News


త్వరలో మిడ్‌క్యాప్స్‌ జోరు షురూ!

Monday 3rd June 2019
Markets_main1559546894.png-26063

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ అంచనా
రాబోయే రోజుల్లో మిడ్‌క్యాప్స్‌లో మంచి అప్‌మూవ్‌ ఉంటుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ ఈడీ అనీల్‌ సరీన్‌ చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన ఫలితాన్ని అందించినందున సంస్కరణలకు ఢోకా ఉండకపోవచ్చని మార్కెట్లు భావిస్తున్నాయన్నారు. ఈ ఆశలతో చిన్నస్టాకులు జోరు చూపుతాయని చెప్పారు. ఈ దశలో గతంలో బాగా పతనమై మంచి నాణ్యత ఉన్న కంపెనీల స్టాకులనే ఎంచుకోవాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్దంలో ఎకానమీలో పునరుజ్జీవం వస్తుందని, దీర్ఘకాలానికి మార్కెట్‌ పాజిటివ్‌గానే ఉంటుందని అంచనా వేశారు. సంస్కరణలపై నెలకొన్న అనిశ్చితిని ఎన్నికల ఫలితాలు పోగొట్టాయన్నారు. అనిశ్చితి తొలగిపోవడంతో అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్‌వైపు చూస్తున్నారన్నారు. 
రికవరీకి చర్యలు
మోదీ 2.0 ప్రభుత్వం పెట్టుబడులను పునరుజ్జీవింపజేసి, వినిమయ వృద్ధిని పెంచేందుకు తొలుత స్వల్పకాలిక తక్షణ చర్యలు చేపడుతుందని అనీల్‌ అభిప్రాయపడ్డారు. ఈ చర్యల ప్రభావం మిడ్‌క్యాప్స్‌పై ఉంటుందని, వీటిలో ర్యాలీ వస్తుందని చెప్పారు. గతవారం మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌ దాదాపు 5 శాతం లాభాలు నమోదు చేశాయి. ప్రస్తుతం లార్జ్‌క్యాప్స్‌ వాల్యూషన్లు 2006-07 సమయంలో కన్నా చాలా ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అయితే ఎకానమీలో మేలిమలుపులు సంభవిస్తే ఈ వాల్యూషన్లకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌లో పలు విభాగాల స్టాకులు ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్ద ఉన్నాయని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ లిక్విడిటీ సమస్య తీర్చేందుకు ఆర్‌బీఐ మరోమారు రెపోరేట్‌ తగ్గించే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. 

 You may be interested

లాభాల బాటలో అటో షేర్లు

Monday 3rd June 2019

మేలో వాహన గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరుత్సాహపరిచినప్పటికీ.., సోమవారం అటో రంగ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో అటోరంగ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ అటో ఇండెక్స్‌ దాదాపు 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ సూచి 8,145.45ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. వాహన అమ్మకాలను ప్రోత్సాహించే విధంగా ప్రస్తుతం వాహనాలపై  28 శాతం జీఎస్టీ రేటు 18 శాతానికి తగ్గించాలని ఆటోమొబైల్‌ పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

చర్చలైనా, యుద్ధమైనా సై

Monday 3rd June 2019

అమెరికాతో వాణిజ్య వివాదంపై చైనా స్పష్టీకరణ సింగపూర్‌: వాణిజ్య అంశాలపై అమెరికా, చైనాల మధ్య పోరు మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ విషయంలో అమెరికాతో చర్చలకైనా, యుద్ధానికైనా తాము సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది. చర్చలకు ఇప్పటికీ తాము సిద్ధమేనని, కానీ ఒకవేళ అమెరికా గానీ యుద్ధమే కోరుకుంటే తుదిదాకా పోరాడతామని హెచ్చరించింది. సింగపూర్‌లో ఐఐఎస్‌ఎస్‌ షాంగ్రి–లా సదస్సుకు హాజరైన సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్‌ వై ఫెంగీ

Most from this category