News


సెక్షన్‌ 80సీ పొదుపు.. కుదరకపోతే పన్ను..?

Sunday 2nd February 2020
Markets_main1580583051.png-31410

ఇప్పటి వరకు వేతన జీవులు తమ ఆదాయంలో రూ.1.5 లక్షలను సెక్షన్‌ 80సీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేసి పన్ను ఆదా పొందుతున్నారు. ఇకపైనా ఈ అవకాశం కొనసాగుతుంది. మరోవైపు రూ.5-7.5 లక్షల మధ్య ఆదాయంపై పన్నును 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. రూ.7.5-10 లక్షల ఆదాయంపై పన్ను రేటును 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. రూ.10-12.5 లక్షల మధ్య ఆదాయంపై 30 శాతానికి బదులు 20 శాతం పన్ను రేటు, రూ.12.5-15 లక్షల మధ్య ఆదాయంపై 25 శాతానికి పన్నును తగ్గించారు. రూ.15 లక్షలపైన ఆదాయం ఉన్న వారికి ఇప్పటి మాదిరే 30 శాతం పన్ను రేటు అమలవుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయంపై ఇప్పటి మాదిరే ఇకపైనా పన్ను చెల్లించక్కర్లేదు. అయితే, సెక్షన్‌ 80సీ, సెక్షన్‌ 80డీ, సెక్షన్‌ 80సీసీడీ తదితర సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేస్తూ పన్ను ఆదాయం పొందాలనుకుంటే పూర్వపు విధానంలోనే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదా కోసం ఆయా సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయకుండా, తన ఇష్టానుసారం ఇన్వెస్ట్‌ చేసుకుంటానని అనుకుంటే నూతన పన్ను రేట్లు అనుకూలం. మరి పన్ను ఆదా సాధనాలకు గుడ్‌ బై చెప్పేసి నూతన పన్ను రేట్లకు మారిపోతారా..? లేక ఇప్పుడున్న విధానంలోనే కొనసాగుతారా..?

 

‘‘నూతన పన్ను రేట్లు ప్రస్తుతమున్న వాటి కంటే తక్కువ. కానీ, ఇవి అందరికీ సరిపోతాయని కాదు. విద్యా రుణాలు, గృహ రుణం ఉన్న వారు, రూ.15 లక్షల వేతనం ఉన్నవారు, మినహాయింపుల కారణంగా పెద్ద ఎత్తున ఆదా  చేస్తున్న వారికి నూతన శ్లాబులు పెద్దగా ప్రయోజనం కలిగించవు. నిజానికి మినహాయింపులను పెద్దగా అర్థం చేసుకోలేని వారు, పన్ను ఆదా కోసం పొదుపు చేయని వారికి నూతన శ్లాబులు అనుకూలమే. అందుకే ఇది కేసును బట్టి ఆధారపడి ఉంటుంది’’ అని ప్లాన్‌ అహెడ్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ విశాల్‌ ధావన్‌ తెలిపారు. ‘‘పన్నులను ఆదా చేసుకోవడం కంటే సౌకర్యం కోరుకునే వారికి నూతన పన్నుల విధానం మంచిది. రుణాలు, పెట్టుబడులు కలిగిన వారు, పేపర్‌ పని ఉన్నా ఫర్వాలేదనుకునే వారికి పాత విధానం మెరుగైనది. ఇది పూర్తిగా ఆయా కేసులను బట్టి ఉంటుంది. ఏది తమకు అనుకూలమన్నది లెక్క వేసుకుని తేల్చుకోవాలి’’అని లాడర్‌ 7 ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ వ్యవస్థాపకుడు సురేష్‌ సెడగోపన్‌ తెలిపారు.  చాలా మంది ఇన్వెస్టర్లు నూతన పన్ను విధానానికి వెళ్లాలని కోరుకోవచ్చని, అటువంటి వారు లాకిన్‌తో కూడిన ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయడం తెలివైన పని కాదన్నారు. మిగిలిన వారు పాత విధానంలోనే కొనసాగొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం దీన్నొక ప్రయోగంగా అమల్లోకి తీసుకొస్తుందేమో? భవిష్యత్తులో ఈ విధానంలోకి పూర్తిగా మారిపోవాలనుకుంటుందేమో? చూడాల్సి ఉందన్నారు. You may be interested

డిపాజిట్లకు ఐదు లక్షల వరకు అభయం

Sunday 2nd February 2020

బ్యాంక్‌ డిపాజిట్లపై బీమా రూ.5 లక్షలకు పెంపు ఇప్పటివరకూ ఇది లక్ష రూపాయలే న్యూఢిల్లీ: సామాన్య బ్యాంకు డిపాజిటర్లకు భరోసాను కల్పించే తీపి కబురును నిర్మలాసీతారామన్‌ ప్రకటించారు.  డిపాజిట్లకు మరింత రక్షణ కల్పిస్తూ, వాటిపై బీమాను ఐదు రెట్లు- రూ. 5 లక్షలకు పెంచారు.  వివరాల్లోకి వెళితే...  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌... ఎక్కువ మందికి సురక్షిత పెట్టుబడి సాధనం. ప్రస్తుతం డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) పరిధిలో ఒక్కో డిపాజిట్‌దారుడికి

డీడీటీ పోయి.. టీడీఎస్‌ వచ్చెన్‌

Sunday 2nd February 2020

డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ)ను ఎత్తివేయడం ఈ బడ్జెట్‌లో ప్రధాన నిర్ణయాల్లో ఒకటి. దీంతో కంపెనీలపై పన్నుల భారం తగ్గిపోయి.. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారి మీదకు భారం మళ్లినట్టయింది. ఇన్వెస్టర్లు డివిడెండ్‌ రూపంలో అందుకున్న ఆదాయాన్ని తమ వార్షికాదాయానికి కలిపి చూపించుకోవాలి. తాము ఏ శ్లాబులో ఉన్నామో ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే వారికీ డీడీటీ భారం

Most from this category