే ప్రభుత్వం తగ్గించింది. ఈల్డ్‌ల బెంచ్‌మార్కు చూడాలంటే ఈ తగ్గింపు 80 బేసిస్‌ పాయింట్లు ఉండాలి.  ప్రభుత్వం కొన్ని బాధ్యతలను తీర్చడానికి మార్కెట్ నుంచి రుణం తీసుకోవాలి. దీనికి కొంత సమయం పడుతుందని భావిస్తున్నా. మొత్తం మందగమనం రాత్రికి రాత్రి మారదుగా!
  దేశియ, అంతర్జాతీయ మందగమనాలు కలిసి ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఆటంకంగా ఉండనున్నాయి. గత కొంత కాలం నుంచి అమెరికా మందగమనం మనం గమనించడం లేదు. వీటి ప్రభావం ఆర్థిక సంవత్సరం 2020 ద్వితియార్ధంలో, 2021 ప్రథమార్ధంలో ‍ కనిపించనుంది. 

యస్‌ బ్యాంక్‌కు మంచిది..
డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డీల్‌ జరిగితే  అది మార్కెట్లకు సానుకూలంగా మారుతుంది. అన్నిటికన్నా యస్‌  బ్యాంక్‌ లబ్దిపొందుతుంది. యస్‌ బ్యాంక్‌ మార్కెట్ల నుంచి 120 కోట్ల డాలర్లను సమీకరించాలని ప్రయత్నిస్తోంది. ఒక వేళ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డీల్‌ పూర్తయితే యస్‌ బ్యాంక్‌ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు ఇచ్చిన రూ.4,000 కోట్ల ప్రమాదకర రుణాలు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది యస్‌ బ్యాంకును మంచి స్థానంలో  నిలబెట్టనుంది. You may be interested

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాభంలో 18 శాతం వృద్ధి

Monday 22nd July 2019

రూ.5,676 కోట్ల కన్సాలిడేటెల్‌ లాభం నమోదు స్టాండలోన్‌ లాభంలో 21 శాతం వృద్ధి ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక డివిడెండ్‌ న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు జూన్‌ త్రైమాసికానికి ఎప్పటి మాదిరే మంచి ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు కన్సాలిడేటెడ్‌ లాభం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.4,808 కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగి రూ.5,676 కోట్లకు చేరుకుంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.28,000 కోట్లతో పోలిస్తే 19

ఈ వారం స్టాక్‌ రికమెండేషన్స్‌

Monday 22nd July 2019

ఫెడరల్‌ బ్యాంక్‌        కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ ప్రస్తుత ధర: రూ. 99 టార్గెట్‌ ధర: రూ.125 ఎందుకంటే:- ఈ ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ పనితీరు నిలకడగానే ఉంది. గత క్యూ4లో రూ.256 కోట్లుగా ఉన్న తాజా మొండి బకాయిలు ఈ క్యూ1లో రూ.415 కోట్లకు పెరిగాయి. ఒత్తిడి రిటైల్‌ రుణాలు కేరళలోనే అధికంగా ఉన్నాయి. భారీ వరదల కారణంగా  కేరళలో పరిస్థితులన్నీ తల్లకిందులు కావడమే దీనికి కారణం. రికవరీ త్వరితంగానే ఉండగలదని

Most from this category