News


స్కిప్పర్‌- గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ జూమ్‌

Monday 30th December 2019
Markets_main1577680474.png-30522

దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు సోమవారం హుషారుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 ప్రాంతంలో సెన్సెక్స్‌ 126 పాయింట్లు పెరిగి 41,701కు చేరగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 12281 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీ డెవలప్‌మెంట్స్‌ ఆధారంగా ఇటు స్కిప్పర్‌ లిమిటెడ్‌, అటు గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌తోపాటు స్నోమన్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వివరాలు చూద్దాం..

స్కిప్పర్‌ లిమిటెడ్‌
దేశీయంగా తొలిసారి విజయవంతంగా 765 కేవీ S/C మోనోపోల్‌కు సంబంధించి డిజైన్‌, ఫ్యాబ్రికేటెడ్‌, టైప్‌ టెస్టెడ్‌ను అభివృద్ధి చేసినట్లు స్కిప్పర్‌ లిమిటెడ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో స్కిప్పర్‌ షేరు 11.5 శాతం దూసుకెళ్లి రూ. 53 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 55 వద్ద గరిష్టాన్ని తాకింది.

గేట్‌ వే డిస్ట్రిపార్క్స్‌, స్నోమన్‌ లాజిస్టిక్స్‌
గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌ నుంచి స్నోమన్‌ లాజిస్టిక్స్‌లో 40.25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ వెల్లడించింది. ఇందుకు రూ. 296 కోట్లను వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, స్నోమన్‌ లాజిస్టిక్స్‌ కౌంటర్లు జోరందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో గేట్‌ వే డిస్ట్రిపార్క్స్‌ షేరు 4.2 శాతం జంప్‌చేసి రూ. 114 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 117.40 వరకూ ఎగసింది. ఈ బాటలో స్నోమన్‌ లాజిస్టిక్స్‌ షేరు 3.2 శాతం జంప్‌చేసి రూ. 44 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 45.65 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. అయితే అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేరు 0.7 శాతమే పుంజుకుని రూ. 366 వద్ద కదులుతోంది. తొలుత రూ. 371 వరకూ పెరిగింది.



You may be interested

నేలచూపులతో ప్రిన్స్‌ పైప్స్‌ లిస్టింగ్‌

Monday 30th December 2019

10 శాతం తక్కువగా రూ. 160 వద్ద షురూ ఐపీవో ధర కంటే దిగువన ట్రేడింగ్‌ ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ ముగించుకున్న ప్రిన్స్‌ పైప్స్‌ అండ్‌ ఫిట్టింగ్స్‌ లిమిటెడ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో నష్టాలతో లిస్టయ్యింది. ఐపీవో ధర రూ. 178తో పోలిస్తే 10 శాతం డిస్కౌంట్‌తో రూ. 160 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. వెరసి ఇష్యూ ధర కంటే రూ. 18 తక్కువలో లిస్టయ్యింది. తదుపరి ఎన్‌ఎస్‌ఈలో రూ. 175.50 వద్ద గరిష్టాన్ని

2019 బిజినెస్‌ రివైండ్‌: టెల్కోలకు షాక్‌ ట్రీట్‌మెంట్‌..

Monday 30th December 2019

సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కింపు విషయంలో కేంద్రం ఫార్ములానే సమర్ధిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలివ్వడంతో పాత ప్రైవేట్‌ టెల్కోల మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. ఈ దెబ్బతో టెల్కోలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కేంద్రానికి చెల్లించాల్సి వస్తోంది. వీటికి కేటాయింపులు జరపడంతో వొడాఫోన్‌ ఐడియా సంస్థ దేశ కార్పొరేట్‌ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ. 50,921 కోట్ల పైచిలుకు నష్టాలను సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ కూడా

Most from this category