News


నిఫ్టీ మార్పులతో శ్రీసిమెంట్‌ అప్‌- యస్‌ బ్యాంక్‌ డౌన్‌

Wednesday 19th February 2020
Markets_main1582092197.png-31926


వచ్చే నెల(మార్చి) 27 నుంచి ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీలో చేపడుతున్న మార్పుల నేపథ్యంలో శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. మరోపక్క యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. ఉదయం 11.20 ప్రాంతంలో ఎన్‌ఎస్‌ఈలో శ్రీ సిమెంట్‌ షేరు 3 శాతం జంప్‌చేసి రూ. 24,503 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 25,200 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మరోవైపు యస్‌ బ్యాంక్‌ 2 శాతం నీరసించి రూ. 34.4 వద్ద ట్రేడవుతోంది. రూ. 33.60 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని చవిచూసింది. 

ఇవీ మార్పులు
మార్చి 27 నుంచీ నిఫ్టీలో యస్‌ బ్యాంక్‌ స్థానే శ్రీ సిమెంట్‌కు చోటు కల్పిస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తాజాగా పేర్కొంది. ఇదే విధంగా నిఫ్టీ ఐటీ ఇండెక్సు నుంచి హెక్సావేర్‌, టాటా ఎలక్సీను తప్పిస్తున్నట్లు తెలియజేసింది. వీటి స్థానంలో ఇన్ఫో ఎడ్జ్‌, ఎంఫసిస్‌లను చేర్చుకుంటున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెక్సావేర్‌ దాదాపు 4 శాతం పతనమై రూ. 372 వద్ద కదులుతుంటే.. టాటా ఎలక్సీ మాత్రం 3.4 శాతం జంప్‌చేసి రూ. 1003 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు ఇన్ఫో ఎడ్జ్‌ దాదాపు 3 శాతం పెరిగి రూ. 2864కు చేరగా.. ఎంఫసిస్‌ 1.5 శాతం బలపడి రూ. 908 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

15ఏళ్ల కనిష్ఠాలకు దేశ పొదుపు రేటు!

Wednesday 19th February 2020

భారత ఎకానమీలో పొదుపు తగ్గుతోంది. దేశ సేవింగ్స్‌ రేటు 2019లో పదిహేనేళ్ల కనిష్ఠాలకు చేరింది. ఇప్పటికే బలహీనంగా ఉన్న పెట్టుబడులపై పొదుపురేటు పడిపోవడం మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ పొదుపులో గృహపొదుపు రేటు సైతం క్షీణత నమోదు చేసింది. వినియోగదారుల వినిమయం పెరగడం గృహపొదుపు పతనానికి కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశ పొదుపులో గృహ పొదుపు వాటా దాదాపు 60 శాతం ఉంటుంది. 2019 ఆర్థిక

అరబిందో ఫార్మా లాంగ్‌జంప్‌...18 శాతం అప్‌

Wednesday 19th February 2020

18 శాతం దూసుకెళ్లిన షేరు రూ. 590 వద్ద ట్రేడింగ్‌ యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి ఈఐఆర్‌ అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుం‍చి సక్రమ తనిఖీల నివేదిక(EIR) లభించినట్లు దేశీ ఫార్మా రంగ దిగ్గజం అరబిం‍దో ఫార్మా తాజాగా పేర్కొంది. హైదరాబాద్‌లోని పాశమైలారంలో గల ఇంజక్టబుల్‌ ఫార్ములేషన్ల తయారీ ప్లాంటుకి ఈఐఆర్‌ను పొందినట్లు వెల్లడించింది. ఈ యూనిట్‌-4  ప్లాంటులో యూఎస్‌ఎఫ్‌డీఏ 2019 నవంబర్‌ 4-13 మధ్య తనిఖీలు చేపట్టినట్లు తెలియజేసింది. అయితే వొలంటరీ యాక‌్షన్‌

Most from this category