News


శ్రీరామ్‌ ట్రాన్స్‌ దౌడు- జీఎస్‌కే ఫార్మా ‘బేర్‌

Tuesday 4th February 2020
Markets_main1580802340.png-31500

క్యూ3 ఫలితాల ఎఫెక్ట్‌
శ్రీరామ్‌ ట్రాన్స్‌ 10 శాతం అప్‌
జీఎస్‌కే ఫార్మా 10 శాతం డౌన్‌

కరోనా భయాలు, బడ్జెట్‌ నిరాశ నేపథ్యంలో కుప్పకూలిన దేశీ స్టాక్‌ మార్కెట్లు రెండు రోజుల్లోనే బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో దూకుడు చూపుతున్నాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 753 పాయింట్లు జంప్‌చేసి 40,625ను తాకగా.. నిఫ్టీ 229 పాయింట్లు పురోగమించి 11,937 వద్ద ట్రేడవుతోంది. వెరసి మార్కెట్లు శనివారం నమోదైన నష్టాలను దాదాపు పూడ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో ఎన్‌బీఎఫ్‌సీ.. శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించడంతో గ్లోబల్‌ దిగ్గజం గ్లాక్సోస్మిత్‌క్లెయిన్‌(జీఎస్‌కే) ఫార్మాస్యూటికల్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి శ్రీరామ్‌ ట్రాన్స్‌ కౌంటర్‌ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. జీఎస్‌కే ఫార్మా పతనంతో కళ తప్పింది. వివరాలు చూద్దాం...

శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ నికర లాభం 38 శాతంపైగా పెరిగి రూ. 879 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర వడ్డీ ఆదాయం మాత్రం నామమాత్ర వృద్ధితో రూ. 2055 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3993 కోట్ల నుంచి రూ. 4288 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో విదేశీ రీసెర్చ్‌ సంస్థ యూబీఎస్‌ ఈ కౌంటర్‌కు బయ్‌ రేటింగ్‌ను ప్రకటించింది. రూ. 1650 టార్గెట్‌ ధరను ఇచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ షేరు 9.5 శాతం దూసుకెళ్లి  రూ. 1082 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1115 వద్ద గరిష్టాన్ని తాకింది. 

జీఎస్‌కే ఫార్మాస్యూటికల్స్‌
ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో జీఎస్‌కే ఫార్మాస్యూటికల్స్‌ రూ. 661 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 114 కోట్ల నికర లాభం ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా జిన్‌టాక్‌ ఔషధ ఉత్పత్తులను మార్కెట్ల నుంచి ఉపసంహరించడంతో లాభాలు ప్రభావితమైనట్లు కంపెనీ పేర్కొంది. ప్రధానంగా తయారీ సౌకర్యాలను తగినస్థాయిలో వినియోగించుకోకపోవడంతో రూ. 640 కోట్లు,, ఇతర ఆస్తులపై రూ. 97 కోట్లమేర ఇంపెయిర్‌మెంట్‌ చార్జీలు నమోదైనట్లు తెలియజేసింది. కాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ. 825 కోట్ల నుంచి రూ. 779 కోట్లకు క్షీణించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో జీఎస్‌కే ఫార్మాస్యూటికల్స్‌ షేరు దాదాపు 11 శాతం కుప్పకూలి రూ. 1471 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1425 వద్ద కనిష్టాన్ని తాకింది. ఇది మూడు నెలల కనిష్టంకావడం గమనార్హం!
 You may be interested

పెట్టుబడులు డిస్కౌంట్ల కోసం కాదు: అమెజాన్‌

Tuesday 4th February 2020

ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ చావు కబురును చల్లగా మెప్పింది. ఇటీవల భారత్‌లో పర్యటన సందర్భంగా సంస్థ సీవోఈ జెఫ్ బెజోస్ ప్రకటించిన రూ.7,100 కోట్లను పెట్టబడులను ధీర్ఘకాలిక అభివృద్ధికి మాత్రమే వినియోగిస్తామని, డిస్కౌంట్ల లేదా నష్టాలను పూడ్చుకునేందుకు కాదని అమెజాన్‌ ఇండియా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 50 ప్రపంచ స్థాయిలో మల్టీ-మిలియన్‌ ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లను నిర్మాణం చేపట్టాల్సి అవసరం ఉందని అమెజాన్‌ ఇండియా విక్రయ సేవల విభాగపు అధిపతి

52 వారాల గరిష్టానికి 40 షేర్లు

Tuesday 4th February 2020

మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో సుమారు 40 షేర్లు 52 వారాల గరిష్టానికి  చేరాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో అల్‌కెమ్‌ ల్యాబొరేటరీస్‌,  ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బాటా ఇండియా, బర్గర్‌ పెయింట్స్‌, క్లేరియంట్‌ కెమికల్స్‌(ఇండియా), కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌, డాబర్‌ ఇండియా, దీపక్‌ నైట్రైట్‌, ఎడిల్వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, జీఎంఎం ఫాడ్‌లర్‌, హిందుజా గ్లోబ్‌ సొల్యూషన్స్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌ ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌, ఇన్ఫోబీమ్‌ టెక్నాలజీస్‌లు ఉన్నాయి.   52 వారాల

Most from this category